
సాక్షి, హైదరాబాద్: పంచాయతీ ఎన్నికల్లో పదవుల వేలంపై చట్టప్రకారం కఠినచర్యలు తీసుకోవాలని డీజీపీని రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) కమిషనర్ వి.నాగిరెడ్డి కోరినట్టు సమాచారం. కొన్ని తండాల్లో చోటుచేసుకున్న ఉదం తాలను కూడా డీజీపీ దృష్టికి తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో 17 ఎఫ్‌ఐఆర్‌లను నమో దు చేసి, 12 కేసుల్లో చర్యలు తీసుకున్నట్టు ఎస్‌ఈసీ తెలిపింది. మరో 2 కేసులు పెండింగ్‌లో ఉన్నట్టుగా తెలియజేసింది. గురువారం ఈ మేరకు డీజీపీకి ఎస్‌ఈసీ ఒక నివేదికను అందజేశారు. గురువారం జగిత్యాల జిల్లాలో 5 కేసు లు (వాటిలో రెండు కేసుల్లో రాజకీయపార్టీ, అభ్యర్థుల ప్రమేయం), వనపర్తి, ఖమ్మం జిల్లాల్లో నాలుగేసి కేసులు, సైబరాబాద్‌లో ఒక కేసు నమోదు చేసినట్టు పేర్కొంది. ఈ ఎన్నిక ల్లో భాగంగా దాదాపు రూ. 1.18 కోట్ల వరకు (మొత్తం ఖమ్మం జిల్లాల్లోనే) డబ్బు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. జగిత్యాల, వనపర్తి, కరీంనగర్, ఖమ్మం, రామగుండం జిల్లాల్లో రూ. 3 లక్షల విలువైన వస్తువులు స్వాధీనం చేసుకున్నట్టు ఈ నివేదికలో తెలిపింది.
వారిపై చర్యలు తీసుకోండి
బలవంతపు ఒత్తిళ్లు, బహిరంగవేలం పాటల ద్వారా ఏకగ్రీవాలు లేదా ఒకే నామినేషన్ దాఖ లైనట్టుగా చూపిన వాటి ఫలితాల ప్రకటన నిలుపుదల చేయాలని నాగిరెడ్డిని తెలంగాణ ఎలక్షన్ వాచ్ సమన్వయకర్తలు ఎం.పద్మనాభరెడ్డి, చెలికానిరావు కోరారు. ఇవే పద్ధతులు నామినేషన్ల ప్రక్రియ ముగిసే వరకు కొనసాగే అవకాశాలున్నాయన్నారు. ఇలాంటి వాటిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఏకగ్రీవంగా ఎన్నికయ్యే పంచాయతీలకు రూ. 15 లక్షల ప్రోత్సాహకం అందిస్తామంటూ ఎమ్మెల్యేలు హామీనివ్వడం ఎన్నికల నియమావళికి వ్యతిరేకమని, ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామాభివృద్ధికమిటీలు, కుల సంఘా లు ఇతరత్రాల సంఘాల ద్వారా పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవ ఎన్నికల కోసం ఒత్తిళ్లు వస్తున్నాయని తెలిపారు. ఎక్కువ మొత్తం పాడే వాళ్లకు వేలం ద్వారా ఒకరే అభ్యర్థి నామినేషన్ దాఖలు చేసినట్టుగా చూపిస్తున్నారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment