ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు రొమాంటిక్ సినిమా.. స్ట్రీమింగ్ అందులోనే? | Mayalo Telugu Movie Now Streaming On This OTT Platform | Sakshi
Sakshi News home page

OTT Movie: నెలలోనే ఓటీటీలో రిలీజైపోయిన ఆ తెలుగు సినిమా.. స్ట్రీమింగ్ డీటైల్స్

Jan 15 2024 4:25 PM | Updated on Jan 15 2024 4:37 PM

Mayalo Telugu Movie Streaming Now In Amazon Prime Video - Sakshi

తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా సంక్రాంతి సందడి గట్టిగా కనిపిస్తోంది. అందరూ పండగ హడావుడిలో బిజీగా ఉన్నారు. కొందరు మాత్రం ఏం చేయాలో తెలీక కొత్తగా తెలుగు సినిమాలు ఓటీటీల్లో ఏం రిలీజ్ అయ్యాయా అని చూస్తున్నారు. ఇప్పుడు వాళ్ల కోసమా అన్నట్లు ఓ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. ఇంతకీ ఆ సినిమా సంగతేంటి?

సంక్రాంతి కానుకగా థియేటర్లలో నాలుగు సినిమాలు విడుదలయ్యాయి. వీటిలో 'హను-మాన్' మూవీ విజేతగా నిలిచింది. మిగతా మూడు చిత్రాలతో మిక్స్‌డ్ టాక్ వచ్చింది. అయితేనేం ఎవరికి ఏ చిత్రం అందుబాటులో దాన్ని చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. థియేటర్‌కి వెళ్లే ఓపిక లేని వాళ్లు మాత్రం ఓటీటీల వైపు చూస్తున్నారు. రీసెంట్‌గా 'డెవిల్' మూవీ ఓటీటీలోకి వచ్చింది.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 45 సినిమాలు)

తాజాగా '#మాయలో' అనే తెలుగు మూవీ.. అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులోకి వచ్చేసింది. డిసెంబరు 15న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం.. ఎప్పుడొచ్చి వెళ్లిందనేది కూడా చాలామందికి తెలియదు. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తీసిన ఈ సినిమాలో పెద్దగా పేరున్న యాక్టర్స్ ఎవరూ లేరు. అయితేనేం ఈ పండక్కి టైంపాస్ కావాలంటే కొత్తగా వచ్చిన ఈ సినిమాని వీలైతే చూసేయండి.

ఇక '#మాయలో' కథ విషయానికొస్తే.. మాయ(జ్ఞానేశ్వరి)కి పెళ్లి ఫిక్స్ అవుతుంది. దీంతో తన చిన్నప్పటి ఫ్రెండ్స్ క్రిష్(నరేశ్ అగస్త్య), సింధు (భావన)ని తన వివాహానికి పిలుస్తుంది. దీంతో వీళ్లిద్దరూ ఓ కారు అద్దెకు తీసుకుని రోడ్డు మార్గంలో వస్తుంటారు. మరి ఈ జర్నీలో ఏం జరిగింది? చివరకు ఏమైందనేదే సినిమా స్టోరీ.

(ఇదీ చదవండి: విజయ్-రష్మిక రిలేషన్‌పై మళ్లీ రూమర్స్.. అంతా ఆ ఫొటోల వల్లే?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement