ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబుకు సంబంధించిన విద్యాసంస్థలపై ఫిర్యాదు అందింది. తిరుపతి జిల్లా చంద్రగిరిలో మోహన్ బాబుకు విద్యాసంస్థలు ఉన్న విషయం తెలిసిందే. అయితే, నిబంధనలకు విరుద్ధంగా యాజమాన్య సిబ్బంది అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నారంటూ అఖిల భారత సాంకేతిక విద్యామం డలి (ఏఐసిటిఈ)కి పేరెంట్స్ కమిటీ ఫిర్యాదు చేసింది.
మోహన్ బాబు విద్యాసంస్థల్లో విద్యార్థుల నుంచి అడ్డుగోలుగా ఫీజులు వసూలు చేస్తున్నారంటూ ఫిర్యాదులో పేరెంట్స్ కమిటీ పేర్కొంది. విద్యార్థుల చేత బలవంతంగా యూనిఫామ్ కొనుగోలు చేపిస్తున్నారంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. డే స్కాలర్స్ ఖచ్చితంగా మధ్యాహ్నం భోజనం మెస్‌లోనే చేయాలని రూల్ పెట్టడం ఏంటి అని తల్లిదండ్రుల కమిటీ ప్రశ్నిస్తుంది. ఈ నిర్ణయాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొంది.
యాజమాన్యం చెప్పినట్లు విద్యార్థులు వినకపోతే బౌన్సర్లతో దాడులు చేయిస్తున్నారని ఏఐసిటిఈకి ఇచ్చిన ఫిర్యాదుతో పేర్కొన్నారు. నాణ్యతలేని చదువులు బోధిస్తున్నారని వారు తెలిపారు. మోహన్ బాబు విద్యాసంస్థల్లో పనిచేస్తున్న టీచింగ్ స్టాఫ్‌కు సరైన సమయానికి వేతనాలు కూడా ఇవ్వడం లేదని ఏఐసిటిఈకి పేరెంట్స్ కమిటీ ఫిర్యాదు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment