dayakar rao
-
మన పాలకులకు ప్రేమ, భక్తి ఉన్నాయి
సాక్షి ప్రతినిధి,వరంగల్: ఆధ్యాత్మిక భావనతో మనసులో ఎటువంటి కల్మషం లేకుండా, మానవీయ కోణంలో ఏ కార్యక్రమం తలపెట్టినా సత్ఫలితాలు వస్తాయని త్రిదండి చిన జీయర్‌స్వామిజీ అన్నారు. కొత్త ఆలయాలు నిర్మించడం సహజమని, కానీ పురాతన ఆలయానికి పునరుజ్జీవం పో యడం గొప్ప విషయమని, కోట్లాది రూపాయలు ఖర్చు చేసి వల్మిడిలో రామాలయం నిర్మించడం మరింత అభినందనీయమని పేర్కొన్నారు. రాష్ట్రంలో పాలకులకు ప్రేమ, భక్తి రెండూ కలసి ఉండడంతో మనం అన్ని రంగాల్లో ముందుకు వెళుతున్నామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఇలాగే పచ్చగా కొనసాగాలని ఆకాంక్షించారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలం వల్మిడి గ్రామంలో సోమవారం జరిగిన శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ పునఃప్రారంభం, విగ్రహాల ప్రతిష్ఠాపన కార్యక్రమంలో చినజీయర్ పాల్గొని సందేశం ఇచ్చారు. మనుషుల్లో అంతర్లీనమైన ప్రేమ, సహోదర భా వం పెంపొందించడంతో పాటు మానసిక ధైర్యాన్ని ఇచ్చేందుకు ప్రతిచోట ఆలయాలు అవసరమని ఆయన తెలిపారు. వాల్మికితో సంబంధం ఉన్న అతి ప్రాచీనమైన వల్మిడి రామాలయాన్ని దివ్య క్షేత్రంగా వెలుగొందేలా మంత్రి దయాకర్‌రావు చేసిన కృషి అభినందనీయమన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రికి దీటుగా వల్మిడి ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు చెప్పారు. ముందుగా వేదమంత్రోచ్ఛరణల నడుమ సీతారాముల విగ్రహాన్ని జీయర్ స్వామి ప్రతిష్టించారు. అనంతరం ఆలయంలోని ఇతర విగ్రహాలను, ఆలయ గోపురంపై కలశాన్ని ప్రతిష్టించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, సత్యవతి రాథోడ్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, అధికారులు, అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. కాగా పాలకుర్తి మండల కేంద్రంలోని సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో మంత్రులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సోమ నాథుడి స్మృతి వనం, కల్యాణ మండపం, హరిత హోటల్, గిరిజన భవన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. -
సర్పంచ్‌లూ అర్థం చేసుకోండి!.. కేంద్రం రూ.1,100 కోట్ల నిధులు ఆపేసింది
సాక్షి, హైదరాబాద్: ‘సర్పంచ్‌లూ అర్థం చేసుకోండి. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ.1,100 కోట్ల నిధులు ఆపేశారు. అందుకే ఆర్థికంగా కొంత ఇబ్బందులు ఏర్పడ్డాయి. రైతు కల్లాలకు రూ.150 కోట్లు ఖర్చు చేయడాన్ని తప్పుగా భావించి, ఆ డబ్బులు ఆపేశారు. ఈ విషయమై సర్పంచ్‌లకు అధికారులు అవగాహన కలి్పంచాలి’అని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. కేంద్రం కావాలనే నిధులు విడుదల చేయకపోవడం వల్ల ఆర్థికంగా ఇబ్బందులు ఏర్పడ్డాయని పేర్కొన్నారు. ఈ విధంగా నిధులు ఆపడం సరికాదని విమర్శించారు. ఈ విషయాన్ని అధికారులు, సర్పంచులు అర్థం చేసుకోవాలని చెప్పారు. కొంతమంది సర్పంచులు బీజేపీ మాయలోపడి ప్రభుత్వంపై దు్రష్పచారం చేస్తున్నారన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక ఆయా గ్రామాలకు అందిన నిధుల వివరాలతో ప్రతీ పంచాయతీలో బోర్డులు ఏర్పాటు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. శనివారం మంత్రి అన్ని జిల్లాల సూపరింటెండెంట్ ఇంజనీర్లతో తొలుత సమావేశమై, ఆ తర్వాత జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, జిల్లా పంచాయతీ ఆఫీసర్లు, మండల పంచాయతీ ఆఫీసర్లు, ఇతర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గానికి రూ.5 కోట్లతో రోడ్ల నిర్మాణ ప్రతిపాదనల జాబితాలు అందజేయాలని ఆదేశించారు. వర్షాకాలంలో మొదటి వర్షం పడేటప్పటికీ ఏ ఒక్క రోడ్డు మీద గుంత కనిపించవద్దని, దెబ్బతిన్న రోడ్లన్నీ బాగు చేయాలని సూచించారు. అధికారులు, సిబ్బంది బాగా పనిచేయడం వల్ల పంచాయతీరాజ్ శాఖకు మంచి పేరు వచ్చిందని, జాతీయస్థాయిలో అనేక అవార్డులు వచ్చాయని.. ఇదే స్పూర్తిని ఇకముందు కూడా కొనసాగించాలని కోరారు. కొత్తగా నిర్మిస్తున్న గ్రామపంచాయతీ కార్యాలయాల పనులను వేగంగా చేయాలని సూచించారు. చదవండి: ‘అన్మ్యాన్డ్’.. సబ్స్టేషన్లు!.. టీఎస్ఎస్పీడీసీఎల్ ‘హైటెక్’ బాట -
గ్రామీణాభివృద్ధికి ప్రవాసులు కలిసి రావాలి - మంత్రి కిషన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: గ్రామీణాభివృద్ధికి రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో వెనుకబడిన గ్రామాలను గుర్తించి అక్కడి ప్రజలకు మౌలిక వసతులను కల్పించేందుకు ప్రవాస తెలంగాణ వాసులు ముందుకు రావాలని కోరారు. తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం (టీడీఎఫ్) ఆధ్వర్యంలో ఆదివారం రవీంద్రభారతిలో ఆరవ తెలంగాణ ప్రవాసి దివస్ (2021) ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కిషన్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా అభివృద్ధి కొనసాగిస్తామని టీడీఎఫ్ చెప్పిందని, ఈ మేరకు తెలంగాణలో ఉపాధి అవకాశాల కల్పనకు చొరవ తీసుకోవాలని కోరారు. దేశంలో తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ అద్భుతంగా పనిచేస్తోందని చెప్పారు. 130 కోట్ల మందికి పైగా వ్యాక్సిన్ వేశామని, ఇతర దేశాలకు కూడా త్వరలోనే టీకాలు అందజేస్తామని తెలిపారు. ఇదే సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. ‘90 శాతం తెలంగాణ బిడ్డలతో పాటు వివిధ పార్టీల్లో ఉన్న వారు కూడా రాష్ట్రం కోసం పోరాటం చేశారు. ఎన్నారైలు రాష్ట్రంలోని గ్రామాలను అభివృద్ధి చేయాలి. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిపై ప్రధానంగా దృష్టిసారించాలి, పేద విద్యార్థులను ఆదుకుని వారిని చదివించాలి..’ అని కోరారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. రాజకీయాలకు అతీతంగా టీడీఎఫ్ పనిచేయాలని కోరారు. తెలంగాణ టూరిజం అభివృద్ధిలోనూ ఎన్నారైలు భాగస్వామ్యం కావాలని కోరారు. తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి, ప్రొఫెసర్ కోదండరాం తదితరులు మాట్లాడారు. -
వరంగల్‌లో వరద బాధితులను పరామర్శించిన కేటీఆర్
-
వరంగల్‌లో వరద బాధితులను పరామర్శించిన కేటీఆర్
సాక్షి, వరంగల్: మంత్రి కేటీఆర్ మంగళవారం నగరంలో వరదలకు గురయిన ప్రాంతాలలో పర్యటించారు. మొదట హన్మకొండకు చేరుకున్న కేటీఆర్ నయిం నగర్ నాలను మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఈటెల రాజేందర్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతులతో కలసి పరిశీలించారు. తదుపరి సమ్మయ్య నగర్ ప్రాంతాన్ని పరిశీలించిన మంత్రి కేటీఆర్ బాధితులలో ధైర్యాన్ని నింపారు. నాలా సమస్యకు శాశ్వత పరిష్కారం చేస్తామని భరోసానిచ్చారు. డ్రైనేజీ నిర్మాణానికి రూ. 10కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇంట్లో నీళ్లు నిలిచిపోయిన బాధిత కుటుంబాలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా అక్రమాలకు గురైన నాలను తొలగిస్తామని, ఆ సమయంలో ప్రజలు సహకరించాలని కేటీఆర్ కోరారు. ఇలాంటి ప్రమాదకర పరిస్థితులలో ప్రాణ నష్టం జరగకపోవడం సంతోషించదగ్గ విషయమన్నారు. మంత్రి దయాకర్‌రావు, చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ బస్సు నుంచే ఇదులవాగులోని నీటి ప్రవాహాన్ని కేటీఆర్‌కు వివరించారు. అనంతరం 100 ఫీట్స్ పెద్దమ్మ గడ్డ ఆర్ ఆర్ ఫంక్షన్ హాలు వద్ద ఉన్న భద్రకాళి వాగు బ్రిడ్జి ప్రాంతంలో నిర్మించిన అక్రమ నిర్మాణాలతో పాటు చెట్లను కూడ తొలగించాలని కేటీఆర్ ఆదేశించారు. ఇలాంటివి యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలని అవసరమైన ఏర్పాట్ల కోసం ప్రిన్సిపాల్ సెక్రెటరీ ఆదేశాలు తీసుకోవాలని సూచించారు. నగరంలో పర్యటించి మొత్తం ముళ్ళ పొదలు తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మునిసిపాలిటీ శాఖ డైరెక్టర్‌కు మంత్రి కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఎమ్జీఎమ్ కోవిడ్ వార్డులోకి వెళ్లి కేటీఆర్ కరోనా బాధితులను పరామర్మించారు. అదనంగా 150 పడకల ను ఏర్పాటు చేస్తామని మంత్రి హామీనిచ్చారు. అవసరమైన ఆక్సిజన్ వెంటి లెటర్లను ఏర్పాటు చేస్తామన్నారు. ప్రత్యేక కోవిడ్ ఆసుపత్రిగా కేఎంసీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని త్వరలో ప్రారంభిస్తామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. చదవండి: ఇంకా వరద బురదలోనే వరంగల్లు -
కేటీఆర్‌తో సనోఫి బృందం భేటీ..
సాక్షి, హైదరాబాద్: నూతన పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు ఇక్కడే కార్యకలాపాలు నిర్వహిస్తున్న సనోఫి వంటి కంపెనీలకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్ అంతర్జాతీయ వ్యాక్సిన్ క్యాపిటల్‌గా రూపాంతరం చెందిందని, ఇక్కడ వ్యాక్సిన్ తయారీ, సంబంధిత రంగా ల్లో అభివృద్ధికి అనేక అవకాశాలు ఉన్నాయని వివరించారు. హైదరాబాద్‌లో ఉన్న ఫార్మా, లైఫ్ సైన్సెస్ ఈకో సిస్టమ్‌లను మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుం టున్న చర్యలను మంత్రి వివరించారు. ఇక్కడ అందుబాటులో ఉన్న సాంకేతికత, అద్భుత మైన మానవ వనరుల నేపథ్యంలో డిజిటల్ డ్రగ్ డిస్కవరీ వంటి వినూత్న రంగాల్లో అనేక అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. గురువారం ప్రగతిభవన్‌లో ప్రముఖ ఫార్మా కంపెనీ సనోఫి అంతర్జాతీయ భాగస్వామ్యాల అధిపతి (హెడ్ ఆఫ్ ఇంటర్నేషనల్ సైట్స్, పార్టనర్షిప్స్) ఫాబ్రయ్స్ జెఫ్రాయ్, భారత్, దక్షిణాసియా జనరల్ మేనేజర్ అన్నపూర్ణ దాస్‌లు మంత్రితో సమావేశమయ్యారు. వీరితో పాటు శాంతా బయోటెక్ చైర్మన్ వరప్రసాద్‌రెడ్డి కూడా ఉన్నారు. 2021 సంవత్సరాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంవత్సరంగా ప్రకటించి వివిధ కార్యక్రమాలు చేపడుతోందని, ఇప్పటికే అనేక ఫార్మా కంపెనీలు తమతో భాగస్వాములు అయ్యేందుకు సుముఖత వ్యక్తం చేశాయన్నారు. భవిష్యత్తులో సనోఫి కార్యకలాపాలకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు. తెలంగాణలో సనోఫి కార్యకలాపాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ప్రభుత్వ పారిశ్రామిక విధానాలపై సనోఫి సానుకూలత వ్యక్తం చేసింది. సమావేశంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, ప్రశాంత్‌రెడ్డి, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ పాల్గొన్నారు. -
భారత ప్రజాస్వామ్యం అత్యుత్తమమైనది
సాక్షి, హైదరాబాద్: ప్రపంచంలోని అన్ని దేశాల కంటే కూడా భారత్‌లోని ప్రజాస్వామ్యం, ఎన్నికల వ్యవస్థ అత్యుత్తమమైనవని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రశంసించారు. ఎన్నికల రాజకీయాల్లో కొంత మేరకు అర్థ బలం, అంగబలం, దొంగ ఓట్లు వంటి సమస్యలున్నా వాటిని పరిష్కరిస్తూ ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛగా నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. రెండున్నర లక్షల మంది ఎన్నికల సిబ్బంది, 30 వేల మంది వరకు భద్రతా సిబ్బందికి పారదర్శకంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించేలా రాష్ట్ర ఎన్నికల కమిషన్ శిక్షణనివ్వడం.. రాష్ట్రంలో ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛగా నిర్వహించడం గొప్ప విషయమని పేర్కొన్నారు. ఇందుకు కారణమైన ఎస్ఈసీని, కమిషనర్ వి.నాగిరెడ్డిని గవర్నర్ అభినందించారు. శనివారం తారామతి బారాదరిలో రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో గవర్నర్ మాట్లాడుతూ.. అసెంబ్లీ, లోక్‌సభ, ఇతర ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాల ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్‌లో పాల్గొనడం గొప్ప విషయమన్నారు. పట్టణ ప్రాంతాల్లోని వారు, చదువుకున్న వారు సైతం పెద్దసంఖ్యలో ఓటింగ్‌లో పాల్గొనేలా చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. గతేడాది పంచాయతీ, పరిషత్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి వివిధ అంశాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులు, సిబ్బంది, ఓటరు చైతన్యం కనబరిచిన వారికి ఎస్ఈసీ ఏర్పాటుచేసిన మొదటి ‘తెలంగాణ రాష్ట్ర ప్రజాస్వామ్య పురస్కారాల’ను గవర్నర్ ప్రదానం చేశారు. కష్టపడితే ఫలితం వస్తుంది: ఎర్రబెల్లి కష్టపడి, అంకితభావంతో పనిచేస్తే అవార్డులు వస్తాయని చెప్పడానికి తమ శాఖకు చెందిన అనేక మందికి ప్రజాస్వామ్య పురస్కారాలు రావడమే నిదర్శనమని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఎన్నికల కమిషన్ విధి నిర్వహణ చాలెంజ్‌తో కూడుకున్నదని రాజకీయ పార్టీలు, పోటీలో ఉన్న అభ్యర్థులు విమర్శలు చేస్తూ ఉంటారని, వీటన్నింటినీ ఎదుర్కొని సజావుగా ఎన్నికలు నిర్వహించడం గొప్పవిషయమని కొనియాడారు. కమిషనర్ నాగిరెడ్డి మాట్లాడుతూ.. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో 65 నుంచి 70% వరకు పోలింగ్ నమోదైతే, స్థానిక సంస్థల ఎన్నికల్లో 90% ఓటింగ్ జరగ డం స్ఫూర్తిదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో సీఎస్ సోమేశ్‌కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి, స్టాండింగ్ కమిటీస్ ఆఫ్ ఎస్ఈసీస్ చైర్మన్, పీఆర్ శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్, బిహార్ ఎస్ఈసీ ఏకే చౌహాన్, స్టాండింగ్ కమిటీస్ ఆఫ్ ఎస్ఈసీస్ కన్వీనర్, ఢిల్లీ, చండీగఢ్ ఎస్ఈసీ ఎస్కే శ్రీవాస్తవ, పలు రాష్ట్రాల ఎస్ఈసీలు పాల్గొన్నారు. పురస్కారాలు పొందిన వారిలో మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎంవీ రెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్ తదితరులు ఉన్నారు. -
ప్రతిపక్షాల వలలో ఆర్టీసీ నేతలు
సాక్షి, హైదరాబాద్:ఆర్టీసీ యూనియన్ నాయకులు ప్రతిపక్షాల వలలో పడ్డారని, సంస్థను నాశనం చేసేందుకు బీజేపీ, కాంగ్రెస్ కంకణం కట్టుకున్నాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఆదివారం టీఆర్ఎస్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ప్రతిపక్షాల తీరుపై నిప్పులు చెరిగారు. ‘పండగ సమయంలో యూనియన్లు సమ్మెకు పిలుపునిచ్చి ప్రజలను ఇబ్బంది పెట్టాయి. ఆర్టీ సీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని మా మేని ఫెస్టోలో ఎక్కడా చెప్పలేదు. యూనియన్ నేత లు ప్రతిపక్షాల వలలో పడ్డారు. ఇదో రాజకీయ కుట్రగా అనిపిస్తోంది. గతంలో ఆర్టీసీ కార్మికు లకు, వారు కూడా ఊహించనంతగా 44 శాతం ఫిట్మెంట్ ఇచ్చాం. బీజేపీ, కాంగ్రెస్ నేతల కుట్రలను ఆర్టీసీ కార్మి కులు అర్ధం చేసుకోవాలి. సంస్థకి గత ఐదేళ్లలో రూ. 3,303 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. సమైక్య రాష్ట్రంలో కేటాయించింది రూ. 1,600 కోట్లే. ఆర్టీసీని ప్రైవేటీకరిస్తామని కేసీఆర్ ఎక్కడా చెప్పలేదు. ఎన్నో రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ అక్కడ ఆర్టీసీని ప్రభుత్వంలో ఎందుకు విలీనం చేయడంలేదు? దమ్ముంటే బీజేపీ నేతలు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ప్రధానితో ప్రకటన ఇప్పించగలరా? ఆర్టీసీ కార్మికులకు నచ్చ చెప్పాల్సింది పోయి బీజేపీ నేతలు రెచ్చగొడుతున్నారు. ఆర్టీ సీని నాశనం చేయాలన్న కాంగ్రెస్, బీజేపీ నేతల ప్రయత్నాలను సఫలం కానివ్వం’ అని ఎర్రబెల్లి స్పష్టం చేశారు. -
ఏడాదికి లక్ష ఉద్యోగాల కల్పనే లక్ష్యం
సాక్షి, పరకాల: ఏటా ప్రైవేట్ రంగంలో లక్ష ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన మేరకు మెగా జాబ్‌మేళాలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో పరకాలలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో బుధవారం మెగా జాబ్‌మేళా నిర్వహించారు. పరకాల నియోజకవర్గ పరిధిలోని ఆరు మండలాల నుంచి వేలాది మంది నిరుద్యోగులు ఈ మేళాకు తరలివచ్చారు. జాబ్ మేళాకు ముఖ్య అతిథిగా మంత్రి దయాకర్‌రావు హాజరుకాగా, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి, డీఆర్డీఓ సంపత్‌రావు, ఏపీడీ పరమేశ్వర్, వీహబ్ చైర్మన్ శకుంతల పాల్గొన్నారు. ఈ మేళాను మంత్రి దయాకర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. కష్టపడే తత్వం ఎక్కువ గ్రామీణ యువతకు కష్టపడే తత్వం ఎక్కువగా ఉంటుందని మంత్రి దయాకర్‌రావు అన్నారు. ఈ మేరకు నిరుద్యోగులందరూ ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా అర్హత తగిన రంగంలో స్థిరపడాలని సూచించారు. అలాంటి వారి కోసం నియోజకవర్గ కేంద్రాల్లోనే జాబ్‌మేళాలు నిర్వహిస్తున్నామన్నారు. పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి మాట్లాడుతూ నేటి యువత సెల్‌ఫోన్ మోజులో పడి విలువైన సమయం, జీవితాన్ని నాశనం చేసుకోవద్దని హితవు పలికారు. జెడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి మాట్లాడుతూ జాబ్‌మేళాను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పరకాల ఆర్డీఓ ఎల్.కిషన్, ఇన్చార్జి ఏసీపీ సునీతా మోహన్, ఎంపీపీలు టి.స్వర్ణలత, జెడ్పీటీసీ సభ్యులు సిలువేరు మొగిలి, కోడెపాక సుమలత, సుదర్శన్‌రెడ్డితో పాటు బొల్లె భిక్షపతి, బొచ్చు వినయ్ తదితరులు పాల్గొన్నారు. 1,632 మందికి ఉద్యోగనియామక పత్రాలు పరకాలలో నిర్వహించిన జాబ్‌మేళాకు 4,761 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 1,632 మందిని ఉద్యోగాలకు ఎంపిక చేయగా మరో 873 మందిని శిక్షణకు ఎంపిక చేసినట్లు డీఆర్డీఏ అధికారులు తెలిపారు. కాగా, జాబ్‌మేళాకు నిరుద్యోగ యువతీ, యువకులతు వారి కుటుంబ సభ్యులతో హాజరుకావడంతో కళాశాల ప్రాంగణం కిక్కిరిసిపోయింది. 55 కంపెనీల బాధ్యలు హాజరై నిరుద్యోగులను అర్హత తగిన ఉద్యోగాలకు ఎంపిక చేశారు. -
ప్రజల గుండెల్లో టీఆర్ఎస్, కేసీఆర్!
సాక్షి ప్రతినిధి, వరంగల్: అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ప్రజలకు చేరువైన టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ నాయకత్వంపై మరోసారి ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలు తమ సంపూర్ణ విశ్వాసాన్ని ప్రకటించారని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. కాంగ్రెస్, విపక్షాలు ఎన్ని తప్పుడు ఆరోపణలు చేసినా... ఉమ్మడి వరంగల్ జిల్లాలో టీఆర్ఎస్ ప్రభంజనం కొనసాగిందని, ప్రజలంతా టీఆర్ఎస్ వెంటే ఉన్నారనడానికి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలతో మరోసారి రుజువైందని తెలిపారు. హన్మకొండలోని తన నివాసంలో మంగళవారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. పరిషత్ ఎన్నికల పలితాల్లో కారు స్పీడును ఏ పార్టీ అందుకోలేకపోయిందని.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వచ్చిన ఈ ఫలితాలు చరిత్రలో రికార్డుగా నమోదు కానున్నాయని మంత్రి దయాకర్‌రావు పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ పాలనపై నమ్మకంతో రాష్ట్ర ప్రజలంతా టీఆర్ఎస్ వెంటే ఉన్నారని అన్నారు. వరుస విజయాలను అందిస్తున్న రాష్ట్ర ప్రజలు, ఉమ్మడి వరంగల్ జిల్లా ఓటర్లు, ఈ విజయ పరంపరలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికీ మంత్రి కతజ్ఞతలు తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నూతనంగా ఏర్పడిన ఆరు జిల్లాల్లో మొత్తం 70 జెడ్పీటీసీ స్థానాలకు గాను 62 టీఆర్ఎస్ గెలువడం సామాన్యమైన విషయం కాదన్నారు. ఆరు జిల్లాల్లోని 70 మండలాల్లో 781 ఎంపీటీసీలకు గాను 541 ఎంపీటీసీలను టిఆర్ఎస్ కైవసం చేసుకోగా.. మరో 50 మందికి పైగా టీఆర్ఎస్ అభిమానులే గెలిచారని వెల్లడించారు. తద్వారా ఆరు జిల్లా పరిషత్‌లతో పాటు 60కి పైగా మండల పరిషత్‌లపై గులాబీ జెండా ఎగురవేయబోతున్నామని మంత్రి దయాకర్‌రావు పేర్కొన్నారు. ప్రజలు అందించిన ఈ విజయాలతో తమ బాధ్యత ఇంకా పెరిగిందని, రాష్ట్రాన్ని అభివృద్ది చేయడమే లక్ష్యంగా ఆ పనిలో నిమగ్నమవుతామని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఇటీవల కొన్ని సీట్లు రావడంతో సంబర పడుతున్నాయని.. జాతీయ పార్టీల వల్ల కొంత అయోమయం నెలకొన్నా పరిషత్ ఎన్నికల్లో ఆ పార్టీలు కనుమరుగయ్యాయని అన్నారు. కాగా, ఉమ్మడి జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయంతో గులాబీ శ్రేణులు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో కలసి మిఠాయిలు పంచి, టపాసులు కాల్చి సంబురాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి.. జెడ్పీటీసీ, ఎంపీటీసీలను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సమావేశంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్, చైర్మన్లు మర్రి యాదవరెడ్డి, నాగుర్ల వెంకటేశ్వర్, సాంబారి సమ్మారావు పాల్గొన్నారు. -
మెజార్టీలో ‘రోల్ మోడల్’ గా నిలవాలి
సాక్షి, నెక్కొండ: మహబూబాబాద్ లోక్‌సభ నియోజకవర్గ అభివృద్ధిని కాంక్షించే ప్రతీ ఒక్కరు ఈ ఎన్నికలో మెజార్టీలోనూ ‘రోల్ మోడల్’ గా నిలవాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి మాలోతు కవిత ప్రచారంలో భాగంగా నెక్కొండ మండల కేంద్రంలో మంగళవారం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికలకంటే పది రెట్లు ఎక్కువ మెజార్టీ సాధించే దిశగా కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు. రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం ఉండడంతో చేయి చాచి ఆశించే దుర్భర స్థితిలో ఉండగా.. ఎలా అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ప్రాంతీయ పార్టీలు జత కట్టనున్నాయని.. ఇక, జాతీయ పార్టీలకు చుక్కెదురు కాక తప్పదని పేర్కొన్నారు. సొంత మండలంలాంటి నెక్కొండను దత్తత తీసుకుంటానని, ఇందుకు మండలంలో 70 శాతం ఓట్లు కారు గుర్తుకే పడాలని మంత్రి షరతు పెట్టారు. ఇందుకు ప్రజల నుంచి స్పందన రావడంతో మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. కేంద్రంలో కేసీఆర్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అన్ని విధాలుగా కలిసొస్తే కేసీఆర్ ప్రధానమంత్రిగా ఉండొచ్చని జోస్యం చెప్పారు. రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్న ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించినా పట్టించుకోలేదన్నారు. సమావేశంలో నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, ఎంపీపీ గటిక అజయ్‌కుమార్, జడ్పీ కో–ఆప్షన్ సభ్యులు అబ్దుల్నబీ, నుస్రత్తస్వీర్, వైస్ ఎంపీపీ సారంగపాణి, పార్టీ మండల అధ్యక్షుడు సోమయ్య, నెక్కొండ సొసైటీ చైర్మన్ రవీందర్‌రెడ్డి, నాయకులు కొమ్ము రమేష్, చల్లా శ్రీపాల్‌రెడ్డి, సురేష్, హరికిషన్, శివకుమార్, బాలాజీనాయక్ పాల్గొన్నారు. -
ప్రజల ఆశీస్సులతోనే మంత్రినయ్యా..
