టాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప. ఈ మూవీలో ప్రభాస్ సహా పలువురు స్టార్ హీరోలు నటించనున్నారు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ మొదలైంది. అయితే రెండు రోజుల క్రితం న్యూజిలాండ్‌లో చిత్రీకరణ జరుగుతున్న సమయంలో మంచు విష్ణు గాయపడ్డట్లు ప్రచారం జరిగింది.
యాక్షన్ సన్నివేశాలను డ్రోన్ సాయంతో చిత్రీకరిస్తుండగా.. అదుపుతప్పిన డ్రోన్ విష్ణు మీదకు రావడంతో ఆయన చేతికి గాయాలయ్యాయి. దీంతో షూటింగ్ క్యాన్సిల్ అవగా మంచు విష్ణు చికిత్స పొందుతున్నాడు. తాజాగా అతడి తండ్రి మోహన్ బాబు.. మంచు విష్ణు హెల్త్ అప్‌డేట్ గురించి ట్వీట్ చేశాడు. 'కన్నప్ప షూటింగ్‌లో గాయపడ్డ విష్ణు పట్ల మీరు చూపిస్తున్న ప్రేమాభిమానాలకు, మద్దతుకు ధన్యవాదాలు. భగవంతుడి దయతో అతడు కోలుకుంటున్నాడు. త్వరలోనే తిరిగి షూటింగ్‌లో పాల్గొంటాడు' అని ట్వీట్ చేశాడు.
ఇకపోతే బుల్లితెరపై మహాభారతం సీరియల్ తీసిన ముఖేశ్ కుమార్ సింగ్ కన్నప్ప సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. శివ భక్తుడైన కన్నప్ప కథను ఆధారంగా తీసుకుని తెరకెక్కుతున్న ఈ మూవీలో మంచు విష్ణు కన్నప్పగా కనిపించనున్నాడు. పరుచూరి గోపాలకృష్ణ, బుర్రా సాయిమాధవ్, తోట ప్రసాద్ రచనా సహకారం అందిస్తున్నారు.
Grateful for all the love, wishes, and concern during @iVishnuManchu accident on the set of #Kannappa in New Zealand. By God's grace, he's on the road to recovery and will be back to shooting soon. Thank you for your support. 🙏 Har Har Mahadev!
— Mohan Babu M (@themohanbabu) November 1, 2023
చదవండి: ఎనిమిది నెలల గర్భిణి.. బిడ్డను చూడకుండానే కన్నుమూసిన నటి
Comments
Please login to add a commentAdd a comment