యాంకర్, నటి మంచు లక్ష్మి కొన్ని నెలల క్రితం ముంబైకి షిఫ్ట్ అయింది. హైదరాబాద్ నుంచి తన మకాంను ముంబైకి మార్చేసింది. వృత్తిపరమైన పనుల రీత్యా అక్కడకు షిఫ్ట్ అయినట్లు ఆమె వెల్లడించింది. ప్రస్తుతం ఆమె అక్కడ సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేసేందుకు ప్లాన్ చేస్తుంది.
మంచు లక్ష్మి ఎక్కడ ఉన్నా తన ఇంటిని చాలా యూనిక్‌గా ఉండేలా చూసుకుంటుంది. హైదరాబాద్‌లోని తన ఇంటితో పాటు మోహన్‌బాబు ఇంటిని కూడా వీడియో తీసి తన యూట్యూబ్ ఛానల్‌లో పోస్ట్ చేసింది. ఇదే క్రమంలో తాజాగా ముంబైలో తాను ఉంటున్న ఇంటిని వీడియో తీసి అభిమానుల కోసం విడుదల చేసింది.
ఎక్కడున్నా ఎవరికైనా ఇల్లే స్వర్గం.. ముంబైకి షిఫ్ట్ అయ్యాక తన అభిరుచులకు తగిన ఇంటి కోసం దాదాపు వారం రోజులపాటు 28 ఫ్లాట్స్ చూసినట్లు ఆమె చెప్పుకొచ్చింది.. ఫైనల్‌గా ప్రస్తుతం ఉంటున్న ఇంటిని ఉద్దేశించి దీనిని సెలెక్ట్ చేసుకున్నానని చెప్పింది. కానీ అక్కడ వస్తువులన్నీ చాలావరకు హైదరాబాద్‌లోని తన ఇంటి నుంచి తెచ్చుకున్నవే అని ఆమె తెలిపింది. ఎంతో అద్భుతంగా ఉన్న మంచు లక్ష్మీ ఇంటిని మీరూ చూసేయండి.
ముంబైకి షిఫ్ట్ అయ్యాక లక్ష్మి ఏం చెప్పింది అంటే
తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. 'సౌత్‌లో చాలా రకాల రోల్స్ చేశాను. కానీ అవి కొన్ని పరిమితులకు లోబడే ఉన్నాయి ఇంకా విభిన్న పాత్రలు చేయాలనుకుంటున్నాను. ముంబైలో అయితే అది వీలవుతుంది. సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేసేందుకు నేను రెడీగా ఉన్నాను. ఆడిషన్స్‌కు కూడా సిద్ధమే! ఆఫీసుకు రమ్మన్నా వస్తాను. ముంబైలో నేను స్టార్ కిడ్‌ను కాదు. ఇక్కడ కొత్తగా ప్రయాణాన్ని ప్రారంభించాలనుకుంటున్నాను. అందుకిదే సరైన సమయమని భావిస్తున్నాను. నిజానికి నేను లాస్ ఏంజిల్స్ వెళ్లిపోదామనుకున్నాను. అని గతంలో తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment