జనసేనకు టిక్కెట్‌ ఇస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా! | - | Sakshi
Sakshi News home page

జనసేనకు టిక్కెట్‌ ఇస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా!

Published Wed, Mar 13 2024 2:05 AM | Last Updated on Wed, Mar 13 2024 1:26 PM

- - Sakshi

జనసేన నాయకులను తరచూ అవమానిస్తున్న టీడీపీ నాయకులు

తాజాగా జనసేన కార్యకర్తలను కించపరిచేలా కలమట వెంకటరమణ వ్యాఖ్యలు

పాతపట్నం నియోజకవర్గంలో జనసేనకు నాయకత్వం ఎక్కడుందని ప్రశ్న

జనసేనకు పాతపట్నం టిక్కెట్‌ ఇస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని స్పష్టీకరణ

కలిసి పనిచేసేది లేదని పరోక్షంగా వెల్లడి

 సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : జనసేనపై టీడీపీ నాయకులు చులకన భావాన్ని చూపుతూనే ఉన్నారు. పొ త్తు కుదిరినా ఎప్పటికప్పుడు, ఎక్కడికక్కడ తక్కువ చేస్తూ మాట్లాడుతూనే ఉన్నారు. శంఖారావం కార్యక్రమంలో భాగంగా లోకేష్‌ జిల్లాకు వచ్చినప్పుడు దాదాపు ప్రతి చోటా అవమాన పరిచారు. కొన్నిచోట్లైతే సభా ప్రాంగణంలోకి వచ్చిన జనసైనికులపై చేయి చేసుకున్నారు. అయినా అధినేత మాటకు తలొగ్గి ఇష్టం లేకపోయినా టీడీపీ నాయకులతో కలిసి వెళ్తున్నారు. కానీ జనసైనికులకు అంత సీన్‌ లేదంటూ టీడీపీ నాయకులు తీసి పారేస్తున్నారు. తాజాగా పాతపట్నం నియోజకవర్గం మాజీ ఎమ్మె ల్యే, టీడీపీ ఇన్‌చార్జి కలమట వెంకటరమణ చేసిన వ్యాఖ్యలు జనసేన పార్టీ నాయకులను మరింత అవమానపరిచాయి. జనసేనలో ఇక్కడంత నాయకుల్లేరని, ఒకవేళ జనసేనకు టిక్కెట్‌ ఇస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానే తప్ప కలిసి పనిచేసే ది లేదని చెప్పడం చర్చనీయాంశమైంది.

‘టీడీపీ నాయకులతో కలిసి నడవండి... ఒక మాట అన్నా పడండి.. పొత్తులో భాగంగా సాగండి. నా విధానాలు నచ్చి నాతో నడిచే వారే నా మను షులు. కాదన్న వారంతా కోవర్టులే...నా వ్యూహం ప్రకారంగా నడుచుకోవాలి. లేదంటే పార్టీ నుంచి వెళ్లిపోవచ్చు’ తరచూ జనసైనికులను ఉద్దేశించి పవన్‌ కల్యాణ్‌ చేస్తున్న వ్యాఖ్యలివి. ఈ వ్యాఖ్యలను అలుసుగా తీసుకుంటున్న టీడీపీ నాయకులు తర చూ జనసేన కార్యకర్తలను చులకనగా చూస్తున్నా రు. ఆ కారణంగా జిల్లాలో చాలాచోట్ల జనసైనికులు టీడీపీ నాయకులతో కలిసి వెళ్లడానికి ఆసక్తి చూపడం లేదు. కొందరు తప్పదనే పరిస్థితుల్లో వెళ్తున్నారు. అయిష్టంగా కలిసి వస్తున్న చోట కూడా ఆ పార్టీ నాయకులను టీడీపీ నాయకులు తేలికగా తీసుకోవడమేకాకుండా అవమానపరుస్తున్నారు.

రాజకీయాల నుంచి తప్పుకుంటా..
తాజాగా పాతపట్నం నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జి కలమట వెంకటరమణ ఓ మీడియాతో మా ట్లాడుతూ జనసేన పరువు తీసేశారు. పొత్తులో భాగంగా పాతపట్నం జనసేనకు కేటాయిస్తే మీరే మి చేస్తారని ఆ విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ అసలు పాతపట్నంలో జనసేనకు అంత నాయకులు ఎక్కడున్నారని ప్రశ్నించారు. అంతటితో ఆగలేదు ఒకవేళ పొత్తులో భాగంగా జనసేనకు ఇస్తే రాజకీయాలకు నమస్కారం పెట్టి రాజకీయాల నుంచి తప్పుకుంటానే తప్ప ఈ కలమటోళ్లు ఎప్పుడూ కూడా ఇలా కింద చేయి ఉండే పరిస్థితి లేదని తేల్చి చెప్పేశారు. ఇప్పుడీ వ్యాఖ్య లు నియోజకవర్గంలోనే కాదు జిల్లాలోనే చర్చనీయాంశంగా మారాయి.

ఆవేదనలో జనసైనికులు
తనకు టిక్కెట్‌ ఇస్తే జనసేన పనిచేయాలే తప్ప తా ను మాత్రం పొత్తులో భాగంగా జనసేనకు టిక్కెట్‌ ఇస్తే చేసేది లేదని చెప్పడం తమను అవమాన పరచడమేనని జనసైనికులు భావిస్తున్నారు. తమకు ఇష్టం లేకపోయినా అధినేత మాటకు కట్టుబడి టీడీపీతో ముందుకు సాగుతుంటే అడుగడుగునా తమను అవమానపరుస్తున్నారని, ఓటేసినప్పుడు బుద్ధి చెబుతామంటూ కొందరు జనసైనికులు వాపోతున్నారు. తమ పరిస్థితి చూస్తుంటే పిలవని పేరంటానికి వెళ్తున్నట్టుగా ఉందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement