శివ కందుకూరి హీరోగా రాశి సింగ్ హీరోయిన్‌గా నటించిన చిత్రం భూతద్దం భాస్కర్. పురుషోత్తం రాజ్ దర్శకత్వం వహించగా మిలియన్ డ్రీమ్స్ క్రియేషన్స్, విజయ సరాగ ప్రొడక్షన్స్ బ్యానర్లపై స్నేహల్ జంగాల, శశిధర్ కాశి, కార్తీక్ ముడుంబై సంయుక్తంగా నిర్మించారు. ఇటీవల ఈ సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌కు మంచి స్పందన లభించిన విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని మార్చి 31న విడుదల చేయాలని నిర్మాతలు నిర్ణయించుకున్నారు. దీనికి కూడా చిన్న మోషన్ పోస్టర్‌తో డేట్ ఎనౌన్స్ చేస్తారు.
ఈ చిత్రంలో తర్వాత జరగబోయే సన్నివేశాలను ముందుగా ఊహించడం చాలా కష్టంగా ఉంటుందని, ఆరేంజ్‌లో దర్శకుడి స్క్రీన్‌ప్లే వుంటుందని నిర్మాతలు తెలిపారు. ఈ సినిమాకు శ్రీచరణ్ పాకాల, విజయ్ బుల్గానిన్ సంగీతం అందించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
చదవండి: వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ
నాటు నాటు.. ఆ పాటేంది? ఆ యాసేంది? నటి ఘాటు రిప్లై
Comments
Please login to add a commentAdd a comment