హనుమాన్ కాన్సెప్ట్ స్టోరీతో తెలుగులో మరో సినిమా | Gadadhari Hanuman Movie Details Latest | Sakshi
Sakshi News home page

హనుమాన్ కాన్సెప్ట్ స్టోరీతో తెలుగులో మరో సినిమా

Published Mon, Sep 2 2024 2:14 PM | Last Updated on Mon, Sep 2 2024 2:14 PM

Gadadhari Hanuman Movie Details Latest

నూతన నిర్మాణ సంస్థ విరభ్ స్టూడియోస్ సమర్పణలో రోహిత్ కొల్లిని దర్శకుడిగా పరిచయం చేస్తూ తీస్తున్న సినిమా 'గదాధారి హనుమాన్'. తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని తీస్తున్నారు. తాజాగా టైటిల్ పోస్టర్ రిలీజ్ చేశారు. అలానే మూవీకి సంబంధించిన వివరాల్ని బయటపెట్టారు.

(ఇదీ చదవండి: 'బిగ్‌బాస్'లోకి వచ్చి రోజు కాలేదు.. అప్పుడే వాగ్వాదాలు)

'గదాధారి హనుమాన్' సినిమాని ఆధ్యంతం అన్ని అంశాలతో ఓ డివైన్ టచ్ ఇచ్చి, చాలా అద్భుతంగా తీశామని.. ప్రేక్షకులు కూడా ఈ సినిమా చూసి 'కల్కి', 'హనుమాన్' లాంటి బ్లాక్ బస్టర్‌ చేస్తారనే నమ్మకంతో ఉన్నామని దర్శకుడు రోహిత్ కొల్లి చెప్పాడు. రవి, హర్షిత, బసవరాజు, రమేష్ పండిట్, నగేష్ మైయ్య, కళ్యాణ్ కీలక పాత్రలు పోషించారు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులు శర వేగంగా జరుగుతునాయి. త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుని నవంబర్ లో చిత్రాన్ని విడుదల చేసే సన్నాహాలు జరుగుతున్నాయి.

(ఇదీ చదవండి: 'బిగ్‌బాస్ 8' షోలో తెలుగు వాళ్లకు అన్యాయం?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement