Malayalam Movie Holy Wound OTT Release Date Out Now - Sakshi
Sakshi News home page

Holy Wound Movie OTT Release Date: ఓటీటీలోకి లెస్బియ‌న్  చిత్రం `హోలీ వుండ్‌`

Published Tue, Aug 9 2022 1:46 PM | Last Updated on Tue, Aug 9 2022 3:24 PM

Malayalam film Holy Wound OTT Release date Out - Sakshi

‘బిగ్‌బాస్‌’ ఫేమ్‌ జాన‌కి సుంద‌ అమృతా వినోద్‌, సాబు ప్రౌదిక్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో అశోక్‌ ఆరాన్‌ తెరకెక్కించిన చిత్రం.`హోలీవుండ్‌`. స‌హ‌స్ర సినిమాస్ ప్రై. లి స‌మ‌ర్ప‌ణ‌లో  సందీప్ ఆర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. లెస్బియ‌న్ నేప‌థ్యంలో రూపొందిన  ఈ మలయాళ చిత్రం ఓటీటీ విడుదల తేది ఖరారైంది. ఆగస్ట్‌ 12 నుంచి  ఎస్ ఎస్ ఫ్రేమ్స్(SS Frames) ఓటీటీలో ఈ చిత్రం స్ట్రీమింగ్‌ కానుంది. ఈ మేరకు చిత్ర యూనిట్‌ అధికారిక ప్రకటన విడుదల చేసింది. 

(చదవండి: ‘థ్యాంక్యూ’ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది.. ఎప్పుడు.. ఎక్కడ?)

ఈ సందర్భంగా నిర్మాత సందీప్‌ ఆర్‌ మాట్లాడుతూ.. `చిన్న‌ప్ప‌టి నుంచి క‌లిసి పెరిగిన ఇద్ద‌రు అమ్మాయిలు..కొంత కాలంగా క‌లిసి ఉండ‌టంతో  ఇద్దరి మధ్య లైంగిక సంబంధం ఏర్పడుతంది. సృష్టికి విరుద్దంగా వారు లైంగిక సంతృప్తి చెందుతుంటారు. ఈ నేప‌థ్యంలో ఎలాంటి ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి అన్న‌ది సినిమా.  డీప్ ప్రేమ‌లో ఉన్న ఇద్ద‌రు ఆడ‌వాళ్లు, ఇద్ద‌రు మ‌గ‌వాళ్లు శృంగారంలో పాల్గొన‌డం త‌ప్పు కాదు అనే అంశాన్ని మా సినిమాలో చూపిస్తున్నాం. మా సినిమా ఎన్నో వివాదాల్లో చిక్కుకొని ..వాట‌న్నింటినీ దాటుకొని ఈ నెల 12న ఎస్ ఎస్ ఫ్రేమ్స్ ఓటీటీ ద్వారా రిలీజ్ చేస్తున్నాం. మాట‌లు లేని ఈ సైలెన్స్  లెస్బియ‌న్ సినిమా  మీ అంద‌ర్నీ ఆక‌ట్టుకుంటుంద‌ని న‌మ్ముతున్నాం’ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement