మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటిస్తోన్న తాజా చిత్రం 'భ్రమయుగం'. ఈ చిత్రానికి 'భూతకాలం' ఫేమ్ రాహుల్ సదాశివన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను నైట్ షిఫ్ట్ స్టూడియోస్, వైనాట్ స్టూడియోస్ బ్యానర్లపై చక్రవర్తి రామచంద్ర, ఎస్.శశికాంత్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ఈ మూవీ పోస్టర్స్ 'భ్రమయుగం’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచేశాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు ఆడియన్స్ నుంచి విశేష స్పందన వచ్చింది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్.
చాలా కాలం తర్వాత బ్లాక్ అండ్ వైట్‌లో రూపొందించిన ఈ చిత్ర ట్రైలర్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తోంది. ఈ సినిమా కథ కేరళలో మాయ/తంత్రంతో నిండిన యుగంలో నడుస్తుంది. ఒక సింగర్ జీవితంలో జరిగిన అనూహ్య ఘటనల నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫిబ్రవరి 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ముందుగా మలయాళం భాషలో మాత్రమే విడుదల చేయాలని తాజాగా మేకర్స్ నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. కాగా.. ఈ చిత్రానికి క్రిస్టో జేవియర్ సంగీతమందించారు.
ఈ చిత్రంలో విలన్‌లు, హీరోలు లేరని మెగాస్టార్ మమ్ముట్టి అన్నారు. విలన్‌లు, హీరోలు అనే కాన్సెప్ట్ కూడా లేని కాలంలో 'భ్రమయుగం' తెరకెక్కుతోంది. ఈ చిత్రంలోనా పాత్ర చాలా మిస్టరీగా ఉంటుందని తెలిపారు. బ్లాక్ అండ్ వైట్ సినిమాలో భాగమైనందుకు మమ్ముట్టి సంతోషం వ్యక్తం చేశారు.
మమ్ముట్టి మాట్లాడుతూ.. 'గతంలో బ్లాక్ అండ్ వైట్ సినిమాలు చాలా వచ్చాయి. ఫ్లాష్‌బ్యాక్‌లను బ్లాక్ అండ్ వైట్‌లో చూపించేవాళ్లం. ఇప్పటికీ చాలా మంది చేస్తున్నారు. అయితే ఇలాంటి సినిమాల జోలికి వెళ్లకపోవడం వల్ల యువత పూర్తిగా బ్లాక్ అండ్ వైట్‌లో సినిమా చూడటం ఇప్పుడు కొత్త అనుభూతిని కలిగిస్తుంది' అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment