అనంతపురం ఎడ్యుకేషన్, న్యూస్‌లైన్ : ‘పిల్లలను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దే ఉపాధ్యాయ వృత్తిపై సమాజంలో గౌరవం తగ్గుతోందని ఆర్వీఎం రాష్ట్ర అకడమిక్ మానిటరింగ్ అధికారి (ఏఎంఓ) రాజ్యలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక జిల్లా పరిషత్ సమావేశ హాలులో ‘పాఠశాల నాయకత్వం’ అనే అంశంపై ఆర్వీఎం ఆధ్వర్యంలో విద్యాశాఖ అధికారులు, ఎమ్మార్జీలకు ఏ ర్పాటు చేసిన రెండు రోజుల జిల్లా స్థాయి వర్క్‌షాపును సోమవారం ఆమె ప్రారంభించారు.
కార్యక్రమానికి పీఓ కేఎస్ రా మారావు అధ్యక్షత వహించారు. స్టేట్ ఏఎంఓ మాట్లాడుతూ వృత్తి అంటే ఒకప్పుడు ఎనలేని గౌరవం ఉండేదన్నారు. తరగతి గదుల్లో చదువుకున్న ఎందరో అనేకరంగాల్లో లీడర్లుగా ఎదిగారన్నారు. ఇలాంటి లీడర్ల నుతయారు చేస్తున్న లీడర్ల (ఉపాధ్యాయుల్లో)లో నాయకత్వ లక్షణాలు కరువయ్యాయన్నారు. ఫలితంగా ప్రభుత్వ విద్యా వ్య వస్థ మనుగడ ప్రశ్నార్థకం అవుతుందని ఆమె ఆందోళన వ్య క్తం చేశారు. పాఠశాలల్లో పిల్లలకు పాఠ్యపుస్తకాలు, యూనీఫాం, మధ్యా హ్న భో జనం, అర్హులైన టీచర్లు, తదితర సౌకర్యాల కోసం ప్రభుత్వం రూ. కోట్లు ఖర్చు పెడుతోందన్నారు.
అయినా పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఏడాదికేడాది తగ్గుతోందని విచారం వ్యక్తం చేశారు. ప్ర భుత్వ ఉద్యోగుల పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో చదవాలనే జీఓ తీసుకురావడంతో చదువులో కేరళ రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉందన్నారు. తరగతి గది నా యకుడు ఉపాధ్యాయుడు, పాఠశాల నాయకుడు ప్రధానోపాధ్యాయుడన్నారు. అన్ని అంశాల్లోనూ నాయకుడిగా ఆలోచించి అమలు చేస్తేనే మంచి ఫలితాలు వస్తాయన్నారు.
డీఈఓ మధుసూదన్‌రావు, పీఓ కేఎస్ రామారావు మాట్లాడుతూ పర్యవేక్షణ లోపిస్తే ఆశించిన ఫలితాలు రావన్నారు. ఉపాధ్యాయులు పిల్లల్లో మమేకం కావాలన్నారు. డైట్ కళాశాల ప్రిన్సిపల్ మునెయ్య మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో విద్యా వ్యవస్థను బతికించుకోవడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఆర్వీఎం కార్యక్రమాలపై ప్రదర్శన
వర్క్‌షాపు సందర్భంగా జిల్లాలో ఆర్‌వీ ఎం అభివృద్ధి కార్యక్రమాలను పవర్ పా యింట్ ప్రజెంటేషన్ ద్వారా రాష్ట్ర ఏం ఎంఓ రాజ్యలక్ష్మికి వివరించారు. ‘మోడల్ స్కూల్‌గా ఎంపీపీఎస్ ఉరవకొండ’, ‘ మోడల్ కాల్ స్కూల్‌గా ఆర్. కొత్తూరు, బీకేఎస్ మండలం’, ‘మోడల్ కేజీబీవీగా బుక్కరాయసముద్రం’, ‘మోడల్ భవిత కేంద్రంగా బత్తలపల్లి’, ‘మోడల్ ఎస్‌ఎంసీగా నామనాంకపల్లి, పెద్దపప్పూరు మండలం’, ‘మోడల్ అర్బన్ డి ప్రైవ్డ్ హాస్టల్‌గా అనంతపురం’ను ప్ర జెంటేషన్ ద్వారా పీఓ వివరించారు.
ఏఎంఓలు బాల, వెంకటాచారి, స్టేట్ సీ ఎంఓ బండి సాయన్న, విద్యాశాఖ ఏడీ పగడాల లక్ష్మీనారాయణ, డైట్ లెక్చరర్లు సుబ్బారావు, సాయిప్రసాద్, ఇన్‌చార్జ్ ఏంఎంఓ గురుప్రసాద్, పాఠశాల ఆ రోగ్య సమన్వయకర్త జయశేఖర్‌రెడ్డి, సీ ఎంఓ దివాకర్‌రెడ్డి, అలెస్కో శ్రీనివాసరావు, ఐఈ కోఆర్డినేటర్ పాండురంగ పాల్గొన్నారు.
ఉపాధ్యాయ వృత్తిపై తగ్గుతున్న గౌరవం
Published Tue, Jan 21 2014 4:33 AM | Last Updated on Sat, Sep 2 2017 2:49 AM
Advertisement
Advertisement