సాక్షి, ఖమ్మం: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తున్న వేళ రాజకీయం రసవత్తరంగా మారింది. తాజాగా ఖమ్మం జిల్లాలో పాలిటిక్స్ ఆసక్తికరంగా మారాయి. సత్తుపల్లిలో అధికార బీఆర్‌ఎస్ పార్టీకి తుమ్మల వర్గీయలు బిగ్ షాకిచ్చారు. దీంతో, అక్కడి రాజకీయం హాట్‌టాపిక్‌గా మారింది.
వివరాల ప్రకారం.. సత్తుపల్లిలో బీఆర్‌ఎస్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. తుమ్మల వర్గీయులు మాజీ ప్రజా ప్రతినిధులు ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా తుమ్మల నాగేశ్వరరావును అవమానించేలా కేటీఆర్ మాట్లాడిన మాటలను వ్యతిరేకిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వానికి 500 మంది ప్రజాప్రతినిధులు రాజీనామా చేశారు.
కేటీఆర్ వ్యాఖ్యలపై భట్టి ఫైర్..
మరోవైపు ఖమ్మంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చదువుకున్న కేటీఆర్‌కు ప్రపంచజ్ఞానం ఉందనుకున్నాను. 150 ఏళ్ల కాంగ్రెస్ పార్టీపై వారెంటీ లేదు.. గ్యారెంటీ లేదు.. ముసలి నక్కా అని మాట్లాడం అదేం భాష. మీరు ఏం చెప్పాలనుకున్నారో చెప్పుకోండి.. కానీ, ఇదేం పద్దతి. నీ కంటే ఎక్కువ భాష మాట్లాడగలను. సభ్యతా, సంస్కారం అడ్డు వస్తోంది. ప్రభుత్వం, ప్రతిపక్షం రెండూ ఉండాలి. ప్రజలు ఇచ్చే దరఖాస్తు తీసుకునే ధైర్యం నీకు లేదు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. అడ్డగోలుగా మాట్లాడితే సహించేది లేదు.. ప్రజలు గమనిస్తున్నారు. కాంగ్రెస్‌కు ప్రజలు 75-80 సీట్లు ఇవ్వబోతున్నారు.
మేము ఆరు గ్యారెంటీలు ప్రకటించాం.. అధికారంలోకి వచ్చాక వంద రోజుల్లో వాటిని అమలు చేస్తాం. గ్యారెంటీలు ప్రజలకు చెందకుండా మీరు కుట్ర చేస్తున్నారు. మేము ప్రకటించాం.. బాగాలేకపోతే లేదని చెప్పండి. మీ కల్వకుంట్ల ఫ్యామిలీ కోసం కాదు.. ప్రజల కోసం గ్యారెంటీలు పెట్టాం. రేపు జరగబోయే ఎన్నికల్లో ఓట్లు కాంగ్రెస్‌కు వేస్తారు.. మీ బెదిరింపులకు కాదు. కేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావుకు ప్రజలకు బుద్ధి చెబుతారు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఇది కూడా చదవండి: ప్రధాని మోదీ వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్..
Comments
Please login to add a commentAdd a comment