
మోహన్‌బాబు, చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి, కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు ఇద్దరూ ఇద్దరే. ఈ ఇద్దరూ కలిసి, కాసేపు మాట్లాడుకుంటే కచ్చితంగా అది హాట్ టాపిక్కే. పైగా మంచు విష్ణు కూడా చిరంజీవిని కలవడంతో పాటు ‘ఈరోజు బిగ్‌బాస్‌ని కలిశాను.. ఎందుకు కలిశాననేది త్వరలోనే చెబుతాను’ అని ట్విస్ట్ ఇచ్చారు. బుధవారం ‘ఆచార్య’ సెట్లో చిరంజీవిని కలిశారు మోహన్‌బాబు. సరదాగా ఇద్దరూ కాసేపు మాట్లాడుకున్నారు. ఇక మోహన్ బాబు ప్రస్తుతం ‘సన్ ఆఫ్ ఇండియా’ సినిమా చేస్తున్నారు. మరి... తండ్రీతనయులిద్దరూ చిరంజీవిని ఎందుకు కలిశారు అనేది తెలియాలంటే విష్ణు చెప్పేవరకూ ఆగాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment