చంద్రశేఖర్ రాథోడ్, కాశ్వీ కాంచన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా గ్యాంగ్ స్టర్. అభినవ్ జనక్, అడ్ల సతీష్ కుమార్, సూర్య నారాయణ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. వైల్డ్ వారియర్ ప్రొడక్షన్స్‌లో రవి, నరసింహా సమర్పణలో చంద్రశేఖర్ రాథోడ్ దర్శకత్వం వహిస్తున్న గ్యాంగ్ స్టర్ సినిమా అక్టోబర్ 25న రిలీజ్‌కు రెడీ అవుతోంది.
తాజాగా ఈ చిత్ర విడుదల తేదీ పోస్టర్‌ను సాయి మాధవ్ బుర్ర విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సినిమా టీజర్, ట్రైలర్ ఇంకా పోస్టర్స్ అద్భుతంగా ఉన్నాయి. ఈ మూవీకి కష్టపడ్డ ప్రతి ఒక్కరిని విజయం వరించాలని కోరుకుంటున్నాను అన్నారు. నటుడు అభినవ్ జనక్ మాట్లాడుతూ.. రెండు గ్యాంగ్స్ మధ్య వార్‌ను డైరెక్టర్ చంద్రశేఖర్ ఆకట్టుకునేలా డిజైన్ చేశాడు. ప్రతి సీన్ బాగుంటుంది. ఈ చిత్రంలో నేనొక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాను అన్నాడు.
హీరో, దర్శక నిర్మాత చంద్రశేఖర్ రాథోడ్ మాట్లాడుతూ.. సినిమా అంటే నాకు చాలా ఇష్టం. అన్నపూర్ణ స్టూడియోస్ లో డీఎఫ్ టీ కోర్స్ చేశాను. దిల్ రాజు గారు ట్రైలర్ చూసి బాగుందన్నారు. మా సినిమా తేదీ ప్రచార చిత్రాన్ని విడుదల చేసిన సాయి మాధవ్ బుర్రా గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment