చాలా ఏళ్ల నుంచి చాలా సినిమాల్లో పలు పాత్రలు చేసి గుర్తింపు తెచ్చుకున్న నటుడు రాజా రవీంద్ర. ఇప్పుడు ఇతడు ప్రధాన పాత్రలో ఓ మూవీ చేశాడు. అదే 'సారంగదరియా'. సాయిజా క్రియేషన్స్ పతాకంపై ఉమాదేవి, శరత్ చంద్ర నిర్మించారు. పద్మారావు అబ్బిశెట్టి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. మే నెలలో సినిమాని రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలోనే తాజాగా టీజర్ రిలీజ్ చేశారు.
(ఇదీ చదవండి: ఒకప్పటి స్టార్ హీరోయిన్ ఇన్నేళ్ల ఒంటరి జీవితానికి కారణమేంటి?)
టీజర్ రిలీజ్ చేసిన యంగ్ హీరో శ్రీవిష్ణు.. మూవీ యూనిట్‌కి విషెస్ చెప్పారు. ఓ మధ్య వయస్కుడైన ఓ వ్యక్తి.. తన భార్య, ఇద్దరు కొడుకులు, కూతురితో సంసారాన్ని వెల్లదీస్తుంటాడు. సమాజంలో పరువుగా బతికితే చాలు అనుకునే వ్యక్తికి.. తన కొడుకులు, కూతురు వల్ల ఇబ్బందులు వస్తాయి. సమాజం అతన్ని నిలదీసే పరిస్థితులు ఎదురవుతాయి. అప్పుడు ఆ కన్నతండ్రి ఏం చేశాడు.. తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు.. అనే కథతో సినిమా తీసినట్లు తెలుస్తోంది.
(ఇదీ చదవండి: ప్రముఖ బుల్లితెర నటికి రోడ్డు ప్రమాదం..!)
Comments
Please login to add a commentAdd a comment