rajyalakshmi
-
వైఎస్సార్సీపీలో ఫుల్ జోష్
సాక్షి ప్రతినిధి, ఏలూరు: అధికార వైఎస్సార్సీపీ ఏలూరు జిల్లాలో ఫుల్‌జోష్‌తో కనిపిస్తోంది. ఎన్నికల నోటిఫికేషన్‌తో సంబంధం లేకుండా స్థానిక పరిస్థితులు, సమీకరణలకు అనుగుణంగా జిల్లాలో అభ్యర్థుల మార్పులు, చేర్పుల ప్రక్రియ ముగిసింది. ఈ క్రమంలో ఆదివారం జరిగిన పార్టీ ఏలూరు జిల్లా విస్తృత స్థాయి సమావేశం, నూతన అభ్యర్థుల పరిచయ సభ గ్రాండ్ సక్సెస్ కావడం పార్టీ క్యాడర్లో కొత్త ఉత్సాహం నింపింది. ఏలూరు పార్లమెంట్ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్‌యాదవ్, చింతలపూడి అసెంబ్లీ అభ్యర్థి కంభం విజయరాజు, పోలవరం అసెంబ్లీ అభ్యర్థిగా తెల్లం రాజ్యలక్ష్మిలను జిల్లా నాయకులు కార్యకర్తలకు పరిచయం చేశారు. ఎన్నికల శంఖారావం పూరించారు. దీంతో పార్టీ శ్రేణుల్లో నవోత్సాహం కదంతొక్కుతోంది. ఇప్పటికే ప్రజల్లోకి.. ఏలూరు పార్లమెంట్ పరిధిలో రెండు అసెంబ్లీ, ఒక ఎంపీ స్థానంలో వైఎస్సార్సీపీ ఇన్చార్జులను మార్చింది. మిగిలిన చోట్ల ఇప్పటికే ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్తున్నారు. పాదయాత్రలు చేస్తూ.. క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజా సమస్యలు పరిష్కరిస్తున్నారు. ఐదేళ్లలో తాము చేసిన పనులను వివరిస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా గడపగడపకూ చేకూరిన లబ్ధిని చెబుతున్నారు. ఏలూరు పార్లమెంట్ పరిధిలో ఈనెల 30వ తేదీకల్లా నియోజకవర్గ స్థాయి సమావేశాలు ముగిసేలా షెడ్యూల్ ఖరారు చేసుకున్నారు. బాధ్యతలు తీసుకున్న చింతలపూడి ఇన్చార్జి కంభం విజయరాజు, పోలవరం ఇన్చార్జి తెల్లం రాజ్యలక్ష్మి ఇప్పటికే వారం రోజులుగా నియోజకవర్గంలో విస్తతంగా పర్యటిస్తున్నారు. ఇక ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ ఆదివారం నుంచి పార్లమెంట్ పరిధిలో పర్యటనకు శ్రీకారం చుట్టారు. టీడీపీలో అనిశ్చితి ఇక ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలో రాజకీయ అనిశ్చితి తారాస్థాయికి చేరింది. పొత్తుల గందరగోళం ఒక వైపు, టీడీపీ, జనసేన నేతల మధ్య సమన్వయ లోపం మరోవైపు ఆ పార్టీ నేతలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఏలూరు ఎంపీ టికెట్‌ను ముగ్గురు, నలుగురు అభ్యర్థులు ఆశిస్తున్నా స్పష్టత లేకపోవడం పొత్తుల్లో జనసేనకు ఇచ్చే స్థానాలు తేల్చకపోవడంతో రెండు పార్టీల నేతల్లో రాజకీయ నైరాశ్యం నెలకొంది. ఇక దెందులూరు నియోజకవర్గంలో టీడీపీ సమన్వయకర్త చింతమనేని ప్రభాకర్ యథావిధిగా హల్చల్ చేస్తున్నారు. టీడీపీ, జనసేన నేతలు చింతమనేని వద్దు–ఎవరైనా ముద్దు అనే పేరుతో నిరసన సమావేశం నిర్వహించినప్పటి నుంచి ఆయన తీవ్ర ఆందోళనకు గురై టికెట్ ఆశిస్తున్న ఇతర నేతలపై నోరుపారేసుకుంటున్నట్లు సమాచారం. కైకలూరు, నూజివీడు, పోలవరంలలోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పార్లమెంట్ స్థానానికో సభ నిర్వహిస్తున్నా అభ్యర్థిత్వాలపై స్పష్టత ఇవ్వడం లేదు. ఫలితంగా ముఖ్యనేతలు ఖర్చుకు ముందుకురాని పరిస్థితి. అయితే జనసేన, టీడీపీ శ్రేణులు మాత్రం సోషల్ మీడియా వార్ కొనసాగిస్తున్నాయి. ఏ పార్టీ ఏ స్థానాల్లో పోటీ చేస్తాయో పోస్టులు షేర్ చేస్తూ గందరగోళాన్ని మరింత పెంచుతున్నాయి. -
తొలి సినిమా సక్సెస్.. ప్రేక్షకులతో కేక్ కట్ చేసిన హీరో
శంకరాభరణం రాజ్యలక్ష్మి గారి అబ్బాయి రోహిత్ కృష్ణ హీరోగా నటించిన చిత్రం పల్లె గూటికి పండుగ వచ్చింది. కంచరాన తిరుమలరావు దర్శకత్వం వహించిన ఈ సినిమా డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు పాజిటివ్ స్పందన వచ్చింది. ఈ సందర్భంగా హీరో రోహిత్ ప్రేక్షకులతో కలిసి సినిమా చూసి కేక్ కట్ చేశాడు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ముందుగా మా అమ్మకు ధన్యవాదాలు.. ఈ కథ విన్నప్పుడు ఆ క్యారెక్టర్‌కు నేను సెట్ అవుతానని వర్కవుట్స్ చేశాను. స్పెషల్‌గా శ్రీకాకుళం భాష నేర్చుకున్నాను. టీం అందరం బాగా కష్టపడ్డాం, ఇష్టపడి వర్క్ చేయడం వల్ల ఈ రోజు ప్రేక్షకులు ఇంతలా ఆదరిస్తున్నారు. సుమన్, షియాజీ షిండే, సాయి కుమార్, రఘు బాబు, అన్నపూర్ణమ్మ.. ఇలాంటి పెద్ద పెద్ద యాక్టర్స్‌తో కలిసి స్క్రీన్ పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. డిసెంబర్1 న విడుదలైన మా సినిమా ప్రేక్షకుల్ని మెప్పిస్తోంది. ప్రస్తుతం కొన్ని స్క్రిప్ట్ వర్క్స్ చేస్తున్నాను. త్వరలో డైరెక్షన్ కూడా చేయబోతున్నాను. సింగపూర్‌లో సినిమాటోగ్రఫీ కోచింగ్, డైరెక్షన్ కోచింగ్ చేస్తున్నాను.ప్రేక్షకులు మా అమ్మను ఎలా ఆదరించారో, నన్ను కూడా అలానే ఆదరిస్తారని భావిస్తున్నాను' అన్నాడు. చదవండి: ఆ ఒక్కరు తప్ప అందరూ నామినేషన్స్‌లో.. వీళ్ల గొడవ మళ్లీ మొదలైంది! -
టీడీపీ సర్కారు బీసీ నేతలను చులకనగా చూస్తున్నారు
-
అమ్మమ్మ దానం
అమ్మమ్మ ఈ వయసులో ఏం దానం ఇస్తుంది? పక్షికి కాసిన్ని గింజలు... చెట్టుకు చెంబుడు నీళ్లు... పసిపిల్లలకు మిఠాయిలు... కాదు. ఈ సమాజానికి చాలా పెద్ద దానం ఇవ్వాలి అనుకుందామె. తన దగ్గర ఏముంది? నశించే ఈ దేహం తప్ప. చాలా మంది కర్మంతరాలతో తమ జన్మను ముగించాలని అనుకుంటారు. కాని ఆ శరీరాన్ని దానం చేయడం ద్వారా మరింత సార్థకతతో తనువు ముగించాలనుకుంటున్నారు రాజ్యలక్ష్మి. ‘నా శరీరాన్ని మెడికల్ కాలేజీకి రాసివ్వాలనుకుంటున్నాను’ అని ఆమె అన్నప్పుడు ఆ ఇంట్లో చాలా ఆశ్చర్యమే పుట్టింది. చాలా చర్చే నడిచింది. అయినవాళ్లలో బంధువుల్లో ఎంతో మల్లగుల్లాలు