ఆమె బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్‌కు వీరాభిమాని. తొలుత మోడలింగ్ చేసింది. ఆ తర్వాత సీరియల్స్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అలా అలా తమ అభిమానంతో 'జవాన్'తో చాలా చిన్న పాత్రలో నటించే అవకాశం దక్కించుకుంది. ప్రస్తుతం తెలుగులోనూ హీరోయిన్‌గా ఓ సినిమా చేసింది. ఇప్పుడది రిలీజ్ కానున్న నేపథ్యంలో తన ఆనందాన్ని వ్యక్తం చేసింది.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన ఆ హిట్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్)
తమిళంలో సీరియల్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న లీషా ఎక్లైర్స్.. తాజాగా తెలుగులో 'రైట్' అనే మూవీలో హీరోయిన్‌గా చేసింది. బిగ్‌బాస్ 2 ఫేమ్ కౌశల్ ఇందులో హీరోగా చేశాడు. దాదాపు రెండేళ్ల నుంచి సెట్స్‌పై ఉన్న ఈ చిత్రం.. తాజాగా థియేటర్లలోకి వచ్చింది ఈ సందర్భంగా బ్యూటీ లీషా ఎక్లైర్స్ తన ఆనందాన్ని పంచుకుంది. షారుక్ అభిమాని అయిన తాను.. ఇప్పుడు హీరోయిన్‌గా సినిమాలు చేస్తుండటం ఆనందంగా ఉందని చెప్పుకొచ్చింది.
(ఇదీ చదవండి: Bubblegum Review: 'బబుల్ గమ్' సినిమా రివ్యూ)
Comments
Please login to add a commentAdd a comment