రామ్ మోహన్ కంచుకొమ్మల దర్శకుడిగా పరిచమవుతున్న చిత్రం ‘రామ్ మోహన్ కంచుకొమ్మల’. ముకుంద మూవీస్ పతాకంపై సి.కల్పన నిర్మిస్తున్న వైవిధ్యభరిత మహిళా ప్రధాన చిత్రమిది. ఇందులో రామ్ కంచుకొమ్మల లీడ్ రోల్ పోషిస్తున్నారు. దివ్వకీర్తి, గరిమాసింగ్, నైనిక వరాలబాబు, సంతోష్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. సెన్సార్‌తో సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 16న విడుదలకు రెడీ అవుతోంది.
ఈ సందర్భంగా దర్శకుడు రామ్ మోహన్ కంచుకొమ్మల మాట్లాడుతూ.. ‘‘అమ్మాయిలపై జరిగే అఘాయిత్యాల నేపథ్యంలో వారిలో స్ఫూర్తి నింపేలా ఈ చిత్రాన్ని రూపొందించాం. సింగిల్ కట్ చెప్పకుండా మా సినిమా ‘ఎ’ సర్టికెట్‌తో సెన్సార్ పూర్తయ్యింది. ఈనెల 16న సుమారు 100 థియేటర్లలో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. దేవీప్రియ, రిషిత, మైత్రి, మహేశ్వరి, ఆపిల్ బాబు, త్రిమూర్తులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి రాజ్ కిరణ్-లలిత్ కిరణ్- రాము అద్దంకిలు సంగీతం అందించారు.
Comments
Please login to add a commentAdd a comment