నడిచాయి. ఇలాంటి కోరికను ఆ ఇంట్లో మగవాళ్లే కోరలేదు. అలాంటి ఒక స్త్రీ పైగా ఇంతకాలం సనాతన సంప్రదాయాలను పాటించే అమ్మమ్మ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం పట్ల ఒక నిశ్శబ్దం పాటించారు. కాని ఆ నిర్ణయం వెనుక ఉన్న సమాజ హితం, పరమార్థం తెలుసుకొని మద్దతుగా నిలిచారు. అంతే కాదు తాము కూడా శరీర దానానికి ముందుకొస్తున్నారు. మృత్యువును అర్థం చేసుకుంటే... ‘నా పేరు రాజ్యలక్ష్మి. నా వయసు 78 సంవత్సరాలు. నాలుగవ తరగతి వరకు చదువుకున్నాను. నా పుట్టినిల్లు, అత్తవారిల్లు రెండూ తూర్పుగోదావరి జిల్లా ఆలమూరే. నాకు ముగ్గురు మగ పిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు. అందరికీ పెళ్లిళ్లు అయిపోయి, ఎవరి సంసారాలు వాళ్లు చేసుకుంటున్నారు. కాని ఇలా వీరు స్థిరపడటం వెనుక నా సుదీర్ఘ ప్రయాణం ఉంది. ఎన్నో మంచి, చెడు అనుభవాలు ఉన్నాయి. జీవితం కష్టసుఖాల మయం అనడానికి గుర్తుగా ఇరవై సంవత్సరాల క్రితం మా పెద్దబ్బాయి హఠాత్తుగా మరణించాడు. వాడంటే నాకు ఇష్టం. వాడు చనిపోయాక శూన్యం అనిపించింది. వాడి శరీరం ఆఖరు ప్రయాణం చేస్తున్నప్పుడు వాడిక కనిపించడని కుంగిపోయాను. ఆ తరవాత కొంతకాలానికి మా వారు కాలం చేశారు. దెబ్బ మీద దెబ్బగా అనిపించింది. ఆయన పోయిన మూడో రోజున 90 సంవత్సరాలు పైబడిన మా అమ్మ కన్ను మూసింది. మా అమ్మ వాళ్ల ఇల్లు మా ఇంటి నుంచి కేవలం ఫర్లాంగు దూరం. అంతవరకూ ఆవిడను చూడటానికి రోజూ వెళ్లేదాన్ని. కాని కడసారి చూడటానికి వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. పదేళ్లు గడిచాక మరో ఎదురుదెబ్బ తగిలింది. చిన్న తిరుపతి వెళ్లి వస్తూ మా చిన్న కోడలు యాక్సిడెంట్లో మరణించింది. నా జీవితంలో అదో పెద్ద దెబ్బ. ఆ దెబ్బకీ తట్టుకున్నాను. కోడలు పోవడంతో రెండవ అబ్బాయికి ఆధారంగా నిలబడ్డాను. బతికి ఉండగా అందరికీ ఉపయోగపడిన ఈ మనుషులు, వీరి శరీరాలు చనిపోయాక ఇలా బూడిదలో కలిసిపోవలసిందేనా... వీటితో సాధించే పరమార్థం ఏదైనా ఉందా అనే ఆలోచన నాలో మొదలైంది. ఆ సంఘటన చూసి నాలో ఈ ఆలోచన నలుగుతున్నప్పుడే మాకు తెలిసినవారి ఇంట్లో ఆ ఇంటి యజమాని మరణించాడు. దహనకాండకు ఆవిడ చేతిలో చిల్లి గవ్వ లేదు. ఆవిడకు ఏం చేయాలో పాలుపోలేదు. కర్మకాండలంటే సుమారు పాతికవేలు ఖర్చు. భర్త పోయిన బాధలో ఉన్నా ఆవిడకు కర్తవ్యం గుర్తుకు వచ్చింది. వెంటనే దగ్గరున్న బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టి కార్యక్రమం పూర్తయిందనిపించింది. ఆ రోజే అనిపించింది దహనకాండ కోసం ఇన్ని ఇబ్బందులు పడటం కంటె, మన దేహాన్ని నలుగురికీ ఉపయోగపడేలా చేస్తే పుణ్యం పురుషార్థం కూడా కదా అని. అందరూ నాలా ఉండాలని నేను కోరుకోను. ఇది పూర్తిగా నా వ్యక్తిగతం మాత్రమే. పేపర్లో చదివి అప్పుడే ‘సాక్షి’ పేపర్లో అవయవదానం గురించి వ్యాసం చదివాను. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో చనిపోయినవారి శరీరంలోని అవయవాలతో చాలామందికి కొత్త ఊపిరి పోయవచ్చని తెలుసుకున్నాను. కళ్లు, గుండె, మూత్రపిండాలు, కాలేయం... మనిషి చనిపోయి కూడా తన అవయవాలను దానం చేసి ఇంతమందిని బతికించవచ్చా అనుకున్నాను. అలా కాని పక్షంలో మనం చనిపోయాక మన శరీరాన్ని మెడకల్ కాలేజీకి ఇస్తే పరిశోధనలకు పనికి వస్తుందని గ్రహించాను. అవయవ దానానికి గానీ, శరీర దానానికి కానీ నేను అనుమతి ఇవ్వడం, అందుకు అవసరమైన అనుమతులు తీసుకోవడం అవసరమని గ్రహించాను. ఈ విషయంలో చాలా రోజులు తర్జనభర్జన పడ్డాను. శాస్త్ర విరుద్ధమేమోనని కొన్నాళ్లు ఆలోచించాను. కొందరు పండితులను ఈ విషయం గురించి సంప్రదించాను. వారు తప్పు లేదని చెప్పారు. పురాణాల్లో కూడా ఉదంతాలు ఉన్నాయి. శిబి చక్రవర్తి తన శరీరాన్ని కోసి ఇచ్చాడు. దధీచి తన వెన్నెముకను దేవతల కోసం ఇచ్చేశాడు. పురాణాలు చదవడం కాదు, ఆచరణలో పెట్టాలి. ఛాందస భావాలున్న కుటుంబాలు కావు మావి. మనిషి బ్రతికుండగా తిండి పెట్టని పిల్లలు, చనిపోయాక లక్షలు ఖర్చు పెట్టి, పేపర్లో ప్రకటనలు ఇవ్వడం, సంతర్పణలు చేయడం అవసరమా అనిపించింది. పిల్లల అనుమతి కోసం ఈ విషయంలో పిల్లల అనుమతి తప్పక తీసుకోవాలి. అయితే ఈ విషయం ఎలా చెప్పాలో అర్థం కాలేదు. అందుకే వాళ్లతో తరచుగా ఈ విషయమై చర్చించడం ప్రారంభించాను. కొన్నాళ్ల తరువాత మా అబ్బాయిలకు అసలు విషయం చెప్పాను. వాళ్లు వెంటనే ఏమీ మాట్లాడలేదు. ప్రతిరోజూ నేను ప్రస్తావన తీసుకురావడం, వాళ్లు మాట దాటేయడం... ఇలా నెలరోజులు గడిచిపోయాయి. ఇక నేను ఈ విషయంలో మొండిగా ఉన్నానని అర్థం చేసుకున్నారు. నా దేహాన్ని కాకినాడ మెడికల్ కాలేజీకి రాసేశాను. ఈ సంగతి విని కొందరు మెచ్చుకున్నారు. ఎక్కువమంది ‘పోయేకాలం’ అని తిట్టారు. సంప్రదాయిక కుటుంబంలో పుట్టిన నీకు ఈ బుద్ధులెలా వచ్చాయి అన్నారు. అన్నిటికీ చిరునవ్వే నా సమాధానం. నేను శరీరదానం చేయడం చూసి మా మూడో అబ్బాయి జనార్దనస్వామి, మూడో కోడలు విజయ కూడా కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీకి దేహదానం చేశారు. అనుమతి పత్రాలు తెచ్చుకున్నారు. నా ఆకాంక్ష నా నిర్ణయం వల్ల నా పిల్లలకు సమాజం నుండి కొంత ఇబ్బంది కలగవచ్చు. మంచి పని చేసిన రాజా రామ్మోహన్రాయ్, వీరేశలింగం గారు పడిన ఇబ్బందితో పోలిస్తే ఇదెంత. వారు అధిగమించగలరు. నా నిర్ణయం సమాజంలో కొందరికి స్ఫూర్తి కలిగించాలని నా ఆకాంక్ష’ అని ముగించారామె. – డా. వైజయంతి మాది మేనరికం. మా మేనత్త కొడుకునే వివాహం చేసుకున్నాను. చిన్నప్పటి నుంచి మా అత్తను దగ్గరగా చూశాను. ఆవిడ ఎవ్వరినీ ఒక్క మాట కూడా అనదు. ఎంతటి ఇబ్బంది వచ్చినా చిరునవ్వు చెరగనీయదు. సంప్రదాయ కుటుంబంలో పుట్టిన ఆవిడ ఇంత మంచి నిర్ణయం తీసుకుంది. ఆవిడను స్ఫూర్తిగా తీసుకుని నేను కూడా శరీర దానం చేయాలనుకున్నాను. అత్తతో ఈ విషయం చెప్పాను. తన అంగీకారం తెలిపింది. – విజయ (కోడలు) -
‘శంకరాభరణం ’ నా పేరులో భాగమైంది
అన్నవరం : కళాతపస్వి కె. విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ‘శంకరాభరణం’ సినిమా తనకు ఎంతో పేరు తెచ్చిందని, ఆ సినిమా పేరు తన పేరులో భాగమైందని ప్రముఖ నటి శంకరాభరణం రాజ్యలక్ష్మి అన్నారు. సోమవారం ఆమె కుటుంబసభ్యులతో కలసి రత్నగిరిపై సత్యదేవుని వ్రతం ఆచరించి స్వామివారిని దర్శించుకున్నారు. ఆమె విలేకరులతో మాట్లాడుతూ దాదాపు 32 ఏళ్ల క్రితం వచ్చిన ఆ సినిమా వలనే తాను చాలా గుర్తింపు పొందానన్నారు. సత్యదేవుని సన్నిధికి వచ్చినా, అన్నవరం మీదుగా ప్రయాణించినా తనకు ఆ సినిమా జ్ఞాపకాలు వెంటాడుతూ ఉంటాయన్నారు. తాను ఆ సినిమా తరువాత సుమారు 200 సినిమాలలో నటించినట్టు చెప్పారు. ప్రస్తుతం సినిమాలతో బాటు టీవీ సీరియల్స్‌లో నటిస్తున్నట్టు శంకరాభరణం రాజ్యలక్ష్మి తెలి పారు. ఆమెకు ఆలయ సూపరింటెండెంట్ డీవీఎస్ కృష్ణారావు స్వాగ తం పలి కారు. అనంతరం పండితులు వేదాశీస్సులు, ప్రసాదాలు అందజేశారు. -
అత్తింటి ఆరళ్లకు అబల బలి
వివాహమైన ఏడాదికే ఆమెకు నూరేళ్లూ నిండాయి. కడదాకా తోడుంటానని బాస చేసిన భర్తే ఆమె పాలిట యముడై నిత్యం వేధింపులకు పాల్పడ్డాడు. జీవిత భాగస్వామి నుంచి ఛీత్కారాలు ఎక్కువ కావడంతో మనస్తాపం చెంది ఆ యువతి పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన సంతమాగులూరు మండలం పరిటాలవారిపాలెంలో బుధవారం జరిగింది. సంతమాగులూరు : భర్త, అత్తమామల వేధింపులకు తాళలేక ఓ యువతి పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన మండలంలోని పరిటాలవారిపాలెంలో జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన పుట్టా వీరాంజనేయులు చిన్న కుమారుడు నాగరాజుకు గుంటూరు జిల్లా నూజెండ్ల మండలం ముతరాసిపాలేనికి చెందిన చొప్పవరపు వెంకట్రావు రెండో కుమార్తె ఊహ(20)తో గతేడాది ఏప్రిల్‌లో వివాహమైంది. వీరి కాపురం ఆరు నెలల వరకు సజావుగానే సాగింది. ఆ తర్వాత దంపతుల మధ్య కలతలు రేగాయి. ఈ నేపథ్యంలో 20 రోజుల క్రితం భార్యను భర్త తన్ని ఆమె పుట్టింటికి తరిమేశాడు. ఇటీవల భార్య వద్దకు వెళ్లి నచ్చజెప్పి మళ్లీ ఇంటికి తెచ్చుకున్నాడు. మంగళవారం ఉదయం ఊహ భర్త నాగరాజు పనికి వెళ్లి సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఇంటికి వచ్చాడు. తన అన్న అయ్యప్ప, తల్లిదండ్రులు ఉండే గది తలుపులు పూర్తిగా వేసి ఉండటం.. తన గది తలుపులు ఓరగా వేసి ఉండటంతో ఇంట్లో ఎవరూ లేరని భావించి తలుపులు మరింత దగ్గరకు వేసేందుకు వెళ్లాడు. గదిలో తన అన్న అయ్యప్ప, తన భార్య ఊహ ఉండటాన్ని గుర్తించాడు. జీర్ణించుకోలేని నాగరాజు అన్న, తన భార్యపై చేయి చేసుకున్నాడు. బావముందే చేయి చేసుకున్నందుకు మనస్తాపం చెందిన ఊహ.. ఆ వెంటనే తమ వంగతోట వద్దకు వెళ్లింది. అక్కడ పురుగుమందు తాగింది. తోట వద్దే ఉన్న అత్త రాజ్యలక్ష్మి దగ్గరకు వచ్చేలోపే కోడలు కిందపడి ఉంది. స్థానికుల సాయంతో ఉహను ఇంటికి చేర్చారు. అనంతరం 108 సిబ్బందికి సమాచారం అందించారు. వారు ఎంతకీ స్పందించకపోవడంతో ఆటోలో వైద్యశాలకు తరలిస్తుండగా ఏల్చూరు సమీపంలోకి వెళ్లే సరికి 108 వాహనం వచ్చింది. ఊహను అందులో ఎక్కించేందుకు ప్రయత్నిస్తుండగా ఆమె మృతి చెందినట్లు 108 సిబ్బంది ధ్రువీకరించారు. పుట్టింటికి సమాచారం ఇవ్వడంలో జాప్యం ఊహ తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంలో అత్తింటి వారు తీవ్ర జాప్యం చేశారు. వారే సమాచారం తెలుసుకుని వచ్చారు. కుమార్తె విగతజీవిగా పడి ఉండటం చూసి తల్లిదండ్రులు భోరున విలపించారు. ఆ సమయంలో అక్కడ అత్తింటి వారెవరూ లేకపోవడంతో ఊహ బంధువులకు అనుమానం వచ్చింది. తమ బిడ్డను అత్తింటివారే చంపారని ఆరోపించారు. తమ కుమార్తె మరణానికి ఊహ భర్త నాగరాజు, బావ అయ్యప్ప, అత్త రాజ్యలక్ష్మి, మామ వీరాంజనేయులే కారణమని పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు ఎస్సై ఎ.శివనాగరాజు కేసు నమోదు చేశారు. తహశీల్దార్ గంగాధరరావు సమక్షంలో శవపంచనామా నిర్వహించి పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించినట్లు ఎస్సై తెలిపారు. -
అంగన్వాడీ భవనాలకు రూ.100 కోట్లు
తాండూరు టౌన్, న్యూస్‌లైన్: రీజియన్ పరిధిలో నూతన అంగన్వాడీ భవనాల నిర్మాణానికి సుమారు రూ.100 కోట్లు అందుబాటులో ఉన్నాయని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ రీజినల్ డిప్యూటీ డెరైక్టర్ రాజ్యలక్ష్మి పేర్కొన్నారు. బుధవారం ఆమె తాండూరు పట్టణంలోని ‘శిశుగృహ’ను సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రీజినల్ పరిధిలోని రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్లగొండ, నిజామాబాద్, మెదక్, హైదరాబాద్ జిల్లాల్లో 1,539 అంగన్వాడీ భవనాల నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు నుంచి రూ.4.5లక్షల చొప్పున రూ. 69.25 కోట్లు మంజూరయ్యాయన్నారు. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో భవన నిర్మాణానికి రూ.