సలార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన తాజా చిత్రం ఆడుజీవితం. ఇటీవల థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. విడుదలైన తొమ్మిది రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లో చేరింది. ఈ విషయాన్ని హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ట్విటర్ ద్వారా పంచుకున్నారు. ఇంత గ్రాండ్ సక్సెస్ చేసినందుకు ఆడియన్స్‌కు ధన్యవాదాలు తెలిపారు. మలయాళ సినిమా చరిత్రలోనే అత్యంత వేగంగా వంద కోట్ల వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.
మొత్తంగా చూస్తే మలయాళ చిత్రసీమలో ఈ మైలురాయిని సాధించిన ఆరో చిత్రంగా ఆడుజీవితం నిలిచింది. గతంలో రూ.100 కోట్ల మార్క్‌ను చేరుకోవడానికి '2018' సినిమాకు 11 రోజులు పట్టగా.. ఆ రికార్డును అధిగమించింది. 'లూసిఫర్', 'మంజుమ్మెల్ బాయ్స్' 12 రోజుల్లో ఈ ఫీట్ సాధించాయి. ఇటీవల హిట్‌గా నిలిచిన 'ప్రేమలు చిత్రానికి ఈ క్లబ్‌లో చేరడానికి 31 రోజులు పట్టింది. అలాగే 'పులిమురుగన్' సినిమాకు 36 రోజులు పట్టింది.
అంతే కాకుండా మలయాళ చిత్రసీమలో అత్యంత వేగంగా రూ.50 కోట్ల మార్కును క్రాస్ చేసిన చిత్రంగా పేరు తెచ్చుకుంది. ఈ ఏడాదిలో ‘ప్రేమలు, మంజుమ్మెల్ బాయ్స్ తర్వాత రూ.100 కోట్ల మైలురాయి చేరుకున్న మూడో చిత్రంగా ఆడుజీవితం నిలిచింది. కాగా.. ఈ చిత్రానికి బ్లెస్సీ దర్శకత్వం వహించారు.
100 Cr and counting at the Global Box Office! Thank you for this unprecedented success! ❤️🙏 #Aadujeevitham #TheGoatLife @DirectorBlessy @benyamin_bh @arrahman @Amala_ams@Haitianhero @rikaby @resulp @iamkrgokul @HombaleFilms @AAFilmsIndia @PrithvirajProd @RedGiantMovies_… pic.twitter.com/6H1gynVIJ6
— Prithviraj Sukumaran (@PrithviOfficial) April 6, 2024
Comments
Please login to add a commentAdd a comment