సాక్షి, జనగామ: ‘ఎర్రబెల్లి దయాకర్‌రావు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని.. భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని.. తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని.. భయంగానీ, పక్షపాతంగానీ, రాగద్వేషాలు గానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నా. ఎర్రబెల్లి దయాకర్‌రావు అనే నేను తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్నీ నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించడానికి తప్ప ఏ విషయాన్నీ ప్రత్యక్షం గానీ, పరోక్షం గానీ వ్యక్తులకు గానీ సంస్థలకు తెలియపర్చనని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నా’ అంటూ రాష్ట్ర మంత్రిగా ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రమాణ స్వీకారం చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్ ఎర్రబెల్లి చేత మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. 36 ఏళ్ల రాజకీయ జీవితంలో తొలిసారిగా మంత్రిగా నియమితులైన దయాకర్‌రావు తన కుటుంబసభ్యుల సమేతంగా తరలివెళ్లి ప్రమాణ స్వీకారం చేశారు. యాదాద్రిలో పూజలు.. తల్లిదండ్రుల స్మరణ.. రాష్ట్ర మంత్రిగా నియమితులైన ఎర్రబెల్లి దయాకర్‌రావు తమ ఇలవేల్పు అయిన యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో మంగళవారం ఉదయం ప్రత్యేక పూజలు చేశారు. కుటుంబసమేతంగా లక్ష్మీనర్సింహస్వామికి పూజలు చేసి నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్లారు. అక్కడ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. వరుస క్రమంలో ఆరోమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని తన నివాసానికి వెళ్లి తన తల్లిదండ్రులైన ఆదిలక్ష్మి, జగన్నాథరావు చిత్రపటాలకు పూలమాలు వేసి స్మరించుకున్నారు. పంచాయతీరాజ్ శాఖ కేటాయింపు.. ఎర్రబెల్లి దయాకర్‌రావుకు కీలకమైన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్డబ్ల్యూఎస్ శాఖలను కేటాయించారు. 2018లో కొత్తగా పంచాయతీ రాజ్ చట్టం అమలులోకి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి అధిక ప్రాధాన్యత ఇస్తోంది. గ్రామాల అభివృద్ధిని కీలకంగా భావిస్తున్న శాఖను గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన దయాకర్‌రావుకు కేటాయించడం విశేషం. శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎర్రబెల్లి దయాకర్‌రావుకు వరంగల్ ఉమ్మడి జిల్లా కు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు శుభాకాంక్షలు తెలిపారు. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యా దగిరిరెడ్డి, స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ, పరకాల, డోర్నకల్, మహబూబాబాద్ ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్, దాస్యం వినయ్‌భాస్కర్, చల్లా ధర్మారెడ్డి, డీఎస్ రెడ్యానాయక్, శంకర్నా యక్తోపాటు ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, బోడకుంటి వెంకటేశ్వర్లు శుభాకాంక్షలు తెలిపారు. జనగామ జిల్లాతోపాటు వరంగల్,భూపాలపల్లి, వ రంగల్ రూరల్,ములుగు,మహబూబాబాద్ జిల్లాలకు చెందిన టీఆర్ఎస్ నేతలు, పలువురు ప్రజా ప్రతినిధులు అభినందలు తెలిపారు. సుదీర్ఘ అనుభవం ఆయన సొంతం.. వరంగల్ ఉమ్మడి జిల్లాలో సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఎర్రబెల్లి దయాకర్‌రావు సొంతం. జిల్లాలో మాస్ ఫాలోయింగ్ కలిగిన నాయకుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. పర్వతగిరిలో ఓ సాధారణ రేషన్ లీడర్ నుంచి ప్రారంభమైన ఆయన జీవితం రాజకీయాల్లోకి రావడంతో ఒక్కసారిగా మారిపోయింది. ఒకవైపు తనకు రాజకీయ జన్మనిచ్చిన టీడీపీలో పలు పదవులను చేపడుతూ మ రోవైపు ప్రజాప్రతినిధిగా వరుస ఎన్నికల్లో విజయఢంకా మోగిస్తూ రాష్ట్రస్థాయి వరకు ఎదిగిన తీరు అమోఘం. విద్యార్థిదశ నుంచే నాయకత్వ లక్షణాలను కలిగిన దయాకర్‌రావు సామాన్య కార్యకర్త నుంచి రాష్ట్ర మంత్రి వరకు తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించారు. 1982లో ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీలో చేరారు. 1994లో జరిగిన సాధారణ ఎన్నికల్లో వర్ధన్నపేట నియోజకవర్గం నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తరువాత 1999లో రెండోసారి, 2004లో మూడో సారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1999లో నాటి చంద్రబాబు ప్రభుత్వంలో ప్రభుత్వ విప్‌గా పనిచేశారు. 2008లో వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో ఎంపీగా గెలుపొం దారు. 2009, 2014, 2018 ఎన్నికల్లో పాలకుర్తి నుంచి గెలుపొందారు. వరుసగా ఆరు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. పాలకుర్తి: నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతోనే మంత్రిని అయ్యానని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఆయన మంత్రిగా హైదరాబాద్‌లో మంగళవారం బాధ్యతలు స్వీకరించగా.. నియోజకవర్గం నుంచి తరలివచ్చిన టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. బాణాసంచా కాల్చడంతోపాటు నృత్యాలు చేశారు. దయాకర్‌రావుకు రాజ్యసభ సభ్యులు బండా ప్రకాష్, మాజీ ఎమ్మెల్యే సుధాకర్‌రావు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్ధేశించి ఎర్రబెల్లి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ తనపై నమ్మకంతో మంత్రి పదవిని అప్పగించారని, దానిని వమ్ము చేయకుండా బాధ్యతగా వ్యవహరించి పదవికి వన్నె తెస్తానని చెప్పారు. మూడు దశాబ్దాల కార్యకర్తల కల నేడు నెరవేరిందని, ఊరూరికి దేవాదుల ద్వారా గోదావరి జలాలు తెచ్చి చెరువులను నింపుతామని అన్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే ధ్యేయమని, కరువు ప్రాంతమైన పాలకుర్తి నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేయడానికి కార్యచరణ రూపొందిస్తానని తెలిపారు. ప్రజల కోరిక మేరకు త్వరలో అన్ని మండలాలు పర్యటించనున్నట్లు పేర్కొన్నారు. -
కోర్టుల్లో పోరాడతాం
ప్రస్తుత ఎన్నికల్లో ఈవీఎంలలో జరిగిన మోసాలు, ఎన్నికల అధికారుల తీరుపై పార్లమెంట్ సమావేశాల్లో లేవనెత్తుతామని దాసోజు శ్రవణ్, అద్దంకి దయాకర్ తెలిపారు. జాయింట్ పార్లమెంటరీ కమిటీ ద్వారా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరుతామన్నారు. రిట ర్నింగ్ అధికారులు, పోలీసులు కుమ్మక్కయ్యి పోలింగ్ ఏజెంట్లను కూడా సెంటర్లలోకి రానివ్వకుండా టీఆర్ఎస్కు సహకరించారన్నారు. ఎన్నికల సంఘం, టీఆర్ఎస్ కుమ్మక్కై ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఆరోపించారు. ‘బ్రింగ్ బ్యాక్ పేపర్ బ్యాలెట్’ఉద్యమం హైదరాబాద్ నుంచి ప్రారంభిస్తామన్నారు. దీనిపై హైకోర్టు, సుప్రీంకోర్టుల్లోనూ పోరాడతామన్నారు. -
అప్రమత్తంగా ఉండాలి
ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు కడవెండి (దేవరుప్పుల) : వరద బాధితులకు సాయం అందించడంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు సూచించారు. భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న మండలంలోని కడవెండి, మాధాపురం, దేవరుప్పుల, పెద్దమడూరు, సీతారాంపురం గ్రామాలను శనివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వర్షాలతో కలిగే అనర్థాలను ఎదుర్కొనేందుకు ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉండాలన్నారు. వర్షాలతో ప్రమాదం పొంచి ఉన్న చెరువులు, కుంటలను ముందే గుర్తించి నివారణ చర్యలు తీసుకోవాలన్నారు. మండలంలో వర్షాలతో జరిగిన నష్టాన్ని పారదర్శకంగా పరిశీలించి నివేదిక తయారు చేయాలని ఆదేశించారు. కోడూరు చెరువుకు గండి కోడూర్ (రఘునాథపల్లి) : భారీ వర్షాలతో మండలంలోని కోడూరు పెద్ద చెరువుకు శనివారం గండి పడింది. రెండు రోజుల క్రితం చెరువు క ట్టకు బుంగ పడగా.. ఇరిగేష¯ŒS అధికారులు, కాంట్రాక్టర్ ఇటాచీతో దా నిని పూడ్చినా ఫలితం లేకుండా పోయింది. చెరువు కింద కోడూరుతో పాటు రామన్నగూడెంకు చెందిన 212 ఎకరాల ఆయకట్టు ఉంది. చెరువును పునరుద్ధరించేందుకు మిష¯ŒS కాకతీయ –2లో ప్రభుత్వం రూ. 60.90 లక్షలు మంజూరు చేసింది. కాగా, కాంట్రాక్టర్, అధికారులు పనులను నిర్లక్ష్యం చేయడంతో చెరువుకు ప్రమాదం ఏర్పడింది. ఈ క్రమం లో తెల్లవారుజామున చెరువుకు గండి పడి నీరంతా వృథాగా పోతోంది. మిష¯ŒS కాకతీయలో ప్రభుత్వం లక్షలు మంజూరు చేసినా కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో తాము తీవ్రంగా నష్టపోయామని ఆయకట్టు రైతులు ఆరోపిస్తున్నారు. అధికారులు స్పందించి గండిని పూడ్చి నీటి వృథాను అరికట్టాలని కోరారు. ఈ విషయమై డీఈ యశ్వంత్‌ను వివరణ కోరగా.. కోడూరు చెరువుకు గండి పడిన విషయాన్ని ఎస్ఈ దృష్టికి తీసుకెళ్లామన్నారు. నీటి వృథాను అరికట్టేందుకు రింగ్ బండ్ వేస్తామన్నారు. మత్తడి పరవళ్లు గోవిందరావుపేట : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో మండలంలోని లక్నవరం సరస్సు, గుండ్లవాగు ప్రాజెక్టులు మత్తళ్లు పోస్తూ జలకళను సంతరించుకున్నాయి. జులై నెలాఖరులో నిండిన సరస్సులు.. తర్వాత ఖరీఫ్ కోసం సాగునీటి విడుదల చేయడంతో తగ్గాయి. మూడు రోజుల క్రితం వరకు లక్నవరం సరస్సులో 30 అడుగుల 9 అం గుళాల నీరు ఉండగా.. ప్రస్తుతం 34 అడుగులకు చేరి మత్తడి పడుతోంది. దీంతో దయ్యాలవాగు, గుండ్లవాగులు ఉధృతంగా ప్రహహిస్తున్నాయి. ఇప్పటికే ముత్తాపురం, మొట్లగూడెం, ఇప్పలగడ్డ వాసులకు వాగులతో ఇబ్బందులు ఎదురవుతుండగా..మరోసారి వర్షం పడిందంటే వారు బయటికి రాలేని పరిస్థితి ఏర్పడుతోంది. వరదకు తెగిన వల్మిడి–ముత్తారం రోడ్డు పాలకుర్తి : మండలంలో నాలుగు రోజుల నుంచి కుండపోతగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఈ మేరకు శనివారం ఉదయం వరద ఉధృతికి మండలం లోని వల్మిడి– ముత్తారం గ్రామాల మధ్య ఉన్న బీటి రోడ్డు సగం వరకు తెగిపోయింది. దీంతో రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. కాగా, అయ్యంగారిపల్లి గ్రామంలోని మొండి కుంటకు కూడా గండి పడింది. ఉప్పుగల్లులో ఉబికి వస్తున్న నీరు జఫర్‌గఢ్ : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో భూగర్భజలాలు బాగా పెరిగి నీరు ఉరకలెత్తుతోంది. మండలంలోని ఉప్పుగల్లుకు చెందిన నల్లబోయిన రమేష్ అనే రైతు గత వేసవిలో తన చేనులో 100 ఫీట్ల లోతుతో బోరు వేయించాడు. అయితే అప్పుడు బోరులోంచి నీరు రాకపోవడంతో మరో చోట వేయించాడు. కాగా, ముందుగా వేయించిన బోరులో నుంచి ఏకధాటిగా నీరు ఉబికి వస్తుండడంతో రమేష్ సంతోష పడుతున్నాడు. ఇదిలా ఉండగా, ఈ ప్రాంతానికి చెందిన కొందరు రైతులు గతంలో 250 ఫీట్ల లోతుతో బోర్లు వేయించుకున్నా చుక్క నీరు రాకపోవడం గమనార్హం. మొలకెత్తిన మక్కలు సంగెం : భారీ వర్షాలతో మండలంలో వివిధ రకాల పంటలు దెబ్బతింటున్నాయి. ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలతో చేతికి వచ్చిన మొక్కజొన్న, పత్తి, పెసర, నువ్వు పంటలు పాడైపోతున్నాయి. కోసిన మక్కలను ఆరబెట్టుకుంటున్న సమయంలో వానలు పడుతుండడంతో మొలకెత్తుతున్నాయి. దీంతో వేలాది రూపాయలు పెట్టుబడి పంటలను సాగు చేసిన రైతులు నష్టాల్లో కూరుకుపోతున్నారు. -
