
శంకరాభరణం రాజ్యలక్ష్మి గారి అబ్బాయి రోహిత్ కృష్ణ హీరోగా నటించిన చిత్రం పల్లె గూటికి పండుగ వచ్చింది. కంచరాన తిరుమలరావు దర్శకత్వం వహించిన ఈ సినిమా డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు పాజిటివ్ స్పందన వచ్చింది. ఈ సందర్భంగా హీరో రోహిత్ ప్రేక్షకులతో కలిసి సినిమా చూసి కేక్ కట్ చేశాడు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ముందుగా మా అమ్మకు ధన్యవాదాలు.. ఈ కథ విన్నప్పుడు ఆ క్యారెక్టర్‌కు నేను సెట్ అవుతానని వర్కవుట్స్ చేశాను. స్పెషల్‌గా శ్రీకాకుళం భాష నేర్చుకున్నాను. టీం అందరం బాగా కష్టపడ్డాం, ఇష్టపడి వర్క్ చేయడం వల్ల ఈ రోజు ప్రేక్షకులు ఇంతలా ఆదరిస్తున్నారు.
సుమన్, షియాజీ షిండే, సాయి కుమార్, రఘు బాబు, అన్నపూర్ణమ్మ.. ఇలాంటి పెద్ద పెద్ద యాక్టర్స్‌తో కలిసి స్క్రీన్ పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. డిసెంబర్1 న విడుదలైన మా సినిమా ప్రేక్షకుల్ని మెప్పిస్తోంది. ప్రస్తుతం కొన్ని స్క్రిప్ట్ వర్క్స్ చేస్తున్నాను. త్వరలో డైరెక్షన్ కూడా చేయబోతున్నాను. సింగపూర్‌లో సినిమాటోగ్రఫీ కోచింగ్, డైరెక్షన్ కోచింగ్ చేస్తున్నాను.ప్రేక్షకులు మా అమ్మను ఎలా ఆదరించారో, నన్ను కూడా అలానే ఆదరిస్తారని భావిస్తున్నాను' అన్నాడు.
చదవండి: ఆ ఒక్కరు తప్ప అందరూ నామినేషన్స్‌లో.. వీళ్ల గొడవ మళ్లీ మొదలైంది!
Comments
Please login to add a commentAdd a comment