kancharla
-
గాంధీ భవన్ కు అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి
-
కంచర్ల సందేశం
‘ఉపేంద్రగాడి అడ్డా’ ఫేమ్ కంచర్ల ఉపేంద్ర బాబు హీరోగా నటిస్తున్న చిత్రం ‘కంచర్ల’. యాద్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మీనాక్షీ జైస్వాల్ హీరోయిన్. సుమన్, అజయ్ ఘోష్ ఇతర పాత్రలు చేశారు. ఎస్ఎస్ఎల్వీ క్రియేషన్స్ పై కంచర్ల అచ్యుతరావు నిర్మిస్తున్నారు. అరకులో చిత్రీకరించిన తాజా షెడ్యూల్‌తో ఈ మూవీ చిత్రీకరణ పూర్తయింది.ఈ సందర్భంగా కంచర్ల అచ్యుతరావు మాట్లాడుతూ–‘‘మా ఇంటి పేరైన ‘కంచర్ల’ టైటిల్‌తో సినిమా నిర్మించడం సంతోషంగా ఉంది. ఆగస్టు 15 తర్వాత సినిమా విడుదల చేస్తాం’’ అన్నారు. ‘‘మంచి కథాంశంతో తీసిన మా చిత్రం గొప్ప విజయం అందుకుంటుంది’’ అన్నారు కంచర్ల ఉపేంద్ర బాబు. ‘‘కంచర్ల’ సినిమాలో మంచి సందేశం ఉంటుంది’’ అన్నారు యాద్ కుమార్. ‘‘మా మూవీ అన్ని వర్గాల ప్రేక్షుకులని ఆకట్టుకుంటుంటుంది’’ అన్నారు మీనాక్షీ జైస్వాల్. -
కులం పేరుతో దూషించి దాడి చేసిన టీడీపీ ఎమ్మెల్సీ పై కేసు నమోదు
-
సమాజానికి స్ఫూర్తినిచ్చే 'కంచర్ల'.. త్వరలో రిలీజ్
సమ సమాజం, నవ సమాజ నిర్మాణానికి స్ఫూర్తినిచ్చే సినిమాలు తెలుగులో చాలా వచ్చాయి. ఇప్పుడు అలాంటి కాన్సెప్ట్‌తో తీసిన చిత్రం 'కంచర్ల'. ఎస్.ఎస్.ఎల్.ఎస్ క్రియేషన్స్ పతాకంపై కంచర్ల ఉపేంద్ర హీరోగా, మీనాక్షి జైస్వాల్, ప్రణీత హీరోయిన్లుగా నటించారు. రెడ్డెం యాద కుమార్ దర్శకత్వం వహించారు. కంచర్ల అచ్యుత రావు నిర్మించారు. తాజాగా టాకీ పార్ట్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం.. త్వరలో విడుదల కానుంది. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన 'సలార్'.. అక్కడ మాత్రం ఇంకా పెండింగ్‌లోనే) యువత రాజకీయాల్లోకి రావాలని, భూస్వాముల దగ్గర ఉన్న భూమి పేద ప్రజలకు పంచాలన్నది ఈ చిత్ర ప్రధానాంశం. దీనికి కమర్షియల్ అంశాలను మేళవించి, ప్రేక్షకులను అలరింపజేసేలా చిత్రాన్ని మలచామని నిర్మాత అచ్యుత రావు చెప్పారు. రఘు కుంచె సంగీతమందించిన ఈ చిత్రం త్వరలో థియేటర్లలోకి రానుంది. (ఇదీ చదవండి: హీరోయిన్ రష్మిక డీప్ ఫేక్ వీడియో.. ఎట్టకేలకు నిందితుడి అరెస్ట్) -
Allu Arjun In Nalgonda Latest Photos: నాగార్జునసాగర్‌లో ఐకాన్ స్టార్ సందడి (ఫొటోలు)
-
కుప్పం నుంచే ఎన్నికలకు పిలుపునిస్తారా?
సాక్షి, తిరుపతి: టీడీపీ అధినేత చంద్రబాబు ప్రతి ఒక్కరినీ తన కోసం వాడుకుని వదిలేసే రకం అని మరోసారి రుజువు చేసుకున్నారు. కుప్పం నియోజకవర్గంలో మొదటి నుంచి చంద్రబాబు గెలుపు కోసం అహర్నిశలు పనిచేస్తున్న నాయకులను పక్కనబెట్టి.. ఇతర జిల్లా నివాసి, ప్రస్తుత ఎమ్మెల్సీకి కుప్పం బాధ్యతలు అప్పగించనున్నారు. ఎమ్మెల్సీ చెప్పినట్లు ప్రతిఒక్కరూ వినాలని చెప్పి ఒప్పించేందుకు చంద్రబాబు కుప్పం పర్యటనకు వస్తున్నారు. అందులో భాగంగానే మూడు రోజుల పర్యటనలో కేవలం ఒకే ఒక బహిరంగ సభ మాత్రం ఏర్పాటు చేసి.. మిగిలిన సమయం అంతా గ్రామ, వార్డు, మండల, నియోజకవర్గ స్థాయి నాయకులతో విడివిడిగా సమావేశం కానున్నారు. విషయం తెలుసుకున్న స్థానిక టీడీపీ నాయకులంతా చంద్రబాబు తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు సొంత నియోజకవర్గం చంద్రగిరిలో ఓటమిపాలైన తర్వాత 1989లో కుప్పంకు వలస వెళ్లారు. అప్పటి నుంచి మొన్నటి వరకు ఎన్నికల నామినేషన్‌కు వచ్చినా.. రాకపోయినా, ప్రచారం చేసినా.. చేయకపోయినా కుప్పంకు చెందిన నాయకులే అహర్నిశలు కష్టపడి గెలిపించారు. ఆ ఓటమిని స్థానిక నేతలపై రుద్దే ఉద్దేశం వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక.. ఆయన చేపట్టిన సంక్షేమ పథకాలకు జనం ఆకర్షితులయ్యారు. చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా ఉన్నా చేయలేని పనులు ఈ నాలుగేళ్లలో చేసి చూపించారు. దీంతో సీఎం జగన్మోహన్రెడ్డిపై ప్రజలు నమ్మకం పెంచుకున్నారు. అందులో భాగంగానే స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీని మట్టికరిపించారు. చంద్రబాబుని నమ్మని కుప్పం ప్రజలు వైఎస్సార్సీపీకి బ్రహ్మరథం పట్టారు. ఈ ఘోర పరిణామాన్ని జీర్ణించుకోలేని చంద్రబాబు స్థానిక సంస్థల ఓటమిని కుప్పం నియోజకవర్గ టీడీపీ నేతలపై మోపి చేతులు దులుపుకున్నారు. ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికై న కంచర్ల శ్రీకాంత్‌కు కుప్పం నియోజకవర్గ పూర్తి బాధ్యతలు అప్పగించారు. స్థానిక నాయకులందరినీ కరివేపాకులా తీసిపడేశారు. చంద్రబాబు తీసుకున్న నిర్ణయంపట్ల అసంతృప్తిగా ఉన్న కుప్పం టీడీపీ నేతలను నయానో, భయానో ఒప్పించాలని నిర్ణయించారు. అందులో భాగంగానే బుధ, గుర, శుక్రవారాల్లో కుప్పంలోనే మకాం వేయనున్నారు. ఈ మూడు రోజుల్లో గురవారం మాత్రమే బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు. మిగిలిన సమయం అంతా కుప్పంలోని బీసీఎన్ కల్యాణ మండంలో నాయకులు, కార్యకర్తలతో వరుస సమావేశాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సమావేశం ముఖ్యఉద్దేశ్యం.. కుప్పం నియోజకవర్గంలోని టీడీపీ శ్రేణులంతా ఎమ్మెల్సీ చెప్పినట్లు నడుచుకోవాలని చంద్రబాబు హుకుం జారీచేయడమేనని స్థానికులు చెవులు కొరుక్కుంటున్నారు. బాబు నిర్ణయం పట్ల కుప్పం టీడీపీ శ్రేణుల్లో మాత్రం తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. కుప్పం నుంచే ఎన్నికలకు పిలుపునిస్తారా? మరో వైపు 2024 ఎన్నికలకు చంద్రబాబు కుప్పం నుంచే పిలుపు ఇవ్వనున్నట్లు టీడీపీ శ్రేణులు చర్చించుకుంటున్నారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి తన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉచిత విద్యుత్ హామీని కుప్పంలో ప్రకటించిన విషయం తెలిసిందే. అదే తరహాలో చంద్రబాబు కుప్పంలో కొత్తగా హామీలను ప్రకటించనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇంకా.. రాష్ట్రస్థాయి నాయకులను కుప్పానికి రమ్మని సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. వారందరి సమక్షంలో కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకుంటారని టీడీపీ శ్రేణులు చెబుతున్నారు. నమ్మించడానికి రెడీ! చంద్రబాబు సమక్షంలో టీడీపీలోకి భారీ చేరికలు ఉంటాయని జోరుగా ప్రచారం చేస్తున్నారు. వైఎస్సార్సీపీ నుంచి పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు చేరుతున్నారని టీడీపీ శ్రేణులను నమ్మించారు. అందుకు అనుగుణంగా సాధారణ జనాన్ని పిలిపించుకుని టీడీపీ కండువాలు వేసి వారంతా వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు అని ఎల్లోమీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. మరో వైపు వైఎస్సార్సీపీ శ్రేణులను రెచ్చగొట్టి గొడవలు సృష్టించి, ఆపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై బురదజల్లేందుకు కుట్రలు పన్నినట్లు టీడీపీ సర్కిల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. -
లవ్ అండ్ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్‌గా ‘కంచర్ల’
ఉపేంద్ర హీరోగా నటిస్తూ నిర్మిస్తోన్న తాజా చిత్రం ‘కంచర్ల’. ఎస్.ఎస్.ఎల్.ఎస్. క్రియేషన్స్ బేనర్‌పై కె. అచ్యుతరావు సమర్పణ తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రెడ్డెం యాద కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. మీనాక్షి జైస్వాల్, ప్రణీత హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం ప్రారంభోత్సవ కార్యక్రమం వైజాగ్‌లోని రామానాయుడు స్టూడియోలో గ్రాండ్‌గా జరిగింది. ఈ చిత్రంలో బాహుబలి ప్రభాకర్ ప్రత్యేక పాత్రలో కనిపిస్తున్నారు. ఈ సందర్భంగా హీరో ఉపేంద్ర, హీరోయిన్లు మీనాక్షి జైస్వాల్, ప్రణీతలపై తొలి షాట్‌ని దర్శకుడు రెడ్డెం యాద కుమార్ చిత్రీకరించగా , సమర్పకులు కె. అచ్యుతరావు క్లాప్ కొట్టి షూటింగ్ ప్రారంభించారు. అనంతరం చిత్ర సమర్పకులు కె. అచ్యుతరావు మీడియాతో మాట్లాడుతూ...‘సినీ ప్రేక్షకులకు వినూత్న కథాంశంతో కూడిన చిత్రాన్ని అందించేందుకు ‘కంచర్ల’ చిత్రం రూపొందిస్తున్నామన్నారు. ఈ చిత్రం అన్ని వర్గాల, అన్ని వయసుల వారిని ఆకట్టుకుంటుందన్న నమ్మకంతో ఉన్నాం. ఉపేంద్ర హీరోగా నటిస్తున్న ‘కంచర్ల’ చిత్రాన్ని ప్రేక్షకులు ఆశీర్వాదించాలని కోరుకుంటున్నాను’ అన్నారు. దర్శకులు రెడ్డెం యాద కుమార్ మాట్లాడుతూ .. ‘యువకులు రాజకీయాల్లోకి రావాలి. సేవా దృక్పథంతో ఉండాలి అనే కాన్సెప్ట్ తో లవ్ అండ్ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. తొలి షెడ్యూల్ ప్రారంభించాం. విశాఖ ప్రాంతంలోనే మొదటి షెడ్యూల్‌కు సంబంధించిన షూటింగ్ జరుపుతాం. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తాం. ` అన్నారు. హీరో ఉపేంద్ర, హీరోయిన్ మీనాక్షి జైస్వాల్ మాట్లాడుతూ...‘కంచర్ల చిత్రం తమ నటనా జీవితానికి మలుపు రాయిగా నిలుస్తుంది’ అన్నారు. కార్యక్రమంలో సినీ నటుడు బాహుబలి ప్రభాకర్, డీఓపీ గుణశేఖర్, క్యాలు జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు. -
