Holy Wound Movie
-
ఓటీటీలో లెస్బియిన్ చిత్రం 'హోలీ వుండ్'.. 18 గంటల్లోనే
సహస్ర సినిమాస్ ప్రై. లి సమర్పణలో జానకి సుందర్, అమృతా వినోద్, సాబు ప్రౌదిక్ ప్రధాన పాత్రల్లో సందీప్ ఆర్ మలయాళంలో నిర్మించిన చిత్రం `హోలీ వుండ్`. అశోక్ ఆరాన్ దర్శకుడు. లెస్బియన్ నేపథ్యంలో రూపొందిన ఈ సైలెన్స్ సినిమా ఎన్నో కాంట్రవర్సీల మధ్య ఈ నెల 12న 'ఎస్ఎస్ ఫ్రేమ్స్' ఓటీటీ ద్వారా గ్రాండ్ గా రిలీజై మొదటి రోజే లక్షల మంది వీక్షకుల మనసు దోచుకుంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ.. ``మలయాళంలో వచ్చిన మొదటి లెస్బియన్ చిత్రానికి బుకింగ్స్ చూసి మేమే ఆశ్చర్యపోయాం. వేరే ఓటీటీల్లో లక్షల్లో వీక్షకులు అవకాశం తక్కువ. ఎస్ఎస్ ఫ్రేమ్స్ లో కేవలం 18 గంటల్లో మూడు లక్షల మంది సినిమా చూశారు. ఈ చిత్రం చూడటానికి ఓటీటీ యాప్ డౌన్ లోడ్ అవసరం లేదు. పైన ఉన్న వెబ్ సైట్ ఓపెన్ చేసి టిక్కెట్ బుక్ చేసుకోవచ్చు. మలయాళంలో ఇంతగా పబ్లిసిటీ చేసిన లెస్బియన్ సినిమా లేదు. ఈ సినిమా కోసం ఎంతో మంది యువకులు ఎదురు చూశారు. సినిమా చూశాక వాళ్లు ఎదురు చూసిన దానికి మించి ఉందంటూ చెప్పడం విశేషం. ఈ చిత్రాన్ని 18 ఏళ్ల లోపు పిల్లలు చూడకూడదు. ఇంకా ఈ సినిమాపై కొంత మంది రాజకీయం చేస్తున్నారు కానీ.. అలాంటి కాంట్రవర్సీ చిత్రమిది కాదు`` అని తెలిపారు. చదవండి: నేను పెళ్లి చేసుకునే సమయానికే ఆమెకు ఒక బాబు: బ్రహ్మాజీ బిగ్బాస్ బ్యూటీకి లైంగిక వేధింపులు.. ఆవేదనతో పోస్ట్ థియేటర్లలో 4 చిత్రాలు, ఓటీటీలో ఎన్నో.. -
Holy Wound Movie OTT Release Date: ఓటీటీలోకి లెస్బియన్ చిత్రం `హోలీ వుండ్`
‘బిగ్బాస్’ ఫేమ్ జానకి సుంద అమృతా వినోద్, సాబు ప్రౌదిక్ ప్రధాన పాత్రల్లో అశోక్ ఆరాన్ తెరకెక్కించిన చిత్రం.`హోలీవుండ్`. సహస్ర సినిమాస్ ప్రై. లి సమర్పణలో సందీప్ ఆర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. లెస్బియన్ నేపథ్యంలో రూపొందిన ఈ మలయాళ చిత్రం ఓటీటీ విడుదల తేది ఖరారైంది. ఆగస్ట్ 12 నుంచి ఎస్ ఎస్ ఫ్రేమ్స్(SS Frames) ఓటీటీలో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. (చదవండి: ‘థ్యాంక్యూ’ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడు.. ఎక్కడ?) ఈ సందర్భంగా నిర్మాత సందీప్ ఆర్ మాట్లాడుతూ.. `చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన ఇద్దరు అమ్మాయిలు..కొంత కాలంగా కలిసి ఉండటంతో ఇద్దరి మధ్య లైంగిక సంబంధం ఏర్పడుతంది. సృష్టికి విరుద్దంగా వారు లైంగిక సంతృప్తి చెందుతుంటారు. ఈ నేపథ్యంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అన్నది సినిమా. డీప్ ప్రేమలో ఉన్న ఇద్దరు ఆడవాళ్లు, ఇద్దరు మగవాళ్లు శృంగారంలో పాల్గొనడం తప్పు కాదు అనే అంశాన్ని మా సినిమాలో చూపిస్తున్నాం. మా సినిమా ఎన్నో వివాదాల్లో చిక్కుకొని ..వాటన్నింటినీ దాటుకొని ఈ నెల 12న ఎస్ ఎస్ ఫ్రేమ్స్ ఓటీటీ ద్వారా రిలీజ్ చేస్తున్నాం. మాటలు లేని ఈ సైలెన్స్ లెస్బియన్ సినిమా మీ అందర్నీ ఆకట్టుకుంటుందని నమ్ముతున్నాం’ అన్నారు.