పంచాయతీ ఎన్నికల్లో లెక్కలు ఇవ్వకుంటే అనర్హులే!
Published Sun, Aug 18 2013 4:56 AM | Last Updated on Fri, Sep 1 2017 9:53 PM
మహబూబ్‌నగర్ మెట్టుగడ్డ, న్యూస్‌లైన్: ‘‘మేం గెలుస్తామనుకోలేదు.. ఎ వరికీ పోటీ ఇవ్వలేదు. ఏదో అదృష్టం పరీక్షించుకుందామని పంచాయతీ ఎన్నికల్లో పోటీచేశామంతే!, ఎలాగు గెలిచి తీరాం.. లెక్కలు మాకెందుకు’ అని ఏ మాత్రం నిర్లక్ష్యం వహించారో ఇక అంతే సంగతులు. వారు మూడేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులుగా భావించాల్సి ఉంటుం దని ఎన్నికల కమిషన్ తేల్చిచెప్పింది. పంచాయతీ ఎన్నికల్లో గెలిచినా, ఓడినా లెక్క లు మాత్రం విధిగా ఇవ్వాల్సిందే. లెక్కలు ఇవ్వని వారిపై కొరడా ఝుళిపించి మూడేళ్లపాటు వారిని ఎన్నికలకు అనర్హులుగా ప్ర కటించేందుకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. లెక్కల విషయం తేల్చేందుకు 45 రోజుల డెడ్‌లైన్ విధించింది. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులు నిబంధనావళి ప్రకారం కచ్చితంగా ఎన్నికల ఖర్చుల వివరాలు సమర్పించాలి. అయితే జిల్లాలో చాలామంది అభ్యర్థులు ఇప్పటివరకు లెక్కలు చూపలేదు.
గతంలో కేవలం గెలుపొందిన అభ్యర్థులు మాత్రమే అధికారులకు లెక్కలు స మర్పించేవారు. తాజాగా ఓడిపోయిన అ భ్యర్థులు కూడా లెక్కలు చూపాలని అధికార యంత్రాంగం తేల్చిచెప్పింది. దీంతో చాలామంది పోటీదారులకు సంకటస్థితి ఏర్పడింది. జిల్లాలో 1324 పంచాయతీలు ఉండగా, 13464 వార్డు స్థానాలు ఉన్నా యి. సర్పంచ్ స్థానాలకు 3843 మంది, వార్డు స్థానాలకు 27,655 మంది పోటీచేశారు. వీరంతా ఎన్నికల ప్రచారంలో చేసిన ఖర్చుల వివరాలను తెలుపాల్సి ఉంది. కాగా ఎన్నికల ప్రచారానికి సంబంధించి ఖర్చుల వివరాలు, నమోదు తదితర వాటి నమోదు కోసం మండలానికి ఒక ఆడిటర్‌ను నియమించింది. ఆడిటర్లు ఇచ్చే ఖర్చుల వివరాలను ఆయా ఎంపీడీఓలకు సమర్పించాల్సి ఉంటుంది. ఆ ఖర్చుల జాబితా వివరాలను నేటికీ జిల్లా శాఖ కార్యాలయాలకు సమర్పించలేదు.
విచ్చలవిడిగా డ బ్బు ఖర్చు
ఎన్నికల నిబంధనల ప్రకారం 10వేల జ నా భా గల పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థు లు రూ.40వేలు, వార్డు అభ్యర్థులు రూ.10 వేలు, అలాగే మైనార్ పంచాయతీల్లో సర్పంచ్ అ భ్యర్థులు రూ.10 వేలు, వార్డు అభ్యర్థులు ఐదువేలను ఎన్నికల కోసం ఖర్చుచేయాల్సి ఉంటుంది. అయితే జిల్లా లో గతనెల 23, 27, 31 తేదీల్లో మూడు దఫాలుగా జరిగిన ఎన్నికల్లో మేజర్, మైనర్ పంచాయతీ అనే తేడా లేకుండా చాలా మంది లక్షల్లో ఖర్చుచేశారు. మద్యం ఏరులై పారింది. కొన్నిచోట్ల డబ్బును విచ్చలవిడిగా పంపిణీ చేయ గా.. మరికొన్ని చోట్ల చీరలు, ఇతర వస్త్రా లు పంపిణీ చేశారు. మొత్తంగా అసెంబ్లీ ఎన్నికలను తలపించే రీతిలో రూ.10లక్షల నుంచి రూ.30లక్షల వరకు ఖర్చుచేశారు. వీటన్నింటికి అభ్యర్థులు లెక్కలు ఎలా చూపుతారో వేచిచూడాల్సిందే..
45 రోజల్లో సమర్పించాలి..
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధిం చిన ఖర్చుల వివరాలను కచ్చితంగా సమర్పించాల్సి ఉంటుంది. లేకపోతే వారిపై అనర్హత వేటువేయక తప్పదు. లెక్కలు సమర్పించేందుకు ప్రభుత్వం 45 రోజుల గడువు విధించింది. జాబితాను ఎంపీడీఓల ద్వారా తీసుకుని ప్రభుత్వానికి నివేదిస్తాం. అందుకు అవసరమైన చర్యలు చేపట్టాం.
- రవీందర్, డీపీఓ
Advertisement
Advertisement