![Manchu Mohan Babu Letter Released On Politics - Sakshi](/styles/webp/s3/article_images/2024/02/26/mohan.jpg.webp?itok=tTpCLWp9)
కొద్దిరోజుల్లో ఎన్నికలు జరుగుతున్న వేళ విలక్షణ నటులు, నిర్మాత మంచు మోహన్‌బాబు ఒక లేఖ విడుదల చేశారు. ఏ పార్టీ వారైనా తన పేరును వారి సొంత ప్రయోజనాల కోసం వాడుకోవద్దని ఆయన ఇలా విజ్ఞప్తి చేశారు. 'ఈ మధ్య కాలంలో నా పేరుని రాజకీయంగా కొందరు ఉపయోగించుకుంటున్నట్లుగా నా దృష్టికి వచ్చింది. దయచేసి ఏ పార్టీ వారైనా నా పేరును వారి వారి స్వప్రయోజనాల కోసం వాడుకోవద్దని కోరుతున్నాను.
మనం అనేక రకాల భావావేశాలున్న వ్యక్తుల ప్రపంచంలో జీవిస్తున్నాము. ఎవరి అభిప్రాయాలు వారివి. అది వారి వారి వ్యక్తిగతం. చేతనైతే నలుగురికి సాయపడడంలోనే మనం దృష్టి పెట్టాలిగాని, సంబంధం లేని వారిని రాజకీయ పార్టీలలోకి, వారి వారి అనుబంధ సంస్థల్లోకి తీసుకురావడం బాధాకరం.
నాకు అండదండగా ఉన్న ప్రతి ఒక్కరికి అభివందనాలు తెలియజేస్తున్నాను.శాంతి, సౌభ్రాతృత్వాలను వ్యాపింపజేయడంలో అందరం బద్ధులై ఉందామని కోరుకుంటున్నాను. ఉల్లంఘించిన వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరిస్తున్నాను.' అని మంచు మోహన్ బాబు ఒక లేఖను తన ఎక్స్‌పేజీలో విడుదల చేశారు.
విజ్ఞప్తి pic.twitter.com/kHnATpRdA5
— Mohan Babu M (@themohanbabu) February 26, 2024
Comments
Please login to add a commentAdd a comment