డుమ్మా కొట్టారు... సస్పెండయ్యారు
ముజఫర్నగర్: ఎన్నికల విధులు నిర్వహణకు డుమ్మా కొట్టిన ఇద్దరు ప్రభుత్వ ఉపాధ్యాయులపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్లో శుక్రవారం చోటు చేసుకుంది. రాష్ట్రంలో పంచాయితీ ఎన్నికలు గురువారం జరిగాయి. మహభారత్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు ఎస్ కె బల్యన్, మరో పాఠశాలకు చెందిన రోహత్ కౌశిక్లు ఈ ఎన్నికల విధులకు గైర్హాజరయ్యారు.
దీంతో వారిద్దరిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు అందింది. దాంతో విచారణకు ఆదేశించారు. ఆ వెంటనే వారిని సెస్పెన్షన్ చేస్తున్నట్లు ఉన్నతాధికారులు శుక్రవారం ప్రకటించారు. అనంతరం ఆదేశాలు జారీ చేశారు. అలాగే బల్యన్ను జిల్లా టీచర్స్ అసోసియేషన్ కార్యదర్శి పదవి నుంచి కూడా తొలగించారు.