వినోద్ విజయన్ ఫిలిమ్స్, విహారి సినిమా హౌజ్ బ్యానర్స్‌పై వినోద్ విజయన్, గార్లపాటి రమేష్ సంయుక్తంగా నిర్మించిన సినిమా 'ఒక పథకం ప్రకారం'. సాయిరామ్ శంకర్, అషిమా నర్వాల్, శృతి సోదీలు హీరోహీరోయిన్లుగా నటించారు. పలు జాతీయ అంతర్జాతీయ అందుకున్న దర్శకుడు వినోద్ విజయ్.. ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. మార్చి లో థియేటర్ విడుదల చేయనున్నట్లు ఇప్పుడు అధికారికంగా ప్రకటించారు.
(ఇదీ చదవండి: తన పేరుతో మోసం.. బండారం బయటపెట్టిన సీరియల్ నటి)
ఈ సందర్భంగా దర్శక నిర్మాత వినోద్ విజయన్ మాట్లాడుతూ.. 'ఈ థ్రిల్లర్ సినిమాలో సాయిరామ్ శంకర్ పవర్‌ఫుల్ అడ్వకేట్ పాత్రలో కనిపిస్తారు. అలానే ఈ సినిమా కోసం నాతో కలిసి ఏకంగా ఆరుగురు నేషనల్ అవార్డు విన్నర్స్ పనిచేశారు' అని చెప్పుకొచ్చారు.
(ఇదీ చదవండి: సెన్సేషన్ సృష్టిస్తున్న ఈ మలయాళ మూవీస్.. వీటిలో అంతలా ఏముంది?)
Comments
Please login to add a commentAdd a comment