బాలయ్య నటించిన లేటేస్ట్ మూవీ డాకు మహారాజ్. సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదలైన ఈ మూవీకి తొలి రోజు నుంచే పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఈనెల 12న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. బాబీ కొల్లి డైరెక్షన్‌లో తెరకెక్కించిన ఈ మాస్ ఎంటర్‌టైనర్‌ను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు.
అయితే ఈ సినిమాలో బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా కీలక పాత్రలో కనిపించింది. అంతేకాకుండా దబిడి దిబిడి అంటూ సాగే ఐటమ్ సాంగ్‌లో బాలయ్య సరసన మెప్పించింది. ఈ పాట విడుదలైన కొద్ది గంటల్లోనే రికార్డ్ స్థాయి వ్యూస్‌తో దూసుకెళ్లింది.
సాంగ్‌పై విమర్శలు..
డాకు మహారాజ్‌లోని దబిడి దిబిడి సాంగ్‌పై పెద్ద ఎత్తున విమర్శలొచ్చాయి. ఊర్వశి రౌతేలాతో అలాంటి స్టెప్పులు ఏంటని పలువురు నెటిజన్స్ ప్రశ్నించారు. ఈ పాట కొరియోగ్రఫీ అత్యంత చెత్తగా ఉందంటూ మండిపడ్డారు. యంగ్ హీరోయిన్‌తో బాలయ్య అలాంటి స్టెప్పులు వేయడమేంటని సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేశారు.
పట్టించుకోని ఊర్వశి రౌతేలా..
అయితే సోషల్ మీడియాలో ఎన్ని విమర్శలు వస్తున్నా పిచ్చ లైట్ అంటోంది బాలీవుడ్ భామ. తాజాగ ఇన్‌స్టా వేదికగా మరో వీడియోను పోస్ట్ చేసింది. డాకు మహారాజ్ సక్సెస్ పార్టీలో బాలయ్యతో కలిసి దబిడి దిబిడి సాంగ్‌కు స్టెప్పులు వేస్తూ కనిపించింది. దీంతో సోషల్ మీడియాలో మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ ఊర్వశి రౌతేలాపై క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
ఊర్వశి రౌతేలా తన ఇన్‌స్టాలో రాస్తూ..' డాకు మహారాజ్ సక్సెస్ బాష్. దబిడి దిబిడి సాంగ్ 20 మిలియన్ల వ్యూస్ సాధించినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్. ఈ న్యూయర్‌లో గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ అభిమానులకు తమన్ ఇచ్చిన గిఫ్ట్ ఇదే' అంటూ పోస్ట్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment