సూపర్‌స్టార్ కృష్ణ నటించిన చివరి మూవీ రిలీజ్‌కి రెడీ | Krishna Vijayam Movie Pre Release Event Highlights | Sakshi
Sakshi News home page

సూపర్‌స్టార్ కృష్ణ నటించిన చివరి మూవీ రిలీజ్‌కి రెడీ

Published Sun, Jan 14 2024 7:00 PM | Last Updated on Mon, Jan 15 2024 7:42 AM

Krishna Vijayam Movie Pre Release Event Highlights - Sakshi

సంక్రాంతి కానుకగా 'గుంటూరు కారం' సినిమాతో మహేశ్ థియేటర్లలోకి వచ్చాడు. అయితే టాక్ విషయంలో రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆల్ ఇండియా కృష్ణ-మహేష్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఖాదర్ ఘోరి, పద్మాలయ శర్మ, ధనలక్ష్మి.. ఓ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకలో పాల్గొన్నారు. మహేశ్ సినిమాపై వస్తున్న మిక్స్‌డ్ టాక్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

(ఇదీ చదవండి: రెండో రోజుకే భారీగా తగ్గిపోయిన 'గుంటూరు కారం' కలెక్షన్స్)

"గుంటూరు కారం" సాధిస్తున్న రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ చూసి ఓర్వలేక.. కొందరు కావాలని విమర్శలు చేస్తున్నారని, వాటిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని ఆలిండియా కృష్ణ -మహేష్ సేన అధ్యక్షులు ఖాదర్ ఘోరి అన్నారు. సినిమా బాగా లేకపోతే ఆ విషయాన్ని తమ హీరో కృష్ణ ముందుగా చెప్పేసేవారని, ఆ లక్షణం మహేష్‌లోనూ ఉందని చెప్పారు. కానీ ఫ్యాన్స్‪‌తోపాటు అందరూ ఆస్వాదిస్తున్న 'గుంటూరు కారం' గురించి ఘోరంగా మాట్లాడడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు.

సూపర్‌స్టార్ కృష్ణ గతేడాది మరణించారు. కాకపోతే ఆయన నటించిన చివరి చిత్రం "కృష్ణ విజయం" ఇంకా రిలీజ్ కాలేదు. ఇప్పుడు త్వరలో ఈ చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకురానున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు. ఇందులోనే 'గుంటూరు కారం' ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వ్యాఖ్యలు చేశారు. మధుసూదన్ హవల్దార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సెన్సార్ జరుగుతోంది. ఈ మూవీలో నాగబాబు, సుహాసిని, యశ్వంత్, అలీ తదితరులు కీలకపాత్రలు పోషించారు.

(ఇదీ చదవండి: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన మహేశ్ సినిమా చైల్డ్ ఆర్టిస్.. ఎవరో కనిపెట్టారా?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement