సమాజానికి స్ఫూర్తినిచ్చే 'కంచర్ల'.. త్వరలో రిలీజ్ | Kancharla Telugu Movie Soon To Release In Theatres | Sakshi
Sakshi News home page

సమాజానికి స్ఫూర్తినిచ్చే 'కంచర్ల'.. త్వరలో రిలీజ్

Jan 20 2024 7:23 PM | Updated on Jan 20 2024 7:23 PM

Kancharla Telugu Movie Soon To Release In Theatres - Sakshi

సమ సమాజం, నవ సమాజ నిర్మాణానికి  స్ఫూర్తినిచ్చే సినిమాలు తెలుగులో చాలా వచ్చాయి. ఇప్పుడు అలాంటి కాన్సెప్ట్‌తో తీసిన చిత్రం 'కంచర్ల'. ఎస్.ఎస్.ఎల్.ఎస్ క్రియేషన్స్ పతాకంపై కంచర్ల ఉపేంద్ర హీరోగా, మీనాక్షి జైస్వాల్, ప్రణీత హీరోయిన్లుగా నటించారు. రెడ్డెం యాద కుమార్ దర్శకత్వం వహించారు. కంచర్ల అచ్యుత రావు నిర్మించారు. తాజాగా టాకీ పార్ట్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం.. త్వరలో విడుదల కానుంది. 

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన 'సలార్'.. అక్కడ మాత్రం ఇంకా పెండింగ్‌లోనే)

యువత రాజకీయాల్లోకి రావాలని, భూస్వాముల దగ్గర ఉన్న భూమి పేద ప్రజలకు పంచాలన్నది ఈ చిత్ర ప్రధానాంశం. దీనికి కమర్షియల్ అంశాలను మేళవించి, ప్రేక్షకులను అలరింపజేసేలా చిత్రాన్ని మలచామని నిర్మాత అచ్యుత రావు చెప్పారు. రఘు కుంచె సంగీతమందించిన ఈ చిత్రం త్వరలో థియేటర్లలోకి రానుంది.

(ఇదీ చదవండి: హీరోయిన్ రష్మిక డీప్ ఫేక్ వీడియో.. ఎట్టకేలకు నిందితుడి అరెస్ట్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement