
సుబిషి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వేణుగోపాల్ రెడ్డి నిర్మించిన సినిమా 'లగ్గం'. రమేశ్ చెప్పాల దర్శకుడు. తెలంగాణ నేపథ్యంలో జరిగే స్టోరీతో తీశారు. రీసెంట్‌గా రిలీజ్ చేసిన పాటలు, టీజర్‌కి స్పందన బాగానే వచ్చింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే థియేటర్ రిలీజ్ డేట్ ప్రకటించారు. అక్టోబరు 18న ప్రేక్షకులని ముందుకు రానుందని చెప్పారు.
(ఇదీ చదవండి: కొడుకు ఫేస్ రివీల్ చేసిన హీరోయిన్ అమలాపాల్)
చక్కటి కథ,కథనాలు, వినసొంపైన సంగీతం, మనుషుల భావోద్వేగాలు, కుటుంబ విలువలు లగ్గం సినిమాలో ఉన్నాయని నిర్మాత వేణుగోపాల్ రెడ్డి గారు తెలిపారు. ఫ్యామిలీ అందరు కలిసి చూడదగ్గ సినిమాగా లగ్గం ప్రేక్షకుల ముందుకు రాబోతోందని"నటకిరీటి రాజేంద్రప్రసాద్ గారు అన్నారు. సాయి రోనక్, ప్రగ్యా నగ్రా హీరోహీరోయిన్లుగా నటించారు. మణిశర్మ సంగీతమందించారు.
(ఇదీ చదవండి: ఏడు నెలల క్రితం నాకు బ్రేకప్: మృణాల్ ఠాకుర్)
Comments
Please login to add a commentAdd a comment