
ప్రస్తుతం కంటెంట్, కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాల్ని ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. ఈ క్రమంలోనే సినిమాలో స్టార్స్ ఉన్నారా లేదా అనేది అస్సలు పట్టించుకోవట్లేదు. మంచి కథ ఉంటే చాలు థియేటర్, ఓటీటీల్లో బ్రహ్మరథం పడుతున్నారు. ప్రస్తుతం అలాంటి ఓ కొత్త కాన్సెప్ట్‌తో వరుణ్ సందేశ్ సినిమా తీశాడు. యదార్థ సంఘటనల ఆధారంగా 'నింద' చిత్రం రాబోతుంది. రాజేష్ జగన్నాథం దర్శక-నిర్మాతగా వ్యవహరించారు.
(ఇదీ చదవండి: టాలీవుడ్ యంగ్ హీరో షాకింగ్ నిర్ణయం.. ఇకపై వాటికి నో!)
కాండ్రకోట మిస్టరీ అనే క్యాప్షన్‌తో రాబోతోన్న ఈ చిత్ర టైటిల్ పోస్టర్ తాజాగా రిలీజ్ చేశారు. ఊరి వాతావరణం, చీకటి, గుడిసె, కత్తి పట్టుకున్న ఓ వ్యక్తి, కత్తి పట్టుకుని దుర్మార్గులను అంతం చేసేందుకు సిద్దంగా ఉన్నటువంటి న్యాయదేవత విగ్రహం ఇంట్రెస్టింగ్ అనిపిస్తున్నాయి. ఈ సినిమాని ఇప్పటికే ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులకు చూపించారు. వారంతా సినిమాను మెచ్చుకున్నారట. మంచి కాన్సెప్ట్‌తో చిత్రాన్ని తీశారని దర్శక నిర్మాతలని ప్రశంసించారట. ఇక ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
(ఇదీ చదవండి: మెగాకోడలు క్యూట్‌నెస్.. చీరలో స్టార్ హీరో కూతురు అలా!)
Comments
Please login to add a commentAdd a comment