
వన్ మీడియా ఈటీ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై నిర్మించిన సినిమా 'సఖి'. లోకేష్ ముత్తుమల, దీపికా వేమిరెడ్డి, దివ్య, పల్లవి, సాహితీ చిల్ల, సందీప పసుపులేటి, సుధాకర్ రెడ్డి , జ్యోతి స్వరూప్, జితిన్ ఆదిత్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాతో జానీ బాషా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. పార్థు రెడ్డి నిర్మించారు.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 32 మూవీస్)
సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న 'సఖి' సినిమా డిసెంబర్ 15న అంటే ఈ శుక్రవారం థియేటర్స్‌లోకి రానుంది. ఫీల్ గుడ్ లవ్ స్టొరీతో ఈ చిత్రాన్ని తీశారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటకు జరిగిన ఒక సంఘటన ఆధారంగా ఈ సినిమా ఉంటుంది. ఇటీవల ట్రైలర్ విడుదల చేయగా.. మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా కూడా అదే తరహాలో ఉంటుందని చిత్ర యూనిట్ సభ్యులు ధీమాగా ఉన్నారు.
(ఇదీ చదవండి: Bigg Boss 7: శోభాశెట్టి ఎలిమినేట్.. మొత్తం రెమ్యునేషన్ ఎంతో తెలుసా?)
Comments
Please login to add a commentAdd a comment