మనం ఏ స్థాయిలో ఉన్నా డ్రెస్సు, అడ్రెస్సు మారకూడదు: ఉప రాష్ట్రపతి
సాక్షి, హైదరాబాద్: అమీర్‌పేట్‌లోని లాల్ బంగ్లాలో యోధ లైఫ్ లైన్ డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రారంభోత్సవం బుధవారం ఘనంగా జరిగింది. డయాగ్నోస్టిక్ సెంటర్‌ను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తెలంగాణ మంత్రులు, హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, సినీనటుడు చిరంజీవి కలిసి ప్రారంబించారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు రాఘవేంద్రరావు, మాజీ క్రికెటర్ అజారుద్దీన్, పుల్లెల గోపిచంద్, క్రీడాకారిణి ద్రోణవల్లి హారిక, ఏపీ మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్, యోధ లైఫ్ లైన్ డయాగ్నోస్టిక్స్ వ్యవస్థాపకులు కంచర్ల సుధాకర్, పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. యోధ లైఫ్ లైన్ డయాగ్నోస్టిక్‌ను ప్రారంభించటం ఆనందంగా ఉందన్నారు. హైదరాబాద్ హెల్త్ హబ్ సిటీగా మారుతోందని కొనియాడారు. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా ఒక టీచర్ అని, అది మనకు ఎన్నో పాఠాలను నేర్పుతోందన్నారు. జీవితంలో ఎప్పుడూ నెగెటివిటీ ఉండొద్దు కానీ కరోనా విషయంలో నెగెటివ్ ఉండాల్సిందేనన్నారు. పట్టణాల్లో కరోనా బాగా విజృంభించిందని, గ్రామాల్లో కరోనా ప్రభావం అంతగా లేదన్నారు. పట్టణాల్లో జీవనం, జీవన విధానం దగ్గరదగ్గరగా ఉందని, రాబోయే రోజుల్లో గాలి వెలుతురు వచ్చేలా ఇంటి నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. ‘గాలి వెలుతురు రాకపోతే అది ఇల్లే కాదు. ఇంటికి సౌందర్యమా, సౌకర్యమా ఏది ముఖ్యమో ఆలోచించుకోవాలి. సౌకర్యం ఉంటేనే ఇల్లు సౌందర్యంగా ఉంటుంది. ఫిజికల్ ఫిట్నెస్ కావాలి. శారీరక శ్రమ చేయాలి. పిజ్జా బర్గర్ విదేశాల్లో అవసరం. విదేశాల్లో పనికొస్తాయి. మనకు ఆ తిండి పనికి రాదు. మన సంస్కృతి, మన బాషా, మన కట్టుబాట్లు అన్ని పాటించాలి. మనం ఏ స్థాయిలో ఉన్న మన డ్రెస్సు, అడ్రెస్సు మారకూడదు’. అని వ్యాఖ్యానించారు. నగరంలో ఇన్ని డైయాగ్నోస్టిక్స్ ఉన్నప్పటికీ అత్యాధునికమైన, అడ్వాన్స్ టెక్నాలజీ యోధ లైఫ్ లైన్లో ఉన్నాయని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ అన్నారు. తెలంగాణలో ఆరోగ్యానికి పెద్దపీట వేసేందుకు మల్టీ సూపర్ స్పెషలిటీ హాస్పిటల్ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా పేద వారికి వైద్యం అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. ప్రభుత్వం తరపున తమకు అన్ని సహాయ సహకారాలు ఉంటాయని పేర్కొన్నారు. జిల్లాల్లో కూడా యోధ లైఫ్ లైన్ విస్తరించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. కాగా చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు కంచర్ల సుధాకర్ 25 లక్షల విరాళం ప్రకటించారు. -
నల్లగొండ ఉపఎన్నిక.. బరిలో భూపాల్‌రెడ్డి!
