గలీజు పనులు గుర్తులేవా..? | - | Sakshi
Sakshi News home page

గలీజు పనులు గుర్తులేవా..?

Published Sun, Feb 18 2024 12:48 AM | Last Updated on Sun, Feb 18 2024 1:59 PM

- - Sakshi

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: పై చిత్రంలో ఉన్న భవనం పాత శ్రీకాకుళం పరిధిలోని 80 అడుగుల రోడ్డులో ఎన్‌టీఆర్‌ భవన్‌ పేరుతో కొనసాగుతున్న టీడీపీ కార్యాలయం. గత ఎన్నికలకు నాలుగు నెలలు ముందు ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబునాయుడు దీని నిర్మాణం ప్రారంభించారు. రెండెకరాల విస్తీర్ణంలో పార్టీ కార్యాలయం నిర్మాణం చేపట్టారు. అయితే ఈ స్థలాన్ని ఆ పార్టీ కొనలేదు.

ఎన్నో ఏళ్ల కిందట దళితుల సంక్షేమం కోసం సేకరించి ఉన్న సాంఘిక సంక్షేమ శాఖకు చెందిన స్థలమిది. అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు తన పార్టీ కార్యాలయం కోసం రూ. 80కోట్ల విలువైన రెండెకరాల భూమిని 99 ఏళ్లకు లీజు కింద తన పార్టీకి కట్టబెట్టేశారు. ఇంతటి విలువైన భూమిని సంవత్సరానికి కేవలం రూ. 25వేలు ఫీజుతో 99 ఏళ్ల లీజుకింద ధారాదత్తం చేశారు. ఇప్పుడు రూ.80కోట్లకు పైగా విలువ ఉన్న భూమి కోసం 99 ఏళ్ల కాల వ్యవధిలో రూ.24.75లక్షలు మాత్రమే చెల్లించనుంది. 

ఇంత జరిగినా ‘ఈనాడు’కు ఇందులో తప్పన్నదే కనిపించలేదు. ఇప్పుడు టీడీపీ అధికారం కోల్పోయాక వైఎస్సార్‌సీపీపై దుష్ప్రచారం చేయడమే పనిగా పెట్టుకుంది. 99 ఏళ్లకు లీజుకు ఇచ్చినప్పుడు అక్షరం ముక్క కూడా అచ్చేయకుండా ఇప్పుడు అదే పనిగా ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తోంది.

పేదలకు సెంటు స్థలం ఇవ్వకపోయినా..
అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో పేదవాళ్లకు సెంటు స్థలం కూడా టీడీపీ ప్రభుత్వం ఇవ్వలేదు. పేదలు దరఖాస్తు చేసుకోవడమే తప్ప స్థలాలు మంజూరు చేసిన దాఖలాల్లేవు. టీడీపీ ప్రభుత్వం ఉన్నంతకాలం తమ పార్టీ నాయకులు ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి, రికార్డులు మార్చేసి కాజేశారే తప్ప పేద వాడికి మేలు చేసిన సందర్భాల్లేవు. ఏ ఒక్కరికీ సెంటు స్థలమివ్వని టీడీపీ ప్రభుత్వం తమ పార్టీ కార్యాలయం కోసం మాత్రం నగరంలో ఎంతో విలువైన రెండు ఎకరాల భూమిని కేటాయించింది.

ఖరీదైన ప్రాంతంలో...
పాత శ్రీకాకుళం పరిధిలోని 80అడుగుల రోడ్డులో షెడ్యూల్‌ కులాల ఇళ్ల స్థలాల కోసం సాంఘిక సంక్షేమ శాఖ కొన్నేళ్ల కిందట భూమిని రైతుల నుంచి సేకరించింది. నిర్దేశిత మొత్తాన్ని చెల్లించి కొనుగోలు చేసింది. అందులో వివిధ అవసరాలకు వినియోగించగా రెండెకరాల భూమి మిగిలి ఉంది. కొన్నాళ్లుగా ఖాళీగా ఉంది. ఇంతలో టీడీపీ అధికారంలోకి వచ్చింది. దాంతో టీడీపీ నేతల కన్ను ఖాళీ భూమిపై పడింది. దాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని పథక రచన చేశారు. ఇంకేముంది చేతిలో ఉన్న అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆ భూమిని కొట్టేసేందుకు పావులు కదిపారు. కింద స్థాయి నుంచి పైస్థాయి వరకు అధికారులు వత్తాసు పలికారు. చకచకా ఫైలు కదిపి 2015 సెప్టెంబర్‌ 4వ తేదీన టీడీపీ కార్యాలయం కోసం కేటాయించేశారు. టౌన్‌ సర్వే నెంబర్‌ 700–1లో 1.29ఎకరాలు, టౌన్‌ సర్వే నంబర్‌ 701–1లో 71సెంట్లు భూమిని టీడీపీకి అప్పగించేశారు.

జీఓలు మార్చి..
పార్టీ కార్యాలయాల కోసం ప్రభుత్వ భూమిని కేటాయించడం ఆనవాయితీగా వస్తోంది. పార్టీ కార్యాలయాల కోసం స్థలాలు కేటాయింపులు చేసేందుకు తగు నిబంధనలు కూడా ఉన్నా యి. గుర్తింపు కలిగిన పార్టీ రాష్ట్ర, జిల్లా కార్యాలయాల కోసం ఒక ఎకరా భూమిని 33 ఏళ్లకు నామినల్‌ లీజు కింద కేటాయించవచ్చు. కానీ చంద్రబాబు ప్రభుత్వం ఆ జీఓను కాదని కొన్ని షరతుల పెట్టి మరో జీఓ కింద ఏకంగా రెండెకరాలు కేటాయించింది. వాస్తవానికి తొలుత ఎకరా భూమి కోసమే జిల్లా పార్టీ తరఫున దరఖాస్తు చేశారు. అక్కడున్న మొత్తం భూమిని తీసేసుకుంటే భవిష్యత్‌లో ఎవరూ రారని, ఎలాంటి ఇబ్బందులు ఉండవని కొందరు అధి కారులు, మరికొందరు పార్టీ నేతలు సూచించ డంతో రెండో దరఖాస్తు చేశారు. ఖాళీగా ఉన్న రెండెకరాల భూమిని తమకే ఇవ్వాలని దరఖా స్తు చేయడం, దానికి అధికారులు వత్తాసు పలకడంతో చకాచకా ఫైలు కదిపారు. తమ ప్రభుత్వమే ఉండటంతో రాజధాని స్థాయిలో ఆమోద ముద్ర వేయించారు.

కేవలం రూ.25వేల లీజుకు ధారాదాత్తం..
దాదాపు రూ. 80కోట్ల విలువైన భూమిని సంవత్సరానికి రూ. 25వేల లీజు చొప్పున 99 ఏళ్లకు కట్టబెట్టారు. సాధారణంగా 33 ఏళ్లకు లీజుకు కేటాయిస్తుంటారు. కానీ అధికారం చేతిలో ఉండటంతో తమ పార్టీ కార్యాలయం కోసం ఏకంగా 99 ఏళ్లకు లీజుకిచ్చేశారు. దీంతో ఈ స్థలం దాదాపు టీడీపీ చేతిలోకి వెళ్లిపోయినట్టే. వ్యూహాత్మకంగా కారు చౌకగా కొట్టేసిన భూమిలో పార్టీ కార్యాలయం నిర్మించిన చంద్రబాబు ఎన్నికలకు నాలుగు నెలల ముందు స్వయంగా వచ్చి ప్రారంభోత్సవం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement