సాక్షి, హైదరాబాద్: ‘సర్పంచ్‌లూ అర్థం చేసుకోండి. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ.1,100 కోట్ల నిధులు ఆపేశారు. అందుకే ఆర్థికంగా కొంత ఇబ్బందులు ఏర్పడ్డాయి. రైతు కల్లాలకు రూ.150 కోట్లు ఖర్చు చేయడాన్ని తప్పుగా భావించి, ఆ డబ్బులు ఆపేశారు. ఈ విషయమై సర్పంచ్‌లకు అధికారులు అవగాహన కలి్పంచాలి’అని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. కేంద్రం కావాలనే నిధులు విడుదల చేయకపోవడం వల్ల ఆర్థికంగా ఇబ్బందులు ఏర్పడ్డాయని పేర్కొన్నారు.
ఈ విధంగా నిధులు ఆపడం సరికాదని విమర్శించారు. ఈ విషయాన్ని అధికారులు, సర్పంచులు అర్థం చేసుకోవాలని చెప్పారు. కొంతమంది సర్పంచులు బీజేపీ మాయలోపడి ప్రభుత్వంపై దు్రష్పచారం చేస్తున్నారన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక ఆయా గ్రామాలకు అందిన నిధుల వివరాలతో ప్రతీ పంచాయతీలో బోర్డులు ఏర్పాటు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. శనివారం మంత్రి అన్ని జిల్లాల సూపరింటెండెంట్ ఇంజనీర్లతో తొలుత సమావేశమై, ఆ తర్వాత జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, జిల్లా పంచాయతీ ఆఫీసర్లు, మండల పంచాయతీ ఆఫీసర్లు, ఇతర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గానికి రూ.5 కోట్లతో రోడ్ల నిర్మాణ ప్రతిపాదనల జాబితాలు అందజేయాలని ఆదేశించారు. వర్షాకాలంలో మొదటి వర్షం పడేటప్పటికీ ఏ ఒక్క రోడ్డు మీద గుంత కనిపించవద్దని, దెబ్బతిన్న రోడ్లన్నీ బాగు చేయాలని సూచించారు. అధికారులు, సిబ్బంది బాగా పనిచేయడం వల్ల పంచాయతీరాజ్ శాఖకు మంచి పేరు వచ్చిందని, జాతీయస్థాయిలో అనేక అవార్డులు వచ్చాయని.. ఇదే స్పూర్తిని ఇకముందు కూడా కొనసాగించాలని కోరారు. కొత్తగా నిర్మిస్తున్న గ్రామపంచాయతీ కార్యాలయాల పనులను వేగంగా చేయాలని సూచించారు.
చదవండి: ‘అన్‌మ్యాన్డ్’.. సబ్‌స్టేషన్లు!.. టీఎస్‌ఎస్పీడీసీఎల్ ‘హైటెక్’ బాట
Comments
Please login to add a commentAdd a comment