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ ఎమ్మెల్యేల సభ్యత్వాల రద్దు నిబంధనల ప్రకారమే జరిగిందా లేదా అనే చర్చ కొలిక్కిరాకముందే, ఈ వ్యవహారంపై ఈసీ నిర్ణయం తీసుకోకముందే అధికార పార్టీలో ఉప ఎన్నికల హడావిడి మొదలైంది. ‘సంపత్ కుమార్ ప్రాతినిధ్యవ వహిస్తున్న ఆలంపూర్ శాసనసభ స్థానం, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న నల్లగొండ స్థానాలు రెండూ ఖాళీ అయిన’ట్లు తెలంగాణ ప్రభుత్వం మంగళవారమే ఎన్నికల కమిషన్‌కు సమాచారం అందించింది. దీంతో ఉప ఎన్నికపై పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. ఈ వ్యవహారంపై ఈసీ ఇంకా స్పందిచనప్పటికీ టీఆర్ఎస్లో మాత్రం టికెట్ల వ్యవహారం తారాస్థాయికి చేరింది. ఆశావాహుల జాబితా రోజురోజుకూ పెరుగుతోంది. టికెట్ ఆశిస్తున్నవారిలో ఉద్యమకారుల కంటే ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతల సంఖ్యే ఎక్కువగా ఉండటం గమనార్హం. 20న ప్రకటన? : నల్లగొండ ఉప ఎన్నికలో అధికార టీఆర్ఎస్ తరఫున కంచర్ల భూపాల్‌రెడ్డి పోటీచేస్తారని కొద్ది గంటలుగా పెద్ద ఎత్తునప్రచారం సాగుతోంది. భూపాల్‌రెడ్డి గత ఎన్నికల్లో టీడీపీ తరఫున కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి(కాంగ్రెస్)పై పోటీ చేసి ఓడిపోయారు. ఆతర్వాత ఆయన గులాబీ గూటికి చేరారు. నాటి ఎన్నికల్లో భూపాల్ గణనీయంగా ఓట్లు సాధించడంతో టీఆర్ఎస్ మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆయనకున్న ప్రజాదరణను బట్టి పార్టీలో చేర్చుకోవడమేకాక నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గానూ బాధ్యతలు కట్టబెట్టారు టీఆర్ఎస్ పెద్దలు. ఇప్పటికే నల్లగొండలో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్న టీఆర్ఎస్ ఈ నెల 20న ప్రగతి సభను నిర్వహించాలని భావిస్తున్నది. ఆ సభలోనే భూపాల్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని ప్రకటిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇక ఆలంపూర్ నియోజకవర్గ అభ్యర్థిపై తర్జనభర్జన నడుస్తున్నట్లు సమాచారం. ఉప ఎన్నిక, అభ్యర్థుల ఎంపికలకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అధికార ప్రకటనలు లేవు. -
కొలువుదీరిన వంశవృక్షం
ఐదుతరాల ‘కంచర్ల’ అనుబంధం ఒకేచోట కలసిన 250 మంది కుటుంబ సభ్యులు కడలి(రాజోలు) : ఐదు తరాల వంశవృక్షం ఒకేచోట కలిసింది. వారి ఆనందానికి అవధులు లేవు. శుక్రవారం కడలి గ్రామంలో కంచర్ల సోమరాజు, సత్యవతి వంశానికి చెందిన ఐదు తరాలకు చెందిన 250 మంది కలుసుకున్నారు. కంచర్ల సోమరాజు, సత్యవతిలకు నలుగురు కుమారులు వెంకన్న, సుబ్బయ్య, పూర్ణచంద్రరావు, కాశీ, ఆరుగురు కుమార్తెలు ఉన్నారు. వారి సంతానం సుమారు 250 మంది కడలి గ్రామం వచ్చారు. సంక్రాతి పండుగ సందర్భంగా దేశ, విదేశాల్లో ఉన్న కంచర్ల కుటుంబీకులు ఈ ఏడాది కలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. గత ఏడాది నుంచి కంచర్ల సోమశేఖర్గుప్త కుటుంబీకులను ఒకచోట చేర్చేందుకు చేపట్టిన కృషికి కుటుంబ సభ్యులంతా సహకరించారు. దీంతో అమెరికా, దుబాయి, సింగపూర్, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, విశాఖపట్టణం తదితర ప్రాంతాలకు చెందిన అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు, పెదనాన్నలు, చిన్నాన్నలు అంతా కడలి గ్రామం చేరుకున్నారు. దీంతో కడలిలో పండగ వాతావరణం నెలకొంది. దీనికోసం ప్రత్యేక వేదిక ఏర్పాటు చేసి కంచర్ల కుటుంబీకులు ఆటలు, పాటలతో ఆనందాన్ని పంచుకున్నారు. పెళ్లిళ్లకు, పండగలకు కొద్దిమంది కలిసేవాళ్లమని, ఒకేసారి కుటుంబ సభ్యులంతా ఇలా కలవడం చాలా ఆనందంగా ఉందని శేఖర్ సంతోషాన్ని వ్యక్తం చేశారు.