కెరామెరి: తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లోని పరందోలి గ్రామ పంచాయతీకి మంగళవారం ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. కెరామెరి మండల పరిధిలో పరందోలి, అంతాపూర్ గ్రామ పంచాయతీలు అటు మహారాష్టతోపాటు ఇటు తెలంగాణ ప్రభుత్వాల పాలనలో కొనసాగుతున్నాయి. వీటిలో పరందోలి గ్రామ పంచాయతీకి మంగళవారం జరిగిన ఎన్నికల్లో 1,012 ఓటర్లకు గాను 839 మంది ఓటేశారు. ఈ గ్రామ పంచాయతీ పరిధిలో మొత్తం ఐదు గ్రామాలు ఉన్నాయి. కాగా, ఫలితాలు ఈ నెల 6న వెలువడనున్నాయి.