ఓటీటీలోకి మరో తెలుగు సినిమా వచ్చేసింది. థియేటర్లలో విడుదలైన దాదాపు రెండు నెలల తర్వాత ఎలాండి హడావుడి లేకుండా స్ట్రీమింగ్ అయిపోతుంది. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తీసిన ఈ మూవీ.. అప్పుడు ప్రేక్షకులకు అనుకున్నంతగా రీచ్ కాలేకపోయింది. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది కాబట్టి ఫ్రీగా టైమ్ ఉన్నప్పుడు చూసేయొచ్చు. ఇంతకీ ఏంటా సినిమా? అసలు కథేంటి?
(ఇదీ చదవండి: థియేటర్లలో డిజాస్టర్.. ఓటీటీలో మాత్రం ఇదే టాప్ ట్రెండింగ్ సినిమా!)
సినిమా డీటైల్స్ అవే
చిన్న సినిమాలు అయినా సరే కాన్సెప్ట్ పరంగా ప్రయోగాలు చేస్తుంటారు. అలా మహాభారతం నుంచి స్ఫూర్తిగా తీసిన తెలుగు సినిమా 'కృష్ణఘట్టం'. చైతన్యకృష్ణ, వెంకటకృష్ణ గోవడ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం.. నవంబరు 3న థియేటర్లలోకి వచ్చింది. కాకపోతే కంటెంట్ సరిగా తీయకపోవడం వల్ల జనాలకు పెద్దగా ఎక్కలేదు. కథ ఎంపిక బాగున్నప్పటికీ.. దాన్ని డీల్ చేయడంలో దర్శక నిర్మాత సురేశ్ పల్ల తడబడ్డారు. స్టేజీ నాటకాలు వేసే ఓ బ్యాంక్ ఉద్యోగి, అల్లరిచిల్లరగా తిరిగే కుర్రాడు జీవితాల్లో ఎలాంటి సంఘటనలు జరిగాయనేదే ీ సినిమా కథ.
ఆ ఓటీటీలోనే స్ట్రీమింగ్
ఇక యాక్టింగ్ పరంగా నటీనటులు అందరూ బాగానే చేసిన 'కృష్ణఘట్టం' సినిమాలో నాటకాలు, దానికి సంబంధించిన స్టోరీ, సన్నివేశాల్ని చెప్పారు. అందువల్ల ఈ సినిమా అందరికీ నచ్చకపోవచ్చు. ఇకపోతే నవంబరులో థియేటర్లలో రిలీజైన ఈచిత్రం.. దాదాపు రెండు నెలల తర్వాత ఇప్పుడు అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులోకి వచ్చింది. కొత్త సినిమా ఏమైనా చూడాలనిపిస్తే.. దీన్ని చూస్తూ వీకెండ్‌ని టైమ్‌పాస్ చేసేయండి.
(ఇదీ చదవండి: వేణుస్వామి నటించిన రెండు తెలుగు సినిమాలు... అవేంటో తెలుసా?)
Comments
Please login to add a commentAdd a comment