పీవీ అల్లుడు కన్నుమూత
హైదరాబాద్: మాజీ ప్రధాని, దివంగత పీవీ నరసింహారావు అల్లుడు దయాకర్‌రావు(70) శుక్రవారం సాయంత్రం కన్నుమూశారు. కొన్ని రోజులుగా అస్వస్థత తో ఉన్న ఆయన జూబ్లీహిల్స్ రోడ్‌నంబర్ 33లోని నివాసంలో మృతిచెందారు. ఆయన సతీమణి వాణీదేవి పీవీ మూడో కూతురు. దయాకర్‌రావు సురభి ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్‌గా ఉన్నారు. ఆయన అంత్యక్రియలు ఆదివారం మహాప్రస్థానం శ్మశాన వాటికలో జరుగుతాయని కుటుంబసభ్యులు తెలిపారు. -
శిలలు
కథ - ఎమ్వీ రామిరెడ్డి కర్నూలు పట్టణం దాటాక, ఓ ప్రైవేటు పాఠశాల. పది ఎకరాల విస్తీర్ణంలో స్వస్తిక్ ఆకారంలో భవన సముదాయం. ఎడమవైపు తరగతి గదులు, కుడివైపు బాలబాలికలకు ప్రత్యేక వసతిగృహాలు. ఆడుకోవడానికి విశాలమైన మైదానమూ ఈతకొలనులూ. జాతీయ రహదారి నుంచి పావు కిలోమీటరు లోపలికి ప్రయాణిస్తే, పాఠశాల ప్రధాన ద్వారం వస్తుంది. అక్కడ సెక్యూరిటీ గార్డుల్ని దాటుకుని, లోపలికి వెళ్తే, మరో పెద్దగేటు. తల్లిదండ్రులు వచ్చినా సరే, పిల్లలు ఆ గేటు దాటి, ఇవతలికి రావడానికి వీల్లేదు. గేటుకు అవతల రెండు శిలావిగ్రహాలు... సాయంత్రపు నీరెండ పడి మెరుస్తున్నాయి. గేటు వైపు దొర్లిన బంతిని తీసుకోవడానికి వచ్చిన అయిదో తరగతి కుర్రాడు ఆ విగ్రహాలను చూసి ఆశ్చర్యపోయాడు. నిజానికి రెండు నిమిషాల ముందువరకూ అక్కడ ఎలాంటి విగ్రహాలూ లేవు. స్కూలు పరిసరాలన్నీ ఆ పిల్లాడికి కొట్టిన పిండి. హఠాత్తుగా అప్పటికప్పుడు, అక్కడ ఆ విగ్రహాలు ఎలా ప్రత్యక్షమయ్యాయో అర్థం కాక, అయోమయంగా చూశాడు. చేత్తో తాకి చూశాడు. నునుపైన రాతిస్పర్శ! బంతిని అక్కడే విసిరేసి, ‘‘ఒరే శ్రీకాంతూ, అశ్వినూ, భాస్వంతూ, నీరజా, వినీతా...’’ అంటూ ఆటస్థలం వైపు పరిగెత్తాడు. ఆ వార్త పెద్దపిల్లల చెవిన కూడా పడింది. బిలబిలమంటూ గేటు దగ్గరకు చేరుకున్నారు. అర్జెంటుగా వెళ్లి టీచర్లకు, వార్డెన్లకు చెప్పారు. ‘‘ఇదేంటండీ, ఇంత వింతగా ఉంది. అసలీ విగ్రహాలిక్కడికి ఎలా వచ్చాయి’’ వార్డెన్ వంక వింతగా చూస్తూ అడిగాడు ఇంగ్లిషు మాస్టారు. ఆయనకు యాభైపైనే ఉంటాయి. పెళ్లి చేసుకోలేదు. పిల్లలతో పాటు హాస్టల్లోనే ఉంటాడు. ‘‘అదే అర్థం కావటం లేదండీ’’ తల గోక్కుంటూ చెప్పాడు వార్డెన్. రూముల్లోనే ఉండిపోయిన ట్యూషన్ టీచర్లు, సూపర్వైజర్లు, ఆయాలు, కుక్‌లు, సెక్యూరిటీగార్డులు, అటెండర్లు... స్కూలుకు సంబంధించిన యావత్ సిబ్బందీ ఉరుకులు పరుగుల మీద అక్కడికి చేరుకున్నారు. ‘‘జాగ్రత్తగా చూడండి మాస్టారు... ఈ పెద్ద విగ్రహంలో రాముడి పోలికలు కనిపించడం లేదూ’’ ఒకరి అనుమానం. ‘‘అబ్బెబ్బే, ససేమిరా కాదు. పెద్ద విగ్రహం స్త్రీ పోలికతో ఉంది. చిన్నది పురుషుడ్ని పోలి ఉంది’’ మరొకరి ప్రకటన. ‘‘అయితే, మన స్కూల్లో దేవతలు వెలిశారంటారా?’’ ఇంకొకరి సందేహం. ‘‘ఊరుకోండి సార్. ఇవి దేవతల విగ్రహాలు కానేకాదు’’ ఒక వార్డెన్ ధ్రువీకరణ. ‘‘స్కూలుకి ఏదో కీడు జరగబోతోంది. దానికిది సంకేతం’’ ఓ సూపర్వైజర్ భవిష్యవాణి. ‘‘పోలీసులకు ఫోన్ చేస్తే?’’ ఓ ట్యూషన్ టీచర్. ‘‘సమయానికి ప్రిన్సిపల్ గారు కూడా లేరు...’’ ‘‘ప్చ్... ఏమిటోనండీ, నాలుగు నెలల నుంచీ స్కూలు స్కూల్లా లేదు. రకరకాల సంఘటనలు జరుగుతున్నాయి...’’ దిగులుగా అన్నాడు ఇంగ్లిషు మాస్టారు. కర్నూలులో దయాకర్‌రావు పేరు ప్రఖ్యాతులున్న డాక్టర్. లాభాపేక్ష లేకుండా వైద్యసేవలందించేవారు. తల్లిదండ్రుల నుండి విలువైన ఆస్తులు సంక్రమించడంతో ఆయన ఏనాడూ డబ్బుకోసం తాపత్రయపడలేదు. ఆయనకు ఇద్దరు కొడుకులు. ఇద్దరూ అమెరికాలో మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. నెలనెలా తండ్రికి డబ్బు పంపేవారు. ఆ డబ్బును జాగ్రత్తగా దాచిపెట్టి, కొంత మొత్తం అయ్యాక పట్టణ శివార్లలో పదెకరాల పొలం కొన్నారు దయాకర్‌రావు. అది ఖాళీగా ఉండడం ఎందుకుని, బ్యాంకులోను తీసుకుని, భవనాలు కట్టారు. మంచి పాఠశాల నడపాలనే తన చిరకాల కోరికను ఆ భవనాల సాక్షిగా నిజం చేసుకున్నారు. అతి తక్కువ ఫీజులతో, సకల సదుపాయాల వసతి గృహాలతో ప్రారంభించారు. ఆదర్శ భావాలున్న ప్రిన్సిపల్‌ను, మంచి జీతాలతో నిపుణులైన ఉపాధ్యాయులను నియమించారు. ఫలితంగా ఆ స్కూలు రెండు సంవత్సరాల్లోనే మంచి పేరు సంపాదించుకుంది. నాలుగేళ్లు తిరక్కుండానే రెండువేల మంది పిల్లలకు అక్షరాలయంగా మారింది. దయాకర్‌రావు ప్రతిరోజూ సాయంత్రం స్కూలుకు వచ్చేవారు. పిల్లలతో కలిసిపోయేవారు. సరదాగా పాఠాలు చెప్పేవారు. స్కూలు ఒంటిగంటకే అయిపోయేది. భోజనానంతరం పిల్లలందరూ ల్యాబ్‌లకు చేరుకునేవారు. డ్రాయింగ్, కార్పెంటరీ, టాయ్మేకింగ్... ఎవరికి ఆసక్తి ఉన్న అంశం మీద వారు పనిచేసేవారు. కథలు, కవితలు, వ్యాసరచన, ఉపన్యాసం, మిమిక్రీ, పప్పెట్రీ... పిల్లల మనసుల్ని వికసింపజేసే ఇలాంటి అంశాల్లో ప్రతివారం పోటీలు పెట్టి, ఆకర్షణీయమైన బహుమతులిచ్చి, పిల్లల మనసులు దోచుకునేవారు. సాయంత్రం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఏదో ఒక ఆట ఆడి తీరాల్సిందే. జోనల్, జిల్లా, రాష్ట్రస్థాయుల్లో జరిగే పోటీల్లో ఆ స్కూలు విద్యార్థులు బహుమతుల్ని కొల్లగొట్టేవారు. ఆడుతూ పాడుతూ చదివినా, పదో తరగతి పరీక్షల్లో ఆ స్కూలు నుంచి కనీసం ఇద్దరైనా మొదటి పది ర్యాంకుల్లోపు నిలిచేవారు. హాస్టల్లో ఉంటున్న విద్యార్థుల్ని చూడ్డానికి తల్లిదండ్రులు ఎప్పుడైనా రావచ్చు. గత సంవత్సరం దయాకర్‌రావు భార్య మరణించడంతో ఆయన ఒంటరి అయ్యారు. ఆయన ఆరోగ్యం దెబ్బతింది. కొడుకులిద్దరూ అమెరికా నుంచి వచ్చి, యుద్ధప్రాతిపదికన స్కూలును నష్టానికి అమ్మేసి, తండ్రిని తమతోపాటు అమెరికా తీసుకెళ్ళారు. కొత్త యాజమాన్యానికి వ్యాపారమే ప్రథమ ప్రాణం. స్కూలు తమ ఆధీనంలోకి రావడమే ఆలస్యం, వ్యవస్థను మార్చేశారు. కొత్త ప్రిన్సిపల్‌ను నియమించారు. చాలామంది టీచర్లను మార్చారు. అనేక కొత్త నిబంధనలను అమల్లో పెట్టారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిషేధించారు. పిల్లలు ప్రతిరోజూ ఆడుకోవడానికి వీల్లేదు. పిల్లల్ని చూడాలనుకునే తల్లిదండ్రులు నెలలో మూడో ఆదివారం మాత్రమే రావాలి. అది కూడా మూడుగంటల పాటు మాత్రమే వారితో గడిపి, వెళ్లిపోవాలి. చదువు....చదువు... చదువు.... చదువుకోవడం మాత్రమే చేయాలి. సిబ్బంది బెత్తాలు పట్టుకోవడం అలవాటు చేసుకున్నారు. పిల్లల మీద పెత్తనం చేయడం ప్రాక్టీస్ చేశారు. సిబ్బంది గాడిలో పడ్డారుగానీ, పిల్లలు మాత్రం ఆ వాతావరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. వారం వారం తల్లిదండ్రుల ఒడిలో సేదదీరే అలవాటున్న పిల్లలు, మూడు వారాలు గడిచేసరికి కన్నవారి కోసం అల్లాడిపోతున్నారు. నాలుగో వారంలో జరిగిందా సంఘటన. సుస్మిత నాలుగో తరగతి చదువుతోంది. అమ్మ మీద మొదలైన బెంగ, అలా అలా మర్రిచెట్టులా పెరిగిపోయి, ఊడలు దిగింది. అమ్మను చూడకుండా, అరక్షణం కూడా ఉండలేని స్థితికి చేరుకుంది. సాయంత్రం హాస్టలు గదికి వచ్చి, దిగులుగా మంచం మీద పడుకుంది. ఆయా వచ్చి, ఏమైందని అడిగింది. ‘‘ఆయా, నాకు అమ్మను చూడాలని ఉంది. ఏడుపొస్తంది. ప్లీజ్ ఆయా, మా నాన్నకు ఫోన్ చేసి, వచ్చి తీసుకెళ్లమని చెప్పవా’’ దీనంగా అడిగిందా పాప. ‘‘లేదమ్మా, అలా ఒప్పుకోరు. ఇంకెంత, ఒక్కవారం ఓపిక బట్టు. వచ్చే ఆదివారం మీ అమ్మానాన్నలు వస్తారుగా’’ ఓదార్చడానికి ప్రయత్నించింది. ‘‘నో నో, నాకిప్పుడే మమ్మీ కావాలి’’ మారాం చేసింది. ఇంతలో ఆ ఫ్లోర్ సూపర్వైజర్ వచ్చాడు, విజిల్ ఊదుకుంటూ. ‘‘ఏం తమాషానా? ఒక్కర్ని పంపిస్తే, అందరూ అడుగుతారు...’’ సుస్మితను రెక్క పట్టుకుని లేపి కూర్చోబెట్టి, ‘‘కమాన్, ఫ్రెష్షప్ అయి, ట్యూషన్‌కు వెళ్లు’’ అంటూ గర్జించాడు. పాప ఏడ్చింది. అతను వెళ్లిపోయాడు, హుకుం జారీచేసి. బెడ్ల వద్ద ముగ్గురమ్మాయిలు మాత్రమే ఉన్నారు. మిగతావారంతా ట్యూషన్‌కు వెళ్లిపోయారు. తళుక్కున సుస్మిత చిన్నిబుర్రలో ఏదో మెరిసింది. బుక్‌షెల్ఫ్ ఓపెన్ చేసి, ఓ వస్తువును చేతిలోకి తీసుకుంది. ఒక్క నిమిషం తర్వాత ‘అమ్మా’ అంటూ పెద్దగా కేక పెట్టింది. ఆ కేక విని మిగతా ముగ్గురూ పరుగెత్తుకొచ్చారు. ఎడమచేతి మణికట్టు నుంచి రక్తం కారుతోంది. ఓ పాప గబగబా పరుగెత్తుతూ ఫ్లోర్ సూపర్వైజర్ దగ్గరకెళ్ళి, ‘‘సార్, సార్, సుస్మిత బ్లేడుతో చెయ్యి కోసుకుంది’’ చెప్పింది వగరుస్తూ. అతను హడావుడిగా ఆ గదికి చేరుకుని, తన కర్చీఫ్ తీసి, సుస్మిత చేతికి చుట్టాడు. ఆ తర్వాత సిక్రూముకు తీసుకెళ్లాడు. విషయం ప్రిన్సిపల్ దాకా చేరింది. ఆయనే స్వయంగా సుస్మిత తండ్రికి ఫోన్‌చేసి, వెంటనే రమ్మని చెప్పాడు. మహబూబ్‌నగర్‌లో ఉంటున్న సుస్మిత తల్లిదండ్రులు మూడుగంటలలోపే స్కూలు చేరుకున్నారు. తల్లిదండ్రుల్ని చూడగానే, సుస్మిత మొహం విప్పారింది. చేతిగాయం మర్చిపోయింది. పరుగు పరుగున వెళ్లి, తల్లి ఒడిలో దూరిపోయింది. ప్రిన్సిపల్ అనుమతితో సుస్మితను ఇంటికి తీసుకెళ్లారు తల్లిదండ్రులు. మరుసటి నెలలో మరో సంఘటన. ఆరో తరగతి చదువుతున్న ఆశిష్‌కు నాయనమ్మంటే ప్రాణం. ప్రతివారం తల్లిదండ్రుల వెంట ఆమె కూడా వచ్చి మనవణ్ని చూసుకుని మురిసిపోయేది. ఒళ్లో కూర్చోబెట్టుకుని కథలు చెప్పేది. బోల్డన్ని ముద్దులు పెట్టేది. గత నెల మూడో ఆదివారం తల్లిదండ్రులు వచ్చారుగానీ, అనారోగ్యం కారణంగా నాయనమ్మ రాలేదు. పది రోజుల్నుంచీ ప్రతిరాత్రీ ఆమె కలలో కనిపిస్తుంటే, వెంటనే చూడాలన్న తపన పెరిగిపోతోంది. ఆశిష్‌కు చదువు మీద గురి కుదరడం లేదు. మనసంతా మహా దిగులు. ‘ఎలాగైనా ఇంటికెళ్లాలి. నాయనమ్మను చూడాలి’. సుస్మిత మెదిలింది అతని మనసులో. ఇంకా పెద్ద సాహసం చేయాలి. సాయంత్రం అయిదు గంటల వేళ... మూడో అంతస్తు పైనుంచి కిందికి దూకేశాడు. అతని అరుపు ఆ మైదానంలో ప్రతిధ్వనించింది. పిల్లలూ సిబ్బందీ ఆఘమేఘాల మీద అక్కడికి చేరుకున్నారు. ఆశిష్ కాలు విరిగింది. పక్కటెముకలు దెబ్బ తిన్నాయి. నాలుగు రోజులు ఆస్పత్రిలోనే ఉండాలని చెప్పారు. అమ్మానాన్నలు వచ్చారు. నాయనమ్మ వచ్చింది. ఆమెతోపాటే ఆశిష్ కళ్లల్లో వెలుగు వచ్చింది. ఇంత సీరియస్ కాకపోయినా, మరుసటి నెలలోనూ రెండుమూడు చెదురుమదురు సంఘటనలు. ఇప్పుడీ విగ్రహాల ప్రహసనం! రాత్రి ఏడున్నర దాటింది. పిల్లలూ పెద్దలూ ఎవ్వరూ కదలడం లేదు, ఆ విగ్రహాల దగ్గర్నుంచి. చివరికి ఇంగ్లిషు మాస్టారు సాహసం చేసి, ప్రిన్సిపల్‌కు ఫోన్ చేశారు. ‘‘వ్వాట్? ఏమిటి మీరనేది?’’ ఫోన్లోనే రంకెలేశాడు ప్రిన్సిపల్. ‘‘నిజం సార్. మాకంతా అయోమయంగా ఉంది. మీరు వస్తే కాస్తంత ధైర్యంగా ఉంటుందని...’’ ‘‘ఓకే, ఐ విల్ బీ దేర్ వితిన్ టెన్ మినిట్స్’’ ఫోన్ పెట్టేశాడు. మాటమీద నిలబడుతూ, పది నిమిషాల్లోపే స్కూలు గేటులో అడుగుపెట్టాడు ప్రిన్సిపల్. ‘ముందుగా ఎవరు చూశారు? ఎలా జరిగింది? ఎందుకిలా జరిగింది?’ అంటూ రకరకాల ప్రశ్నలతో పావుగంటే సేపు సమీక్ష జరిపాడు. ఆ విగ్రహాలకు అతి సమీపంలోనే, అటెండరు తెచ్చి వేసిన కుర్చీలో కూర్చుని, కళ్లు మూసుకుని, దీర్ఘంగా ఆలోచించాడు ప్రిన్సిపల్. ‘‘అవును, పిల్లల్లో ఎవరైనా మిస్ అయినట్లుందా?’’ ప్రశ్నించాడు, కళ్లు తెరవకుండానే. ‘‘గమనించలేదు సార్’’ రెండువేల మంది పిల్లల్లో, ఒకరిద్దరు మిస్ అయినా, పసిగట్టడం అంత సులభం కాదు. ‘‘పిల్లలందరినీ క్లాసువారీగా సమావేశపర్చి, హాజరు తీసుకోండి’’ పది నిమిషాల తర్వాత ఇంగ్లిషు మాస్టారు కాస్తంత కంగారుగా, చాలా హడావుడిగా వచ్చాడు. ‘‘సార్ సార్, సెవెన్త్ క్లాస్‌లో చందన, ఫిఫ్త్‌లో కిరణ్ కనిపించడం లేదు’’ చెప్పాడు కళ్లజోడు సవరించుకుంటూ. ‘‘అదీ... ముడి వీడింది’’ తేలిగ్గా నవ్వుతూ అనేశాడు ప్రిన్సిపల్. ‘‘ఏమిటి సార్, ఏం జరిగింది?’’ మరింత అయోమయంగా అడిగాడు ఇంగ్లిషు మాస్టారు. ‘‘మాయమైన వాళ్లిద్దరూ అక్కాతమ్ముళ్లు కదూ’’ ‘‘అవును సార్’’ ప్రిన్సిపల్ ఎవరికో ఫోన్ చేశాడు, ‘‘ఆ శ్రీనివాస్‌గారూ, ఎక్కడిదాకా వచ్చారు’’ ఫోన్ మాట్లాడాక- ‘‘సరిగ్గా పది నిమిషాల తర్వాత ఈ విగ్రహాలు మాయమవుతాయి’’ అని చిద్విలాసంగా ప్రకటించాడు. చుట్టూ చేరినవారు మరింత అయోమయంగా చూశారు. చందన, కిరణ్ తండ్రి శ్రీనివాస్ మధ్యాహ్నం ప్రిన్సిపల్‌కు ఫోన్ చేశాడు. తన తండ్రి మరణించారనీ, ఒక్కరోజు పిల్లల్ని ఇంటికి తీసుకెళ్లడానికి అనుమతించాలనీ అభ్యర్థించాడు. సరేనన్నాడు ప్రిన్సిపల్. చందన, కిరణ్‌లను తన ఛాంబర్‌కు పిలిపించుకుని, ‘‘మీ అమ్మానాన్నలు వస్తున్నారు. ఇంటికెళ్లి, మళ్లీ ఎల్లుండి ఉదయానికంతా ఇక్కడుండాలి’’ అని చెప్పాడు. సాయంత్రం స్కూలు వదలగానే ప్రిన్సిపల్ ఇంటికెళ్లిపోయాడు. చందన, కిరణ్‌లు గేటుదాకా వచ్చి, తల్లిదండ్రుల కోసం ఎదురు చూడసాగారు. ముళ్ల మీద నుంచున్నారు. అసహనంగా కదిలారు. కళ్లు విప్పార్చి చూశారు. సమయం భారంగా గడుస్తోంది. ట్రాఫిక్‌జామ్‌లో చిక్కుకున్న తల్లిదండ్రులు రావడం ఆలస్యం కావడంతో... వాళ్లలా ఎదురు చూసీచూసీ... ‘‘అదిగో కారొస్తంది...’’ పిల్లల్లో ఎవరో అరిచారు. అందరూ అలర్టయ్యారు. సెక్యూరిటీ దాటుకుని, మెయిన్‌గేటు దాకా వచ్చి, ఆగిన కారులోంచి శ్రీనివాస్, ఆయన భార్య దిగారు. మెల్లగా నడుస్తూ, మెయిన్‌గేటు దాటారో లేదో... విగ్రహాల్లో చిన్న కదలిక. చూస్తుండగానే శిలలు కరిగిపోయాయి. వాటికి ప్రాణం వచ్చింది. చందన, కిరణ్ ప్రత్యక్షమై, తల్లిదండ్రులకు ఎదురుగా పరుగెత్తుకెళ్లారు. అప్పట్నుంచీ అడపాదడపా క్యాంపస్‌లో విగ్రహాలు ప్రత్యక్షమవుతూనే ఉన్నా, ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. -
బాబు కోసమే నిరాహారదీక్షలు
సాక్షి, సంగారెడ్డి: టీడీపీ నేతలు రేవంత్‌రెడ్డి, దయాకర్‌రావు తదితరులు పిచ్చికూతలు కూయడం మానుకోవాలని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి హెచ్చరించారు. ఆదివారం సంగారెడ్డిలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు ఎన్టీఆర్ పేరు పెట్టడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. చంద్రబాబు మెప్పుకోసమే టీడీపీ నేతలు నిరాహారదీక్షలు చేస్తున్నారని విమర్శించారు. వారికి ధైర్యం ఉంటే తెలంగాణను ఇబ్బందులు పెడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విజయవాడ, గుంటూరులో దీక్షలు చేపట్టాలని డిమాండ్ చేశారు. చంద్రబాబుకు దీటుగా ప్రభుత్వం నడుపుతున్న సీఎం కేసీఆర్‌ను చూసి ఓర్వలేకనే టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. సోమవారం నుంచి ప్రారంభంకానున్న శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణ సమస్యలను లేవనెత్తుతామని ఎంపీ ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా, విభజన చట్టంలో పేర్కొన్న అంశాల అమలు, కొత్తపల్లి-మనోహరాబాద్ రైల్వేలైన్, మెదక్-అక్కన్నపేట రైల్వేలైన్ తదితర అంశాలను లేవనెత్తుతామన్నారు. టీడీపీని పాతరవేయటం ఖాయం పక్క రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడుతున్న టీడీపీ ఎమ్మెల్యేలను చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని ఆ పార్టీకి ప్రజలు పాతర వేయడం ఖాయమని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పేర్కొన్నారు. చంద్రబాబు మెప్పుకోసం టీడీపీ ఎమ్మెల్యేలు తెలంగాణ ప్రయోజ నాలు దెబ్బతినేలా వ్యవహరిస్తున్నారన్నారు. చంద్రబాబుకు రాజకీయ బిక్షపెట్టిన ఇందిరాగాంధీ కుమారుడు రాజీవ్ గాంధీ పేరు ఎయిర్‌పోర్టుకు పెడితే తప్పేమిటన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నేపథ్యంలో ఎన్టీఆర్ పేరుపెట్టడం సరికాదన్నారు. ఆంధ్ర పాలకులు తమ ప్రాంతంలోని ఎయిర్‌పోర్టులకు తెలంగాణ త్యాగధనుల పేర్లు పెట్టగలరా అని ప్రశ్నించారు. -
పయ్యావుల కేశవ్‌పై ఎర్రబెల్లి ఫిర్యాదు
తెలుగుదేశం పార్టీలోని ఇరు ప్రాంతాల నేతల మధ్య విభేదాలు మరోసారి బట్టబయలయ్యాయి. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా కోర్టుకెళ్లిన నాయకుడు పయ్యావుల కేశవ్‌పై తెలంగాణ ప్రాంతానికి చెందిన సీనియర్ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావు చంద్రబాబు నాయుడికి ఫిర్యాదు చేశారు. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుతో టీడీపీ ముఖ్యనేతలు శనివారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా.. పయ్యావుల కేశవ్ పార్టీ విధానాలకు వ్యతిరేకంగా పని చేస్తున్నారని ఎర్రబెల్లి ఫిర్యాదు చేశారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే, దీనిపై చంద్రబాబు ఎలా స్పందించారన్న విషయం మాత్రం తెలియరాలేదు.