సాక్షి, నిజామాబాద్:
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఎవరూ అడ్డుకోలేరని టీఆర్‌ఎస్ శాసనసభా పక్ష ఉపనేత టి.హరీష్‌రావు స్పష్టం చేశారు. సమైక్యాంధ్ర ఉద్యమం చేస్తున్న సీమాంధ్ర ఉద్యోగులకు మద్దతు తెలుపుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు తెలంగాణ విషయంలో అసలు తన వైఖరేంటో ప్రకటించాలని డిమాండ్ చేశారు. సీమాంధ్ర ప్రజలు ఉద్యమం చేస్తుంటే తాను ఇంట్లో ఉండలేనని అంటున్న ఆయన తెలంగాణ ప్రజలు సకల జనుల సమ్మె చేస్తున్న కాలంలో ఎందుకు ము ఖం చాటేశారని ప్రశ్నించారు. ఈ నెల 29న రాజధానిలో జరగనున్న సకలజన భేరి సన్నాహక సమావేశాన్ని గురువారం స్థానిక పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. తెలంగాణలో చంద్రబాబు అడ్రస్ గల్లంతైనట్లేనన్నారు. జగన్ ఎవరిని ఓదార్చేందుకు తెలంగాణకు వస్తారో చెప్పాలన్నారు. రాష్ట్ర ఏర్పాటును అడ్డుకుంటున్న నేతలెవ్వరిని తెలంగాణ ప్రజలు తిరుగనివ్వరన్నారు. హైదరాబాద్ ఫ్రీజోన్ కాదని ప్రకటించిన సీఎం ఇప్పుడు హైదరాబాద్‌పై చర్చ జరగాలన డం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఖాయమైందని, లాంఛనం మాత్రమే మిగి లిందని పేర్కొన్నారు. పార్లమెంటులో తెలంగాణకు మద్దతుగా 400 మంది ఎంపీలున్నారన్నారు. హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా పెట్టుకుంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగినా అర్థం ఉండదన్నారు.
టీ.ఉద్యమ అణిచివేతకు ‘నక్సల్స్’ నిధులు
నక్సల్స్ ఉద్యమాన్ని అణిచివేతకు కేటాయించిన నిధులను సీమాంధ్ర పాలకులు తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేసేందుకు వినియోగించారని తెలంగాణ గెజి టెడ్ అధికారుల సంఘం నేత శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు.ఆసియాలోనే పేరు న్న నిజాం షుగర్స్ వంటి కర్మాగారాలను సీమాంధ్ర పెట్టుబడిదారులకు కట్టబెట్టారని విమర్శించారు. తెలంగాణ ఏర్పాటు ఆవశ్యకత విద్యార్థులకే ఎక్కు వ ఉందన్నారు. తెలంగాణలోని ఉద్యోగాలను దో పిడీ చేయడంతో ఇక్కడి నిరుద్యోగులు వలసలు వెళ్లాల్సి వస్తోందన్నారు. ఇక్కడి యువతకు సినీరంగంలో ఎంతో ప్రతిభ ఉన్నప్పటీకీ సీమాంధ్రుల ఆధిపత్యంలో నెగ్గుకురాలేకపోతున్నారన్నారు. తెలంగాణ పాలిటెక్నిక్ విద్యార్థి జేఏ సీ చైర్మన్ అక్షయ్‌కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు బిగాల గణేష్ గుప్తా, జిల్లా జేఏసీ చైర్మన్ గోపాల్‌శర్మ, టీఎన్‌జీఓ నేత గైనిగంగారాం, టీజీఓ నేత బాబూరామ్, టీఆర్‌ఎస్ జిల్లా అధికార ప్రతినిధి సుజీత్‌సింగ్, టీజీపీఏఎల్‌ఏ నేతలు ఎం.మనోహర్‌రెడ్డి, వై.నర్సయ్యగౌడ్, ఎం.మురళీధర్ గు ప్తా, బి.రాజు, బి.శ్రావణ్‌కుమార్, టి.లక్ష్మయ్య, కాంట్రాక్టు లెక్చరర్ల సంఘం నేత రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.
‘తెలంగాణ’ను ఎవరూ అడ్డుకోలేరు
Published Fri, Sep 27 2013 4:12 AM | Last Updated on Fri, Aug 10 2018 7:58 PM
Advertisement
Advertisement