రెండు లక్షల చొప్పున మొత్తం రూ.30.78 కోట్లను మంజూరు చేసిందన్నారు. రీజినల్ పరిధిలో 10 ఏళ్ల సర్వీసు, ఇతర అర్హతలు ఉన్న 161 మంది అంగన్వాడీ కార్యకర్తలకు సూపర్వైజర్లుగా పదోన్నతి కల్పించామన్నారు. అంగన్వాడీల వేతనాల పెంపు అంశం ఉన్నతాధికారుల పరిశీలనలో ఉందన్నారు. ఇందిరమ్మ, అమృతహస్తం, బాలామృ తం పథకాలు పకడ్బందీగా అమలవుతున్నాయన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే ఖాళీగా ఉన్న 400అంగన్వాడీ కార్యకర్తల పోస్టులను భర్తీ చేయనున్నట్లు చెప్పారు. తాండూరు పరిధిలో ఖాళీగా ఉన్న మూడు సూపర్వైజర్ పోస్టులను కూడా భర్తీ చేస్తామన్నారు. ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు కళాజాత కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. అనంతరం శిశుగృహలోని చిన్నారుల వివ రాలను, వారి ఆరోగ్య పరిస్థితులను నిర్వాహకురాలు సునీతను అడిగి తెలుసుకున్నారు. ఆమె వెంట ఐసీడీఎస్ సీడీపీఓ వెంకటలక్ష్మి ఉన్నారు. -
ఉపాధ్యాయ వృత్తిపై తగ్గుతున్న గౌరవం
అనంతపురం ఎడ్యుకేషన్, న్యూస్‌లైన్ : ‘పిల్లలను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దే ఉపాధ్యాయ వృత్తిపై సమాజంలో గౌరవం తగ్గుతోందని ఆర్వీఎం రాష్ట్ర అకడమిక్ మానిటరింగ్ అధికారి (ఏఎంఓ) రాజ్యలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక జిల్లా పరిషత్ సమావేశ హాలులో ‘పాఠశాల నాయకత్వం’ అనే అంశంపై ఆర్వీఎం ఆధ్వర్యంలో విద్యాశాఖ అధికారులు, ఎమ్మార్జీలకు ఏ ర్పాటు చేసిన రెండు రోజుల జిల్లా స్థాయి వర్క్‌షాపును సోమవారం ఆమె ప్రారంభించారు. కార్యక్రమానికి పీఓ కేఎస్ రా మారావు అధ్యక్షత వహించారు. స్టేట్ ఏఎంఓ మాట్లాడుతూ వృత్తి అంటే ఒకప్పుడు ఎనలేని గౌరవం ఉండేదన్నారు. తరగతి గదుల్లో చదువుకున్న ఎందరో అనేకరంగాల్లో లీడర్లుగా ఎదిగారన్నారు. ఇలాంటి లీడర్ల నుతయారు చేస్తున్న లీడర్ల (ఉపాధ్యాయుల్లో)లో నాయకత్వ లక్షణాలు కరువయ్యాయన్నారు. ఫలితంగా ప్రభుత్వ విద్యా వ్య వస్థ మనుగడ ప్రశ్నార్థకం అవుతుందని ఆమె ఆందోళన వ్య క్తం చేశారు. పాఠశాలల్లో పిల్లలకు పాఠ్యపుస్తకాలు, యూనీఫాం, మధ్యా హ్న భో జనం, అర్హులైన టీచర్లు, తదితర సౌకర్యాల కోసం ప్రభుత్వం రూ. కోట్లు ఖర్చు పెడుతోందన్నారు. అయినా పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఏడాదికేడాది తగ్గుతోందని విచారం వ్యక్తం చేశారు. ప్ర భుత్వ ఉద్యోగుల పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో చదవాలనే జీఓ తీసుకురావడంతో చదువులో కేరళ రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉందన్నారు. తరగతి గది నా యకుడు ఉపాధ్యాయుడు, పాఠశాల నాయకుడు ప్రధానోపాధ్యాయుడన్నారు. అన్ని అంశాల్లోనూ నాయకుడిగా ఆలోచించి అమలు చేస్తేనే మంచి ఫలితాలు వస్తాయన్నారు. డీఈఓ మధుసూదన్‌రావు, పీఓ కేఎస్ రామారావు మాట్లాడుతూ పర్యవేక్షణ లోపిస్తే ఆశించిన ఫలితాలు రావన్నారు. ఉపాధ్యాయులు పిల్లల్లో మమేకం కావాలన్నారు. డైట్ కళాశాల ప్రిన్సిపల్ మునెయ్య మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో విద్యా వ్యవస్థను బతికించుకోవడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆర్వీఎం కార్యక్రమాలపై ప్రదర్శన వర్క్‌షాపు సందర్భంగా జిల్లాలో ఆర్వీ ఎం అభివృద్ధి కార్యక్రమాలను పవర్ పా యింట్ ప్రజెంటేషన్ ద్వారా రాష్ట్ర ఏం ఎంఓ రాజ్యలక్ష్మికి వివరించారు. ‘మోడల్ స్కూల్‌గా ఎంపీపీఎస్ ఉరవకొండ’, ‘ మోడల్ కాల్ స్కూల్‌గా ఆర్. కొత్తూరు, బీకేఎస్ మండలం’, ‘మోడల్ కేజీబీవీగా బుక్కరాయసముద్రం’, ‘మోడల్ భవిత కేంద్రంగా బత్తలపల్లి’, ‘మోడల్ ఎస్ఎంసీగా నామనాంకపల్లి, పెద్దపప్పూరు మండలం’, ‘మోడల్ అర్బన్ డి ప్రైవ్డ్ హాస్టల్‌గా అనంతపురం’ను ప్ర జెంటేషన్ ద్వారా పీఓ వివరించారు. ఏఎంఓలు బాల, వెంకటాచారి, స్టేట్ సీ ఎంఓ బండి సాయన్న, విద్యాశాఖ ఏడీ పగడాల లక్ష్మీనారాయణ, డైట్ లెక్చరర్లు సుబ్బారావు, సాయిప్రసాద్, ఇన్చార్జ్ ఏంఎంఓ గురుప్రసాద్, పాఠశాల ఆ రోగ్య సమన్వయకర్త జయశేఖర్‌రెడ్డి, సీ ఎంఓ దివాకర్‌రెడ్డి, అలెస్కో శ్రీనివాసరావు, ఐఈ కోఆర్డినేటర్ పాండురంగ పాల్గొన్నారు. -
భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం
మహబూబాబాద్, న్యూస్‌లైన్ : పట్టణ శివారులోని గిరిప్రసాద్‌నగర్ కాలనీ లో ఓ ఇంటిపై పోలీసులు దాడిచేసి భారీగా డిటోనేటర్లు, జిలెటిన్‌స్టిక్స్, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ రమాదేవి తెలిపారు. ఆమె కథనం ప్రకారం... పట్టణ శివారు గిరిప్రసాద్‌నగర్ కాలనీకి చెందిన మహ్మద్‌పాషా ఇంట్లో అక్రమంగా మందుగుండు సామగ్రి నిల్వ చేసినట్లు పోలీసులకు సమాచారం అందింది. పక్కా సమాచారం మేరకు డీఎస్పీ రమాదేవి ఆధ్వర్యంలో రూరల్ సీఐ వాసాల సతీష్, రూరల్ ఎస్సై రాజ్యలక్ష్మి సిబ్బందితో వెళ్లి ఆ ఇంటిపై దాడిచేశారు. ఇంట్లో తనిఖీ చేయగా 3,263 అల్యూమినియం ఎలక్ట్రిక్ డిటోనేటర్లు, 200 ఎలక్ట్రిక్ డిటోనేటర్లు, 520 నాన్ ఎలక్ట్రిక్ డిటోనేటర్లు, డేంజరస్ ఎక్స్‌ప్లోజివ్ డిటోనేటర్లు 3 బాక్సులు(150), 44 వైర్ బండిళ్లు(578 మీటర్లు), 476 జిలెటిన్ స్టిక్స్, 145 పెద్ద డిటోనేటర్లు, అల్యూమినియం నైట్రేట్ 40 కేజీలు లభించాయి. దీంతో తహసీల్దార్ నూతి భాగ్యమ్మ ఆర్ఐ తిరుపతి సమక్షంలో పంచనామా నిర్వహించినట్లు డీఎస్పీ చెప్పారు. నిందితుడు పరారీలో ఉన్నట్లు ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ. అక్రమంగా మందుగుండు సామగ్రి నిల్వ ఉంచడం, ఉపయోగించడం చట్టరీత్యా నేరమన్నారు. మందుగుండు సామగ్రి ద్వారా ఇంట్లో ఉన్నవారికేగాక ఆ కాలనీవాసులకు కూడా ప్రమాదం పొంచి ఉంటుందన్నారు. ఆ సామగ్రి మూలంగా ఏ మాత్రం చిన్న తప్పు జరిగినా ప్రాణాలకే ప్రమాదమని హెచ్చరించారు.