మంచు ఫ్యామిలీలో జరుగుతున్న వివాదంపై మోహన్ బాబు స్పందించారు. తమ ఇంట్లో జరుగుతున్నది చిన్న తగాదా అని.. అది తామే పరిష్కరించుకుంటామని చెప్పారు. విదేశాల నుంచి వచ్చిన పెద్ద కొడుకు మంచు విష్ణుకు స్వాగతం పలికేందుకు మంగళవారం ఉదయం మోహన్ బాబు ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లారు. అనంతరం విష్ణుతో కలిసి ఒకే కారులో జల్‌పల్లిలోని ఆయన నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా మంచు మోహన్ బాబు మీడియాతో మాట్లాడుతూ.. ‘ఏ ఇంట్లో నైనా అన్నదమ్ముల మధ్య గొడవలు సహజంగానే జరుగుతాయి. మా ఇంట్లో కూడా అలాంటి చిన్న గొడవే జరిగింది. అది అంతర్గతంగా చర్చించుకుంటాం. మా ఇంట్లో జరుగుతున్న చిన్న తగాదా ఇది.. పరిష్కరించుకుంటాం. గతంలో ఎన్నో కుటుంబాల సమస్యలను నేను పరిష్కరించాను. అందరిని కలిపే ప్రయత్నం చేశాం. మా ఫ్యామిలీ సమస్యను కూడా త్వరనే పరిష్కరించుకుంటాం’అని అన్నారు.
కొడుకుపై ఫిర్యాదు.. స్పందించిన మనోజ్
గుర్తు తెలియని వ్యక్తులు తనపై దాడి చేశారంటూ మంచు మనోజ్ సోమవారం పోలీసుకుల ఫిర్యాదు చేయడంతో మంచు ఫ్యామిలీ గొడవ మరింత పెద్దదైంది. మనోజ్ ఫిర్యాదు చేసిన గంటలోనే మోహన్ బాబు కొడుకు మనోజ్‌పై రాచకొండ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన చిన్న కుమారుడు మనోజ్‌తో ప్రాణహానీ ఉందని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నాడు. మనోజ్‌తో పాటు అతని భార్య మౌనికపై కూడా చర్యలు తీసుకోవాలని కోరాడు.
తండ్రి ఫిర్యాదుపై మనోజ్ స్పందిస్తూ.. సోషల్ మీడియా వేదికగా ఓ ప్రకటన విడుదల చేశాడు. తనపై, తన భార్య మౌనికపై మోహన్ బాబు చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించాడు. ‘నా పరువు తీయడానికి, నా గొంతు నొక్కడానికే మా నాన్న మోహన్ బాబు ఉద్దేశపూర్వకంగా ఇలాంటి ఆరోపణలు చేస్తున్నాడు’ అంటూ మనోజ్ సోషల్ మీడియాలో ఓ సుదీర్గమైన పోస్ట్ పెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment