సతీష్ బాబు రాటకొండ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహించిన సినిమా 'జాతర'. దీయా రాజ్ హీరోయిన్. రాధాకృష్ణారెడ్డి, శివశంకర్ రెడ్డి నిర్మించారు. రగ్డ్, ఇంటెన్స్ డ్రామాతో చిత్తూరు జిల్లా బ్యాక్ డ్రాప్‌లో జరిగే జాతర నేపథ్యంలో సినిమాని తీశారు. తాజాగా నవంబర్ 8న థియేటర్లోకి వచ్చింది. ఈ చిత్రం ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.
కథేంటి?
ఆలయ పూజారి పాలేటి. అతని కొడుకు చలపతి (సతీష్ బాబు రాటకొండ) ఓ నాస్తికుడు. అదే ఊరికి చెందిన వెంకట లక్ష్మి (దీయ రాజ్)తో చలపతి ప్రేమలో ఉంటాడు. ఓరోజు పాలేటి కలలోకి గంగావతి గ్రామదేవతలు వచ్చి ఇక్కడే ఉండి గ్రామాన్ని దురాచారాల నుండి రక్షించమని కోరుతుంది. ఆ తర్వాత గ్రామం నుండి అదృశ్యమవుతుంది. గ్రామ దేవత అకస్మాత్తుగా గ్రామాన్ని విడిచిపెట్టడం చెడు సంకేతం అని ప్రజలు నమ్ముతారు. మరోవైపు గంగిరెడ్డి (ఆర్కే నాయుడు) గ్రామ కార్యకలాపాలను చేపట్టడం, గ్రామ దేవతలను శాశ్వతంగా ఉండడానికి తన ఇంటికి ఆహ్వానించడం లాంటివి చేస్తాడు. ఇంతకీ గంగిరెడ్డి, పాలేటి కుటుంబానికి సంబంధమేంటి? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన దేవర, వేట్టయన్, జనక అయితే గనక.. ఏది ఎందులో?)
ఎలా ఉందంటే?
పల్లెటూరి సంస్కృతి, ఊర్లో జాతరను తలపించేలా ఈ సినిమా ఉంటుంది. అందరినీ కట్టిపడేసేలా, కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ కాకుండా ఈ చిత్రాన్ని అందించడంలో దర్శకుడు చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. కథను చెప్పడంలో పర్లేదనిపించాడు. సంగీతంతో పాటు సినిమాలో పల్లెటూరి అందాలని, దేవత సన్నివేశాలను బాగా చూపించారు.
సినిమా నెమ్మదిగా మొదలైనప్పటికీ తక్కువ సమయంలో స్టోరీకి ప్రేక్షకులు కనెక్ట్ అయిపోతారు. ముఖ్యంగా దేవత సన్నివేశాలు, బీజీఎం.. సినిమా మొత్తం ఆడియెన్స్‌ని వెంటాడతాయి. సినిమాలో చాలా సర్ప్రైజ్‌లు, ట్విస్ట్‌లు ఉన్నాయి. ప్రారంభంలో, ప్రీ ఇంటర్వెల్, క్లైమాక్స్ సన్నివేశాలు ఆకట్టుకున్నాయి.
ఎవరెలా చేశారు?
సతీష్ బాబు.. నటుడు, రచయిత, దర్శకుడిగా తన ప్రతిభ చూపించారు. హీరోయిన్‌గా చేసిన దీయా రాజ్ పర్లేదనిపించింది. గంగిరెడ్డి పాత్రలో ఆర్కే నాయుడు సూట్ అయిపోయాడు. మిగిలిన పాత్రధారులు న్యాయం చేశారు.
(ఇదీ చదవండి: 'బ్లడీ బెగ్గర్' సినిమా రివ్యూ)
Comments
Please login to add a commentAdd a comment