పయ్యావుల కేశవ్పై ఎర్రబెల్లి ఫిర్యాదు | rift between tdp leaders, dayakar rao complains on keshav | Sakshi
Sakshi News home page

పయ్యావుల కేశవ్పై ఎర్రబెల్లి ఫిర్యాదు

Published Sat, Nov 2 2013 1:29 PM | Last Updated on Fri, Aug 10 2018 7:58 PM

తెలుగుదేశం పార్టీలోని ఇరు ప్రాంతాల నేతల మధ్య విభేదాలు మరోసారి బట్టబయలయ్యాయి.

తెలుగుదేశం పార్టీలోని ఇరు ప్రాంతాల నేతల మధ్య విభేదాలు మరోసారి బట్టబయలయ్యాయి. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా కోర్టుకెళ్లిన నాయకుడు పయ్యావుల కేశవ్పై తెలంగాణ ప్రాంతానికి చెందిన సీనియర్ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావు చంద్రబాబు నాయుడికి ఫిర్యాదు చేశారు.

పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుతో టీడీపీ ముఖ్యనేతలు శనివారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా.. పయ్యావుల కేశవ్ పార్టీ విధానాలకు వ్యతిరేకంగా పని చేస్తున్నారని ఎర్రబెల్లి ఫిర్యాదు చేశారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే, దీనిపై చంద్రబాబు ఎలా స్పందించారన్న విషయం మాత్రం తెలియరాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement