మునగపాక : తాను నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి శక్తివంచన లేకుండా సేవలందిస్తుంటే బీఎల్వో ప్రవీణ తాను గ్రామంలో లేనంటూ తనకు నోటీసు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని మెలిపాక సర్పంచ్ అయినంపూడి విజయభాస్కరరాజు ప్రశ్నించారు. సర్పంచ్ స్థానికంగా నివాసం లేరంటూ బీఎల్వో బుధవారం నోటీసు ఇచ్చారు. దీనిపై విజయభాస్కరరాజు స్పందించారు.
ప్రతిపక్ష పార్టీకి చెందిన కొంతమంది తాను గ్రామంలో నివాసం లేనంటూ ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ చేపట్టకుండా నోటీసులు ఇవ్వడాన్ని తప్పుపట్టారు. బీఎల్వోలు తమకు వచ్చిన ఫిర్యాదులపై నిష్పక్షపాతంగా విచారణ చేపట్టాల్సి ఉండగా కేవలం ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకువచ్చేలా ప్రవర్తించడం సరికాదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష పార్టీకి చెందిన వారి మాటలు నమ్మి, తప్పుడు నోటీసులు అందించిన బీఎల్వోపై చర్యలు తీసుకోవాలని విజయభాస్కరరాజు డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment