Vidyanikethan institution Mohan Babu
-
మోహన్ బాబు విద్యాసంస్థలపై ఫిర్యాదు చేసిన పేరెంట్స్ కమిటీ
ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబుకు సంబంధించిన విద్యాసంస్థలపై ఫిర్యాదు అందింది. తిరుపతి జిల్లా చంద్రగిరిలో మోహన్ బాబుకు విద్యాసంస్థలు ఉన్న విషయం తెలిసిందే. అయితే, నిబంధనలకు విరుద్ధంగా యాజమాన్య సిబ్బంది అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నారంటూ అఖిల భారత సాంకేతిక విద్యామం డలి (ఏఐసిటిఈ)కి పేరెంట్స్ కమిటీ ఫిర్యాదు చేసింది.మోహన్ బాబు విద్యాసంస్థల్లో విద్యార్థుల నుంచి అడ్డుగోలుగా ఫీజులు వసూలు చేస్తున్నారంటూ ఫిర్యాదులో పేరెంట్స్ కమిటీ పేర్కొంది. విద్యార్థుల చేత బలవంతంగా యూనిఫామ్ కొనుగోలు చేపిస్తున్నారంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. డే స్కాలర్స్ ఖచ్చితంగా మధ్యాహ్నం భోజనం మెస్‌లోనే చేయాలని రూల్ పెట్టడం ఏంటి అని తల్లిదండ్రుల కమిటీ ప్రశ్నిస్తుంది. ఈ నిర్ణయాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొంది. యాజమాన్యం చెప్పినట్లు విద్యార్థులు వినకపోతే బౌన్సర్లతో దాడులు చేయిస్తున్నారని ఏఐసిటిఈకి ఇచ్చిన ఫిర్యాదుతో పేర్కొన్నారు. నాణ్యతలేని చదువులు బోధిస్తున్నారని వారు తెలిపారు. మోహన్ బాబు విద్యాసంస్థల్లో పనిచేస్తున్న టీచింగ్ స్టాఫ్‌కు సరైన సమయానికి వేతనాలు కూడా ఇవ్వడం లేదని ఏఐసిటిఈకి పేరెంట్స్ కమిటీ ఫిర్యాదు చేసింది. -
వినూత్న ఆలోచనలకు వేదిక మోహన మంత్ర
సాక్షి, చంద్రగిరి(చిత్తూరు) : విద్యార్థుల్లోని వినూత్న ఆలోచనలకు పదును పెట్టేందుకు వేదికగా మోహన మంత్ర–19 నిలుస్తోందని శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థల సీఈఓ, సినీ నటుడు మంచు విష్ణు అన్నారు. శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థల్లో శుక్రవారం మోహన మంత్ర–19 కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీయడమే ముఖ్య ఉద్దేశంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సాంకేతిక, సాంస్కృతిక ప్రదర్శనల ద్వారా విద్యార్థుల్లో ఉత్సాహంతో పాటు వినూత్న ఆలోచనలు ఆవిష్కృతమవుతాయన్నారు. ఏడు సంవత్సరాల నుంచి ఏటా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని విద్యార్థులు విజయవంతం చేస్తున్నారని తెలిపారు. మూడు రోజుల పాటు నిర్వహించే ఈ కార్యక్రమానికి దేశ వ్యాప్తంగా సుమారు 30 వేల మంది విద్యార్థులు హాజరయ్యారని చెప్పారు. వచ్చే ఏడాది నుంచి అంతర్జాతీయ స్థాయిలో కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నట్లు తెలిపారు. ఉత్సాహంగా ... ఉల్లాసంగా .. తొలిరోజు మోహన మంత్ర కార్యక్రమం ఉత్సాహంగా..ఉల్లాసంగా సాగింది. విద్యార్థులతో ఉల్లాసంగా సాగింది. విద్యార్థులు టెక్నో హాలిక్ విభాగంలో ప్రదర్శించిన రోబో వార్ చూపరులను ఆకట్టుకుంది. కబడ్డీ, గల్లీ క్రికెట్, షార్ట్ ఫిలిమ్స్ విభాగంలో విద్యార్థులు ప్రదర్శించిన ప్రదర్శనలు అబ్బురపరిచా యి. సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. -
వేడి వేడి ఇడ్లీ..పూరీ..మసాలా దోసె
‘పెదరాయుడు హోటల్’ స్పెషల్ ‘మేము సైతం’కోసం అమ్మకాలు సాగించిన డైలాగ్‌కింగ్ పేదవాడికి సాయం చేయడం ఆత్మసంతృప్తన్న మోహన్‌బాబు చంద్రగిరి: పేదవాడికి సాయం చేయడంలో నిజమైన ఆత్మ సంతృప్తి ఉందని విద్యానికేతన్ విద్యాసంస్థల అధినేత, సినీ నటుడు డాక్టర్ మోహన్‌బాబు అన్నారు. తిరుపతికి సమీపంలోని విద్యానికేతన్ విద్యాసంస్థల ప్రాంగణంలో మోహన్‌బాబు తన కుమార్తె లక్ష్మీప్రసన్న తలపెట్టిన మేముసైతం కార్యక్రమానికి ఊతంగా నిలిచారు. ఇందుకు గాను గురువారం ‘పెదరాయుడు హోటల్’ పేరుతో ఆయనే స్వయంగా ఇడ్లీలు, పూరీలు, దోసెలు వేసి విక్రయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘మేము సైతం‘లో భాగంగా ఎవరైనా పేదలు ప్రమాదవశాత్తూ నష్టపోతే వారిని ఆదుకునేందుకు బాధితుల వృత్తినే తాము ఆచరించి తద్వారా సంపాదించిన మొత్తాన్ని వారికి విరాళంగా ఇస్తున్నామన్నారు. ఇలా చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తికి చెందిన మస్తానయ్య ఆటో నడుపుతూ జీవించేవారన్నారు. ప్రమాదవశాత్తూ ఆయన కాలు విరిగి పోవడంతో ప్రస్తుతం తోపుడు బండిపై ఆయన కుటుంబ సభ్యులు అల్పాహారం విక్రయించి జీవిస్తున్నారని తెలిపారు. వారిని ఆదుకునేందుకు శ్రీవిద్యానికేతన్ ప్రాంగణంలో హోటల్ పెట్టి గురువారం వ్యాపారం చేశామన్నారు. మూడు వేలమంది విద్యార్థులు, ప్రాంగణంలోని హాస్టళ్ల యజమానులు ఈ కార్యక్రమంలో పాల్గొని వారికి తోచిన సాయం చేశారని తెలిపారు. రూ. 2.20 లక్షలు వచ్చిందనీ ఆ మొత్తాన్ని బాధితులకు అందజేస్తామన్నారు.