ఓటీటీలు వచ్చిన తర్వాత చిన్న సినిమాలకు ప్లస్ అయిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాలకు అటు థియేటర్లు, ఇటు టీవీల్లో మంచి రెస్పాన్స్ వచ్చేది. చిన్న చిత్రాలు ఆడితే థియేటర్లలో ఆడేవి. ఆ తర్వాత దాదాపు అందరూ వాటిని మర్చిపోయేవారు. కానీ ఇప్పుడు ఓటీటీల పుణ్యమా అని వాటిని చూసేవాళ్లు కొందరు ఉంటున్నారు. ఇప్పుడు అలాంటి వాళ్ల కోసమా అన్నట్లు మరో తెలుగు సినిమా ఓటీటీలోకి వచ్చేసింది.
'సాచి' అనే సినిమా.. 2023 మార్చి 3న థియేటర్లలో రిలీజైంది. అయితే చిన్న సినిమా కావడంతో పాటు పెద్దగా పేరున్న నటులు లేకపోవడంతో ఎప్పుడొచ్చి వెళ్లిపోయిందో కూడా ఎవరికీ తెలియకుండా పోయింది. మహిళ సాధికారత అనే అంశాన్ని ప్రధానంగా తీసుకుని నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ సినిమాని తీశారు.
(ఇదీ చదవండి: ఆ ఫొటో పోస్ట్ చేసి గుడ్‌న్యూస్ చెప్పిన లావణ్య త్రిపాఠి)
బార్బర్ షాప్ నడిపే తండ్రి.. అంతంత మాత్రంగా ఉండే సంపాదన.. ఇతడికి ముగ్గురు కూతుళ్లు. అంతా బాగానే ఉందనుకునే టైంలో బ్రెయిన్ ట్యూమర్ జబ్బు వస్తుంది. దీంతో ఇల్లు గడవడం కష్టమైపోతుంది. ఇలాంటి టైంలో కూతురే తండ్రి బాధ్యతలు అందుకుంటుంది. కటింగ్ షాప్ రన్ చేస్తూ డబ్బులు సంపాదిస్తుంది. అయితే ఈ క్రమంలో అమ్మాయి ఎలాంటి సవాళ్లు ఎదుర్కొంది అనే స్టోరీతో ఈ సినిమా తీశారు.
స్టోరీ పరంగా మంచి పాయింట్ ఎంచుకున్నప్పటికీ మరీ సాగదీసినట్లు ఉండటం ఈ సినిమాకు మైనస్ పాయింట్‌లా అనిపించింది. ఇందులో పెద్దగా పేరున్న నటులు కూడా ఎవరూ లేరు. ప్రస్తుతానికి భారత్‌లో తప్పితే మిగతా దేశాల్లో అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. త్వరలో మన ప్రేక్షకులకు కూడా అందుబాటులోకి రావొచ్చు.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 29 సినిమాలు)
Comments
Please login to add a commentAdd a comment