విప్లవ్ అనే కుర్రాడు.. హీరో, డైరెక్టర్, నిర్మాత, మాటల రచయితగా చేసిన సినిమా 'ఈసారైనా!?'. పల్లెటూరి బ్యాక్ డ్రాప్ స్టోరీతో దీన్ని తెరకెక్కించారు. తాజాగా (నవంబర్ 8న) థియేటర్లలోకి వచ్చింది. ఇంతకీ ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.
కథేంటి?
డిగ్రీ చేసిన రాజు (విప్లవ్).. నాలుగేళ్లుగా గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తుంటాడు. అదే ఊరిలో ఉండే శిరీష(అశ్విని) గవర్నమెంట్ టీచర్‌గా చేస్తుంటుంది. విప్లవ్, శిరీషని ప్రేమిస్తుంటాడు. ఆమె తండ్రి మాత్రం గవర్నమెంట్ జాబ్ వస్తేనే పెళ్లి చేస్తానని కండీషన్ పెడతాడు. మరి రాజు.. గవర్నమెంట్ జాబ్ కొట్టాడా లేదా? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.
(ఇదీ చదవండి: తమన్నా డిజాస్టర్ సినిమా.. ఏడాది తర్వాత ఓటీటీలోకి)
ఎలా ఉందంటే?
అద్భుతమైన లొకేషన్లలో ఈ సినిమా తీశారు. రాజు-శిరీష పాత్రల మధ్య లవ్ ట్రాక్, రొమాంటిక్ సీన్స్ యూత్‌కి కనెక్ట్ అవుతాయి. క్లైమాక్స్‌లో వచ్చే పాట బాగుంది. హీరో హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కూడా క్యూట్ అండ్ స్వీట్‌గా తెరకెక్కించారు. అక్కడక్కడ కొన్ని సీన్లు సాగదీతగా అనిపించాయి. అలానే తెలిసిన ముఖాలు కూడా లేకపోవడం మైనస్ అని చెప్పొచ్చు.
ఎవరు ఎలా చేశారంటే?
హీరో విప్లవ్ కుర్రాడిలా అద్భుతంగా నటించాడు. అశ్విని చూడటానికి బాగుంది. తండ్రి పాత్రలో ప్రదీప్ రాపర్తి పర్లేదనిపించాడు. మిగిలిన పాత్రధారులు తమ పాత్రలకు న్యాయం చేశారు. టెక్నికల్ విషయాలకొస్తే చాలా విభాగాలని దగ్గరుండి చూసుకున్న విప్లవ్ ఆకట్టుకున్నాడు. పాటలు బాగున్నాయి. సినిమాటోగ్రాఫీ ఓకే. పచ్చని పల్లెటూరిలో ప్రశాంతంగా అనిపించే యూత్ ఫుల్ లవ్ స్టోరీ ఇది.
(ఇదీ చదవండి: పెళ్లయిన 13 ఏళ్లకు ప్రెగ్నెన్సీ.. నటి పోస్ట్ వైరల్)
Comments
Please login to add a commentAdd a comment