
చాన్నాళ్ల నుంచి సమంత తెలుగు సినిమాలు చేయట్లేదు. చివరగా విజయ్ దేవరకొండ 'ఖుషి'లో నటించిన సామ్.. ఆ తర్వాత 'సిటాడెల్' వెబ్ సిరీస్ చేసింది. అది తప్పితే కొత్త ప్రాజెక్టులేం చేయలేదు. దీంతో సమంత ఇక కొత్త చిత్రాలకు స్వస్తి చెప్పేసిందనే టాక్ వినిపించింది. కానీ ఇప్పుడు 'శుభం'తో కొత్త ప్రయాణం ప్రారంభించింది. ఈ మేరకు కొన్ని ఫొటోలు పోస్ట్ చేసింది.
(ఇదీ చదవండి: కుడుంబస్థాన్ సినిమా రివ్యూ (ఓటీటీ))
ఇప్పటివరకు సమంత అంటే మనకు తెలిసింది హీరోయిన్ మాత్రమే. కానీ ఇకపై నిర్మాతగానూ వరస సినిమాలు చేసే ఆలోచనలో ఉన్నట్లు ఉంది. ఈ క్రమంలోనే తొలి ప్రాజెక్టుగా 'శుభం' ప్రకటించింది. పలువురు యువ నటీనటులు కీలక పాత్రలు పోషించారు. కామెడీ థ్రిల్లర్ కథతో దీన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది.
సమంత.. త్రలాలా మూవింగ్ పిక్చర్స్ పేరుతో గతంలోనే 'నా ఇంటి బంగారం' అని ఓ మూవీ ప్రకటించింది. కానీ అది ఇప్పుడు ఏ దశలో ఉందో.. అసలు ఉందో లేదో తెలియని పరిస్థితి. ఇప్పటికే 'శుభం' షూటింగ్ పూర్తి చేసుకోగా.. త్వరలో రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు.
(ఇదీ చదవండి: థియేటర్లలో రిలీజైన వారానికే ఓటీటీలోకి హిట్ సినిమా)
Comments
Please login to add a commentAdd a comment