బాలకృష్ణ మాస్ యాక్షన్ సినిమా 'డాకు మహారాజ్' ట్రైలర్ వచ్చేసింది. 'చెడ్డ వాళ్లకు మాత్రమే డాకు.. మంచివాళ్లకు మాత్రం మహారాజ్' అంటూ వచ్చే డైలాగ్స్ చాలా పవర్‌ఫుల్‌గా ఉన్నాయి. బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. ఇందులో శ్రద్ధా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్‌తో పాటు బాబీ డియోల్, చాందిని చౌదరి తదితరులు నటించారు.
ఇప్పటికే విడుదలైన సాంగ్స్ , టీజర్‌పై భారీగా ప్రశంసలు వచ్చాయి. ముఖ్యంగా తమన్ అందించిన బీజీఎమ్ మరో రేంజ్‌లో ఉందంటూ కామెంట్లు వచ్చాయి. ఇప్పుడు విడుదలైన మాస్ ట్రైలర్‌తో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి.
'డాకు మహారాజ్' టికెట్ ధరలు
జనవరి 12న విడుదల కానున్న మూవీకి బెనిఫిట్ షోలతో పాటు టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతిచ్చింది. 12వ తేదీ ఉదయం 4 గంటల ప్రత్యేక షో కోసం అనుమతితో పాటు ఒక్కో టికెట్ రూ.500కు విక్రయించేందుకు అనుమతిచ్చింది. రోజుకు ఐదు షోలతో పాటు ప్రస్తుతం ఉన్న టికెట్ ధరలపై అదనంగా మల్టీప్లెక్స్‌లో రూ.135, సింగిల్ థియేటర్స్‌లలో రూ.110 వరకు పెంచుకోవచ్చని చెప్పింది. జనవరి 26 వరకు ఈ ధరలు ఉంటాయి.
ఈ సారి డాకు మహారాజ్ సినిమాపై అమెరికాలో మంచి రెస్పాన్స్ వచ్చింది. అమెరికాలో ఇప్పటికే టికెట్స్ ప్రీ సేల్ ప్రారంభం అయింది. ఇప్పటి వరకు రికార్డ్ స్థాయిలో 10 వేలకు పైగా టికెట్లు అమ్ముడుపోయాయి. అమెరికాలోని 125 లోకేషన్స్‌లలో 350 షోలు ఫస్ట్ డే పడనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment