చిత్రం: ప్రేమలో
నిర్మాణ సంస్థ: డ్రీమ్ జోన్ పిక్చర్స్
నటీనటులు: చందు కోడూరి, చరిష్మా శ్రీకర్, శివాజీ రాజా తదితరులు
దర్శకుడు: చందు కోడూరి
నిర్మాత: రాజేష్ కోడూరి
సంగీతం: సందీప్ కనుగుల
ఎడిటర్: కోదాటి పవన్ కళ్యాణ్
చందు కోడూరి హీరోగా నటించి స్వీయదర్శకత్వంలో తీసిన సినిమా 'ప్రేమలో'. చరిష్మా శ్రీకర్ హీరోయిన్. ట్రైలర్‌తోనే ఆకట్టుకున్న ఈ చిత్రం.. తాజాగా థియేటర్లలోకి వచ్చింది. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉంది? ఏంటనేది రివ్యూలో ఇప్పుడు చూద్దాం.
'ప్రేమలో' కథేంటి?
రాజమండ్రిలో పుట్టి పెరిగిన రవి (చందూ కోడూరి) చిన్నప్పుడే తల్లిని కోల్పోతాడు. తండ్రి(శివాజీ రాజా) ఉన్నాసరే రవిని పట్టించుకోకుండా తాగుడికి బానిస అయిపోయింటాడు. మెడికల్ షాప్‌లో పనిచేసే రవి.. ఎప్పటికైనా ఓ మెడికల్ షాప్ పెట్టుకోవాలనేది మనోడి డ్రీమ్. అనుకోకుండా ప్రశాంతి(చరిష్మా)ని చూసి తొలిచూపులోనే ప్రేమించేస్తాడు. మూగదైన ప్రశాంతి.. ఇష్టపడుతున్నానని రవి చెప్పేసరికి ఇతడిని ప్రేమిస్తుంది. అంతా బాగుందనుకున్న సమయంలో ప్రశాంతి.. ఆత్మహత్య ప్రయత్నం చేస్తుంది. రవి తనని రేప్ చేస్తున్న వీడియోనే దీనికి కారణమని తెలుస్తోంది. అయితే ప్రాణంగా ప్రేమించిన రవి.. ఎందుకు ఆమెపై బలత్కారం చేశాడు? అసలేం జరిగింది? అనేదే స్టోరీ.
(ఇదీ చదవండి: 'సలార్' నటుడికి కోర్టు నోటీసులు.. కారణం అదే?)
ఎలా ఉందంటే?
తెలుగులో లవ్ స్టోరీ సినిమాలు ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి. 'ప్రేమలో' సినిమా కూడా పేరుకు తగ్గట్లే మొత్తం ప్రేమ చుట్టూనే తిరుగుతుంది. మొదలుపెట్టడమే ఓ వ్యక్తి మీద ఎటాక్ చేయడం చూపించి సినిమాని ఆసక్తిని పెంచే ప్రయత్నం చేశారు. అసలు ఏమైంది? ఎందుకు ఒక్కొక్కరిని హీరో ఎందుకు ఛేజ్ చేస్తున్నాడనే విషయం నెమ్మదిగా రివీల్ చేస్తూ కథలోకి తీసుకువెళ్లారు. ఫస్టాప్‌లో హీరో క్యారెక్టర్, స్టోరీని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశారు.సెకండాఫ్‌లో అసలు కథేంటనేది రివీల్ చేశారు.
నిజానికి ఇది కొత్త కథేం కాదు. రాజమండ్రి బ్యాక్ డ్రాప్‌లో పూర్తిస్థాయి గోదావరి యాసలో ఎక్కడ బోర్ కొట్టకుండా ప్రేక్షకులను ఎంగేజ్ చేయడంలో దర్శకుడు సఫలమయ్యాడు. ప్రేమించిన వారి కోసం ఎంత దూరమైనా వెళతాం అని డైలాగులు చెప్పే ప్రేమికులే ఉన్న ఈ రోజుల్లో.. ప్రేమించిన అమ్మాయి కోసం చావుకు కూడా వెనకాడకుండా ముందుకు వెళ్లేవారు ఉన్నారని ఒక సినిమాటిక్ టచ్ ఇచ్చి మరీ చెప్పారు. రొటీన్ కథ, ఊహకు అందేలా ఉన్న సీన్లు కొంత నిరాశ కలిగిస్తాయి. స్క్రీన్ ప్లే విషయంలో మరింత వర్కౌట్ చేస్తే బాగుండేది. క్లైమాక్స్ ఎవరు ఊహించని విధంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు డైరెక్టర్.
(ఇదీ చదవండి: 'యానిమల్' ఓటీటీ రిలీజ్.. ఆ విషయంలో అభిమానులు అసంతృప్తి)
ఎవరెలా చేశారు?
హీరో కమ్ డైరెక్టర్ చందు కోడూరి.. అయితే ఈయనలోని దర్శకుడిని నటుడు కొంత డామినేట్ చేసే ప్రయత్నం చేశాడు. ఎలాంటి చెడు అలవాట్లు లేక జీవితంలో ఒక లక్ష్యం పెట్టుకుని ముందుకు వెళ్లే యువకుడి పాత్రలో చందు సరిగ్గా సరిపోయాడు. నటనతో ఆకట్టుకున్నాడు. హీరోయిన్ ప్రశాంతి.. డైలాగ్స్ లేని పాత్రలో కళ్ళతోనే భావాలు పలికించి ఆకట్టుకుంది. శివాజీ రాజా చేసింది అతిథి పాత్ర లాంటిదే. కానీ ఉన్నంతవరకు ఎమోషన్స్ పండించాడు. మిగతా వాళ్లు పర్వాలేదనిపించారు. టెక్నికల్ టీమ్ విషయానికి వస్తే పాటలు పెద్దగా గుర్తుండవు. బ్యాక్ గ్రౌండ్ స్కోరు పర్వాలేదనిపించింది. సినిమాటోగ్రఫీ సరిగా సరిపోయింది. నిర్మాణ విలువలు స్థాయికి తగినట్టుగా ఉన్నాయి.
(ఇదీ చదవండి: ‘105 మినిట్స్’ మూవీ రివ్యూ)
Comments
Please login to add a commentAdd a comment