శ్రీకాకుళం: అధికారం దూరమైనా టీడీపీ నాయకులు ఆ దర్పాన్ని మాత్రం వదులుకోలేకపోతున్నారు. అభివృద్ధి పనులు చూసి ఓర్వలేక ఏకంగా దాడులకు పాల్పడుతున్నారు. కంచిలి మండలం పెద్దశ్రీరాంపురం సర్పంచ్ బల్లెడ సుమన్‌పై ఇలాగే టీడీపీ మా జీ సర్పంచ్ మాదిన రామారావు, కుటుంబ సభ్యులు సోమవారం దాడి చేశారు. పెద్దశ్రీరాంపురం పంచాయతీ సర్పంచ్ బల్లెడ సుమన్.. గ్రామ సచివాలయం, అంగన్‌వాడీ భవనం నిర్మాణాలకు అవసరమైన మట్టిని స్థానిక జెడ్పీ హైస్కూల్ వెనుక గల చెరువులో తవ్విస్తుండగా, మాజీ సర్పంచ్ మాదిన రామారావు, ఆయన కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. ఇక్కడ చెరువులో మట్టి తవ్వడానికి వీల్లేదంటూ వాదనకు దిగారు.
దీంతో సుమన్, ట్రాక్టర్ నడుపుతున్న సుమన్ తండ్రి ప్రకాశరావులతో మాజీ సర్పంచ్ రామారావు, మిగతా కుటుంబసభ్యులు ఘర్షణ పడ్డారు. ఈ దశలో సర్పంచ్ సుమన్‌పైన మాజీ సర్పంచ్ రామారావు, ప్రణీత్‌లు కర్రతో దాడి చేయడంతో సర్పంచ్ గాయపడ్డారు. తర్వాత సర్పంచ్ సుమన్ ప్రధాన రహదారిపై కూర్చుని నిరసన వ్యక్తం చేశా రు. గ్రామాభివృద్ధి కోసం పనులు చేస్తుంటే దాడి చేశారని ఆరోపించారు. పోలీసులు నచ్చజెప్పడంతో నిరసన విరమించి దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. మాదిన రామారావు కూడా సర్పంచ్, ఆయన అనుచరులు తమపై దాడి చేశారంటూ ఫిర్యాదు చేయగా.. ఇరు వర్గాలపై పోలీసులు కేసు నమోదు చేశారు.
జెడ్పీ చైర్ పర్సన్ పరామర్శ
సోంపేట: టీడీపీ నాయకుల దాడిలో గాయపడి న సర్పంచ్ సుమన్, తదితరులు సోంపేట ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్నారు. ఆయనను జెడ్పీ చైర్ పర్సన్ పిరియా విజయ, వైఎస్సార్‌సీపీ ఇచ్ఛాపురం నియోజకవర్గ సమన్వయకర్త, మా జీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్ పరామర్శించారు. సుమన్‌కు ధైర్యం చెప్పి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకునేలా చూస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ నిమ్మన దాసు, కంచిలి ఎంపీపీ పైల దేవదాస్‌రెడ్డి, పొడుగు కామేష్, బుద్ధాన శ్రీకృష్ణ, రౌతు విశ్వనాథం, బంగారు పాపారావు, నగిరి శరత్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment