అప్రమత్తంగా ఉండాలి | To be vigilant | Sakshi
Sakshi News home page

అప్రమత్తంగా ఉండాలి

Published Sat, Sep 24 2016 11:24 PM | Last Updated on Mon, Sep 4 2017 2:48 PM

అప్రమత్తంగా ఉండాలి

అప్రమత్తంగా ఉండాలి

  • ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు
  • కడవెండి (దేవరుప్పుల) : వరద బాధితులకు సాయం అందించడంలో  అధికారులు అప్రమత్తంగా ఉండాలని పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు సూచించారు. భారీ వర్షాల కారణంగా  దెబ్బతిన్న మండలంలోని కడవెండి, మాధాపురం, దేవరుప్పుల, పెద్దమడూరు, సీతారాంపురం గ్రామాలను శనివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వర్షాలతో కలిగే అనర్థాలను ఎదుర్కొనేందుకు ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉండాలన్నారు. వర్షాలతో ప్రమాదం పొంచి ఉన్న చెరువులు, కుంటలను ముందే గుర్తించి నివారణ చర్యలు తీసుకోవాలన్నారు. మండలంలో వర్షాలతో జరిగిన నష్టాన్ని పారదర్శకంగా పరిశీలించి నివేదిక తయారు చేయాలని ఆదేశించారు. 
     
     
    కోడూరు చెరువుకు గండి  
    కోడూర్‌ (రఘునాథపల్లి) : భారీ వర్షాలతో మండలంలోని కోడూరు పెద్ద చెరువుకు శనివారం గండి పడింది. రెండు రోజుల క్రితం చెరువు క ట్టకు బుంగ పడగా.. ఇరిగేష¯ŒS అధికారులు, కాంట్రాక్టర్‌ ఇటాచీతో దా నిని పూడ్చినా ఫలితం లేకుండా పోయింది. చెరువు కింద కోడూరుతో పాటు రామన్నగూడెంకు చెందిన 212 ఎకరాల ఆయకట్టు ఉంది. చెరువును పునరుద్ధరించేందుకు మిష¯ŒS కాకతీయ –2లో ప్రభుత్వం రూ. 60.90 లక్షలు మంజూరు చేసింది. కాగా, కాంట్రాక్టర్, అధికారులు పనులను నిర్లక్ష్యం చేయడంతో చెరువుకు ప్రమాదం ఏర్పడింది. ఈ క్రమం లో తెల్లవారుజామున చెరువుకు గండి పడి నీరంతా వృథాగా పోతోంది. మిష¯ŒS కాకతీయలో ప్రభుత్వం లక్షలు మంజూరు చేసినా కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యంతో తాము తీవ్రంగా నష్టపోయామని ఆయకట్టు రైతులు ఆరోపిస్తున్నారు. అధికారులు స్పందించి గండిని పూడ్చి నీటి వృథాను అరికట్టాలని కోరారు. ఈ విషయమై డీఈ యశ్వంత్‌ను వివరణ కోరగా.. కోడూరు చెరువుకు గండి పడిన విషయాన్ని ఎస్‌ఈ దృష్టికి తీసుకెళ్లామన్నారు. నీటి వృథాను అరికట్టేందుకు రింగ్‌ బండ్‌ వేస్తామన్నారు.
    మత్తడి పరవళ్లు   
    గోవిందరావుపేట : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో మండలంలోని లక్నవరం సరస్సు, గుండ్లవాగు ప్రాజెక్టులు మత్తళ్లు పోస్తూ జలకళను సంతరించుకున్నాయి. జులై నెలాఖరులో నిండిన సరస్సులు.. తర్వాత ఖరీఫ్‌ కోసం సాగునీటి విడుదల చేయడంతో తగ్గాయి. మూడు రోజుల క్రితం వరకు లక్నవరం సరస్సులో 30 అడుగుల 9 అం గుళాల నీరు ఉండగా.. ప్రస్తుతం 34 అడుగులకు చేరి మత్తడి పడుతోంది. దీంతో దయ్యాలవాగు, గుండ్లవాగులు ఉధృతంగా ప్రహహిస్తున్నాయి. ఇప్పటికే ముత్తాపురం, మొట్లగూడెం, ఇప్పలగడ్డ వాసులకు వాగులతో ఇబ్బందులు ఎదురవుతుండగా..మరోసారి వర్షం పడిందంటే వారు బయటికి రాలేని పరిస్థితి ఏర్పడుతోంది.
     
     
    వరదకు తెగిన వల్మిడి–ముత్తారం రోడ్డు 
    పాలకుర్తి : మండలంలో నాలుగు రోజుల నుంచి కుండపోతగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఈ మేరకు శనివారం ఉదయం వరద ఉధృతికి మండలం లోని వల్మిడి– ముత్తారం గ్రామాల మధ్య ఉన్న బీటి రోడ్డు సగం వరకు తెగిపోయింది. దీంతో రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. కాగా, అయ్యంగారిపల్లి గ్రామంలోని మొండి కుంటకు కూడా గండి పడింది. 
     
    ఉప్పుగల్లులో ఉబికి వస్తున్న నీరు  
    జఫర్‌గఢ్‌ : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో భూగర్భజలాలు బాగా పెరిగి నీరు ఉరకలెత్తుతోంది. మండలంలోని ఉప్పుగల్లుకు చెందిన నల్లబోయిన రమేష్‌ అనే రైతు గత వేసవిలో తన చేనులో 100 ఫీట్ల లోతుతో బోరు వేయించాడు. అయితే అప్పుడు బోరులోంచి నీరు రాకపోవడంతో మరో చోట వేయించాడు. కాగా, ముందుగా వేయించిన బోరులో నుంచి ఏకధాటిగా నీరు ఉబికి వస్తుండడంతో రమేష్‌ సంతోష పడుతున్నాడు. ఇదిలా ఉండగా, ఈ ప్రాంతానికి చెందిన కొందరు రైతులు గతంలో 250 ఫీట్ల లోతుతో బోర్లు వేయించుకున్నా చుక్క నీరు రాకపోవడం గమనార్హం.
     
     
    మొలకెత్తిన మక్కలు  
    సంగెం : భారీ వర్షాలతో మండలంలో వివిధ రకాల పంటలు దెబ్బతింటున్నాయి. ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలతో చేతికి వచ్చిన మొక్కజొన్న, పత్తి, పెసర, నువ్వు పంటలు పాడైపోతున్నాయి. కోసిన మక్కలను ఆరబెట్టుకుంటున్న సమయంలో వానలు పడుతుండడంతో మొలకెత్తుతున్నాయి. దీంతో వేలాది రూపాయలు పెట్టుబడి పంటలను సాగు చేసిన రైతులు నష్టాల్లో కూరుకుపోతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement